మేరా భారత్ మహాన్…!!

కర్ఫ్యూ లాంటి పరిస్థితులు ఉత్తర భారత దేశంలో ఎక్కువగా చూస్తుంటాం. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో కర్ఫ్యూ ఎక్కువగా అమలు చేస్తుంటారు. అక్కడి పరిస్థితులకు [more]

Update: 2020-03-30 18:29 GMT

కర్ఫ్యూ లాంటి పరిస్థితులు ఉత్తర భారత దేశంలో ఎక్కువగా చూస్తుంటాం. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో కర్ఫ్యూ ఎక్కువగా అమలు చేస్తుంటారు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలు శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు కర్ఫ్యూను అమలు చేస్తున్నాయి. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటివి చాలా అరుదు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కర్ఫ్యూలు పెట్డడం అనేది ఉండదు. దశాబ్దాల కాలం క్రితం కర్ఫ్యూను హైదరాబాద్ లో అమలు చేసేవారు.

దేశమంతటా…..

కానీ ఇప్పుడు దేశమంతటా కర్ఫ్యూ వాతవారణం నెలకొని ఉంది. అప్రకటిత కర్ఫ్యూ అమలులో ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ దాదాపు లాక్ డౌన్ ప్రకటించడంతో దేశం మొత్తం కర్ఫ్యూ వాతావరణంలోకి వెళ్లింది. కేంద్ర ప్రభుత్వం దేశంలోని 30 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో సయితం లాక్ డౌన్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పార్లమెంటు ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. రాజ్యసభ ఎన్నికలను కూడా ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది.

అన్ని రకాల చర్యలు….

ీీకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం కరోనా కట్టడి పనిలోనే ఉన్నాయి. మరే పనిమీద దృష్టి పెట్టేందుకు వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఎప్పటికప్పడు కరోనాపై మార్గదర్శకాలు విడుదల చేస్తూ వస్తుంది. ప్రతి రాష్ట్రంలో కరోనా ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు దేశ సరిహద్దులను మూసివేశారు. విదేశీ విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. ఇక ప్రతి రాష్ట్రం ఎక్కడికక్కడ సరిహద్దులను బంద్ చేయడంతో ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి లింక్ తెగిపోయింది. నిత్యావసర వస్తువులు, మందులు, కూరగాయలు వంటి వాటిని తప్పించి మరే ఇతర రవాణాకు రాష్ట్రాలు అంగీకరించడం లేదు.

దేశం మొత్తం లాక్ డౌన్…..

ఇక ప్రతి రాష్ట్రం తన పరిధిలోని రవాణా వ్యవస్థను రద్దు చేసింది. జిల్లాల మధ్య కూడా వాహనాలు తిరగడం లేదు. దీంతో ఎక్కడికక్కడ జనం నిలిచిపోయినట్లయింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదువుతాయని తెలిసినా ప్రజారోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు భేష్ అని చెప్పాలి. దీనికి ప్రజల నుంచి సహకారం కూడా అవసరం. పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా లాక్ డౌన్ సమయంలో బయటకు వస్తుండటంతో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద భారతదేశం మొత్తం ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉంది. కరోనా నుంచి సురక్షితంగా భారత్ బయటపడాలని ఆశిద్దాం.

Tags:    

Similar News