ఇప్పుడే కీలకం… ఇక్కడి నుంచి బయటపడితేనే?

కరోనా వైరస్ కట్టడి లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యంత్రాంగం పోరాడుతుంది. దేశంలో రెండో దఫా విధించిన లాక్ డౌన్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అడ్డుకునేందుకు ఉద్దేశించింది. ఈ [more]

Update: 2020-04-22 11:00 GMT

కరోనా వైరస్ కట్టడి లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో యంత్రాంగం పోరాడుతుంది. దేశంలో రెండో దఫా విధించిన లాక్ డౌన్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అడ్డుకునేందుకు ఉద్దేశించింది. ఈ దశ చాలా కీలకమని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మూడో స్టేజ్ గా పిలవబడే ఈ దశను అగ్ర రాజ్యాలు నిర్లక్ష్యం చేసి ఫలితం అనుభవిస్తున్నాయి. ఎవరి నుంచి వైరస్ సోకిందో తెలియకపోవడాన్నే మూడో దశగా చెబుతారు. తొలి దశలో విదేశాలనుంచి వచ్చిన వారు, రెండో దశలో వారి నుంచి ఈ వ్యాధి సోకిన వారు మూడో దశ ఎవరు వ్యాప్తి చెందించారో గుర్తించలేకపోవడమే. ఈ దశ ను విజయవంతంగా ఎదుర్కొనకపోతే నాలుగోదశలో మృత్యు గంటలు మోగనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో నివురుగప్పిన కోవిడ్ …

తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గట్టిగానే పెరుగుతుంది. రెండు ప్రభుత్వాలు రెడ్ జోన్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ గా వైరస్ కట్టడికి వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. యంత్రాంగం రేయింబవళ్లు కష్టపడుతున్నా కొన్ని జిల్లాల్లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ నెమ్మదిగా మొదలైంది. అదే ఇప్పుడు అందరిలో ఆందోళన పెరిగేలా చేస్తుంది. రెడ్ జోన్స్, బఫర్ జోన్స్ లో నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మూడు షిప్ట్ లలో రెడ్ జోన్స్ పై నిఘా పెంచారు.

ఎన్ని చర్యలు తీసుకున్నా…..

ఇలా ఎన్ని తీసుకున్నా తెలంగాణ లోని సూర్యాపేట లో 80 పాజిటివ్ కేసులవరకు పెరగడం అధికారయంత్రాంగం కి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మూడో దశ ను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలను కాపాడుకోవాలన్న తాపత్రయమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ప్రయత్నం విజయవంతం కావడం విఫలం ప్రజల చేతుల్లోనేవుంది. వారు ఇంటి దగ్గరే ఉంటే మాత్రమే క్షేమంగా ఉండగలరు. లేని పక్షంలో తమతో పాటు కుటుంబ సభ్యులకు తోటివారికి ఆ తరువాత సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టినవారు అవుతారు.

Tags:    

Similar News