ఇమ్రాన్ బిక్క చూపులు చూస్తున్నారా?

దాయాది దేశం పాకిస్ధాన్ పరిస్ధితి దయనీయంగా ఉంది. ప్రపంచాన్ని ఊపేస్తున్న కరోనా పాకిస్ధాన్ లోనూ ప్రకంపనలే సృష్టిస్తోంది. దేశానికి కంటిమీద కునుకు పట్టడం లేదు. నానాటికి పెరుగుతున్న [more]

Update: 2020-05-17 16:30 GMT

దాయాది దేశం పాకిస్ధాన్ పరిస్ధితి దయనీయంగా ఉంది. ప్రపంచాన్ని ఊపేస్తున్న కరోనా పాకిస్ధాన్ లోనూ ప్రకంపనలే సృష్టిస్తోంది. దేశానికి కంటిమీద కునుకు పట్టడం లేదు. నానాటికి పెరుగుతున్న కేసులు, మరణాలు, ఠారెత్తిస్తున్నాయి. సామాన్య ప్రజల నుంచి, పాలకుల వరకు కరోనా దడ పుట్టిస్తోంది. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఇస్లామాబాద్ ఇప్పుడు కరోనా సంక్షోభంతో కుదేలవుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) అప్పులు, అమెరికా ఆర్ధికసాయం, చైనా చేయూతతో నెట్టుకొస్తున్న దేశం ఇప్పుడు ఎలా ముందుకు సాగాలో అర్ధంకాక బిక్క చూపులు చూస్తోంది. కరోనాను అరికట్టగలమని, ఆర్ధికవ్యవస్ధను గాడిలో పెట్టగలమని ఒకప్పటి క్రికెటర్ అయిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ అంతరంతరాల్లో ఆయన ఆందోళన చెందుతున్నారు. సామాన్య ప్రజలను పక్కన పెడితే అధికార పార్టీకి చెందిన కీలక నేతలూ కరోనా కాటుకు గురవడం కలవరపరుస్తోంది.

వీఐపీలనూ వదలని కరోనా…..

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (మన పార్లమెంట్ వంటిది) స్పీకర్ అసర్ కైసర్ కరోనాతో స్వచ్ఛందంగా క్వారంటైన్ కు వెళ్ళారు. ఆయనతో పాటు కుాతురు, కుమారుడుకు కూడా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. అధికారపార్టీ అయిన పాకిస్ధాన్ తెహ్రిన్ ఇన్సాఫ్ (PTI) లో కీలక నాయకుడు, ఇమ్రాన్ కు అత్యంత సన్నిహితుడు అయిన సింధ్ ప్రావిన్స్ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ కు పరీక్షల్లో పాజిటివ్ గా తేలడంతో ఆయన చికిత్స పొందుతున్నారు. సింధ్ ప్రావిన్స్ కు చెందిన అధికారపార్టీ నాయకుడు సయ్యద్ అబ్దుల్ రషేల్ కూడా కరోనా తో ఆస్పత్రి లో చేరారు. ఆయన కుటుంబంలోని మెుత్తం 8 మందికి సైతం కరోనా సోకింది. కరోనా పై ముందస్తుగా అప్రమత్తం చేయడంలో విఫలం అయ్యిందంటుా ఇమ్రాన్ ఖాన్ తన ఆరోగ్య సలహాదారును పదవి నుంచి తొలగించారు. అదృష్టవశాత్తూ ఇమ్రాన్ కు పరీక్షల్లో నెగిటివ్ గా తేలడంతో దేశం ఊపిరి పీల్చుకుంది.

పెరుగుతున్న కేసులు….

దేశవ్యాప్తంగా ఈ నెల మరో తేదీ నాటికి 19,103 కేసులు నమెాదయ్యాయి. ఒక్క రెండో తేదీ నాడే 1952 కొత్త కేసులు వెలుగు చుాడటం ఆందోళన కలిగిస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడుా ఇన్ని కేసులు నమెాదు కాలేదు. రెండోతేదీ నాటికి 432 మందిని కరోనా కబళించింది. ఒక్క రెండో తేదీనే 47 మందిక న్నుముాయడం కరోనా తీవ్రతకు దర్పణం పడుతోంది. అదేసమయంలో 4,715 మంది కోలుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు 1,93859 మందికి పరిక్షలు నిర్వహించినట్లు అంచనా. మెుత్తం 19,103 కేసుల్లో పంజాబ్ ప్రావిన్స్ (మన దేశంలో రాష్ట్రం అని వ్యవహరిస్తాం) లో 7,106, సింధ్ ప్రావిన్స్ లో 7,102 ఖైబర్ ఫక్తున్ ఖ్వాలో 2,907, బలుాకిస్ధాన్ లో 1172, రాజధాని ఇస్లామాబాద్ నగరాలు 393 గిల్గిత్ – బాల్దిస్ధాన్ లో 356 పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK) లో 67 కేసులు నమెాదయ్యాయి.

ఈ రెండు రాష్ట్రాల్లోనే…..

పాకిస్ధాన్ రాజకీయాల్లో పంజాబ్, సింధ్ ప్రావిన్స్ లదే కీలక పాత్ర. సంపన్న ప్రావిన్స్ అయిన పంజాబ్ మనదేశంలోని పంజాబ్ సరిహద్దులో ఉంటుంది. సిక్కుల పవిత్ర దేవాలయం ఉన్న అమృతసర్ నగరానికి 32 కిలోమీటర్ల దుారంలో పాక్ లోని పంజాబ్ ప్రావిన్స్ ఉంటుంది. దాని రాజధాని నగరం లాహోర్. అమృత్ సర్ నుంచి లాహోర్ దగ్గరే. ఇమ్రాన్ ఖాన్ ఈ ప్రావిన్స్ కు చెందినవారే. మరో ప్రావిన్స్ సింధ్. దీని రాజధాని కరాచీ. ఇక్కడ హిందువులు అధికసంఖ్యలో ఉన్నారు. ఈ నగరానికి దేశ వాణిజ్య రాజధానిగా పేరుంది. అరేబీయా సముద్రం తీరాన కరాచీ నగరం విస్తరించి ఉంది. పాకిస్ధాన్ పీపుల్స్ పార్టీ (ppp) కి చెందిన దివంగత జుల్ఫీకర్ ఆలీ భుట్టో, ఆయన కుాతురు దివంగత బెనజీర్ భుట్టో ఈ ప్రావిన్స్ కు చెందిన వారే. ఈ రెండు ప్రావిన్స్ ల్లోనే అత్యధిక కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. వైశాల్యంలో పెద్దది, వెనకబడిన ప్రావిన్స్ అయిన బలూచిస్ధాన్ లో 1136, ఖైబర్ షక్తున్ ఖ్వా లో 2,907 కేసులు నమెాదవడం ఒకింత ఊరట కలిగించే అంశం.

కరోనా విజృంభిస్తున్నా…..

కరోనాను అధిగమించేందుకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపడుతున్పప్పటికీ అవి ప్రజలకు ఉపశమనం కలిగించడం లేదు. పేదలకు నగదు పంపిణీని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రారంభించారు. విధ్యుత్ బిల్లుల చెల్లింపులో పరిశ్రమలకు రాయితీలు, వడ్డీరేట్ల తగ్గింపు, వడ్డీలేని రుణసౌకర్యం, రాయితీలు, కల్పిచినట్లు పరిశ్రమల మంత్రి అహమ్మద్ అజహర్ వెల్లడించారు. ఆర్నెల్లు లేదా ఏడాది పాటు కరోనాతో సహజీవనం చేయక తప్పదన్న ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. అయితో విపత్తు వేళ పాక్ తన వక్రబుద్ధిని విడనాడలేదు. ఈ నెల ముాడో తేదీన ఓన్మర్ లో పాక్ ప్రేరిపిత ఉగ్రవాదులు అయిదుగురు భారతీయ జవాన్లు హతులయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) మీదుగా భారత్ లో కరోనా వ్యాప్తికి పార్టీలు కదుపుతోంది. కశ్మీర్ లోని గండేర్ బల్ లో గల ఓ క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శిచిన రాష్ట్రం డీజీపీ దిల్ బాగ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా పీఓకే మీదగా కొందరు కరోనా రోగులు పోలీసుల కన్నుగప్పి సరిహద్దులు దాటుతున్నట్లు ఆయన నిర్ధారించారు. కుక్క తోక వంకరఅన్నట్లు విపత్తు వేళలోనుా విద్వేషాన్ని వీడకపోవడం పాక్ వక్రబుద్దికి నిదర్శనం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News