కట్టడికి నవీన్ కొత్త ప్రయత్నం…. వర్క్ అవుట్ అవుతుందా?

ఒడిశా రాష్ట్రంలో కరోనా కట్టు తప్పుతోంది. దీంతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కఠినతరమైన ఆంక్షలను విధించింది. ఆగస్టు 31వ తేదీ వరకూ విద్యాసంస్థలను మూసి వేయాలని నిర్ణయించింది. [more]

Update: 2020-07-05 18:29 GMT

ఒడిశా రాష్ట్రంలో కరోనా కట్టు తప్పుతోంది. దీంతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం కఠినతరమైన ఆంక్షలను విధించింది. ఆగస్టు 31వ తేదీ వరకూ విద్యాసంస్థలను మూసి వేయాలని నిర్ణయించింది. అలాగే రాత్రిపూట కర్ఫ్యూను 9గంటల నుంచే విధించాలని కూడా ఒడిశా ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అన్ లాక్ 2 లో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసినప్పటికీ కేసులు పెరుగుతున్న దృష్ట్యా నవీన్ పట్నాయక్ కొన్ని ఆంక్షలను విధించారు.

కేసులు పెరుగుతుండటంతో….

ఒడిశా రాష్ట్రంలో ఇప్పటి వరకూ కరోనా పాజటివ్ కేసులు సుమారు ఎనిమిది వేలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలక కూడా కరోనా వ్యాప్తి చెందుతుండటం నవీన్ పట్నాయక్ ను ఆందోళనకు గురి చేస్తుంది. అందుకే ఆంక్షలను సడలించ కూడదని భావిస్తున్నారు. ప్రజారోగ్యం కోసం కొంత కఠినంగా వ్యవహరించినా తప్పులేదని నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు.

షట్ డౌన్ చేయాలని….

పది జిల్లాల్లో కఠినంగా ఆంక్షలు విధించాలని నిర్ణయించారు. పది జిల్లాల్లో వీకెండ్స్ లో సంపూర్ణ లాక్ డౌన్ ను పెట్టాలని నవీన్ పట్నాయక్ అధికారులను ఆదేశించారు. ఎక్కువ కేసులు నమోదవుతున్న గజపతి, గంజాం, కటక్, ఖుర్బా, జాజ్ పూర్, జగత్సింగ్ పూర్, ఝార్సుగూడ, కేంఝర్, బాలేశ్వర్, మయూర్ గంజ్ జిల్లాల్లో శని, ఆదివారాల్లో పూర్తిగా షట్ డౌన్ చేయాలని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం నిర్ణయించింది.

వలస కార్మికులతోనే…..

మిగిలిన జిల్లాల్లో మామూలుగా ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఒడిశా రాష్ట్రానికి దాదాపు తొమ్మిది లక్షల మంది వలస కార్మికులు రావడంతో కేసుల సంఖ్య పెరుగుతుందని అధికారులు గుర్తించారు. వీరిలో ఇప్పటికీ 1.50 లక్షల మంది కార్మికులు క్వారంటైన్ లోనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే వలస కార్మికుల రాక తగ్గడంతో కొంత కరోనా తగ్గుముఖ పట్టవచ్చన్న అంచనాలో అధికారులు ఉన్నారు. ఒడిశా రాష్ట్రానికి వచ్చే వారికి 14 రోజుల క్వారంటైన్ తప్పదు. ఇలా కరోనా కట్టడికి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేస్తుంది.

Tags:    

Similar News