కోయంబేడు “కోత” మాములుగా లేదుగా..మూడు రాష్ట్రాలకు?

మర్కజ్ మసీదు ప్రార్థనల తరహాలోనే కరోనా వ్యాప్తికి కోయంబేడు మార్కెట్ కారణమయింది. ఇక్కడ నుంచి దాదాపు మూడు రాష్ట్రాలకు కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందిందన్న అనుమానాలు [more]

Update: 2020-05-17 17:30 GMT

మర్కజ్ మసీదు ప్రార్థనల తరహాలోనే కరోనా వ్యాప్తికి కోయంబేడు మార్కెట్ కారణమయింది. ఇక్కడ నుంచి దాదాపు మూడు రాష్ట్రాలకు కరోనా వైరస్ వ్యాధి వ్యాప్తి చెందిందన్న అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు కోయంబేడు మార్కెట్ లో కరోనా కలకలంతో అప్రమత్తమయ్యాయి. ఇక్కడి నుంచి వేల సంఖ్యలో వ్యాప్తి చెంది ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఒక్క తమిళనాడులోనే ఈ మార్కెట్ నుంచి దాదాపు ఏడు నుంచి పదివేల మంది ఇతర జిల్లాలకు వెళ్లారని అధికారులు అంచనా వేస్తున్నారు.

అతి పెద్ద మార్కెట్…..

కోయంబేడు మార్కెట్ అతిపెద్ద కూరగాయల మార్కెట్. ఈమార్కెట్ కు తమిళనాడులోని అన్ని జిల్లాల నుంచి కూరగాయలు తీసుకువస్తుంటారు. తీసుకు వెళుతుంటారు. అలాగే ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పండిన కూరగాయలు సయితం కోయంబేడు మార్కెట్ కు వెళుతుంటాయి. అలాగే కర్ణాటక, కేరళ నుంచి కూడా కోయంబేడు నుంచి ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ గా దీన్ని పేర్కొంటారు.

కరోనా బయటపడటంతో…..

తాజాగా కోయంబేడు మార్కెట్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. ఇక్కడ కొందరు హమాలీల ద్వారా ఈ వ్యాధి సోకినట్లు ప్రభుత్వం భావించింది. అక్కడ ఉన్న హమాలీలందరినీ క్వారంటైన్ కు పంపింది. తమిళనాడులో ఆరువేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయితే ఒక్క చెన్నైలోనే మూడు వేల కేసులున్నాయి. అందులో కోయంబేడు మార్కెట్ లో వెయ్యికి పైగానే కేసులు నమోదయ్యాయి. దీంతో కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

ఏపీ నుంచి కూడా….

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి వందల సంఖ్యలో కోయంబేడు మార్కెట్ కు వెళ్లారని తెలుస్తోంది. మర్కజ్ తరహాలోనే వీరందరినీ గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. ఒక్క చిత్తూరు జిల్లా నుంచే రెండు వందల మంది వరకూ కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. కొందరిని క్వారంటైన్ కు పంపారు. మొత్తం మీద తమిళానాడులోని కోయంబేడు మార్కెట్ మూడు రాష్ట్రాలనూ ముప్పులోకి నెట్టేసింది.

Tags:    

Similar News