ఆ మాత్రం బాధ్యత లేకపోతే ఎలా?

దేశ రాజధాని ఢిల్లీని కరోనా మరోసారి వణికిస్తుంది. ఢిల్లీలో సెకండ్ వేవ్ మొదలయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. అయితే దీనికి ప్రధాన కారణాలు పండగల సీజన్ కావడం, [more]

Update: 2020-11-12 18:29 GMT

దేశ రాజధాని ఢిల్లీని కరోనా మరోసారి వణికిస్తుంది. ఢిల్లీలో సెకండ్ వేవ్ మొదలయింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. అయితే దీనికి ప్రధాన కారణాలు పండగల సీజన్ కావడం, ఢిల్లీలో వాయు కాలుష్యం పెరగడం వంటివి కారణాలుగా చెబుతున్నారు. అయితే కరోనాను కట్టడి చేయడానికి మళ్లీ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే ఢిల్లీ వాసులు కరోనా ను లైట్ గా తీసుకోవడం కూడా వైరస్ మరోసారి విజృంభించడానికి కారణమని చెప్పాలి.

మళ్లీ విజృంభణ…..

ఢిల్లీలో రెండోసారి కరోనా వైరస్ తీవ్రత ప్రారంభమయింది. మొన్నటి వరకూ ఢిల్లీలోనే తగ్గినట్లు కన్పించిన కరోనా వైరస్ మళ్లీ తన ప్రతాపాన్ని చూపడం ప్రారంభించింది. రోజుకు ఐదు వేల నుంచి ఆరు వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. రోజుకు యాభై మందికి పైగానే కరోనా కారణంగా మృత్యువాత పడుతున్నారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో వైరస్ పరీక్షల సంఖ్య పెంచాలని నిర్ణయించారు.

వైరస్ వ్యాప్తికి….

ప్రస్తుతం ఢిల్లీలో యాభై వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఢిల్లీని మంచుదుప్పటి కమ్మేస్తుడంటం కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని చెబుతున్నారు. ఢిల్లీల పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. ఈ దీపావళికి బాణాసంచా వినియోగంపై ఆంక్షలు విధించింది. ప్రజలు దీపావళి పండగను టపాసుల రహితంగా చేసుకోవాలని అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.

ప్రజల సహకారం లేకుంటే…..

ప్రజల సహకారం లేనిదే ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదని అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. వైరస్ విజృంభిస్తున్నా కనీసం మాస్క్ కూడా పెట్టుకోకుండా కొందరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ కు ఎటువంటి వ్యాక్సిన్ రాలేదన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హైకోర్టు కూడా కరోనా వైరస్ విజృంభణకు ప్రభుత్వంపై సీరియస్ అయింది. ఢిల్లీని కరోనా రాజధానిగా మారుస్తున్నారన్న తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మొత్తం మీద ఢిల్లీలో వైరస్ సెకండ్ వేవ్ కలవరం రేపుతుంది.

Tags:    

Similar News