కరోనా కేటుగాళ్ళు దిగిపోయారు… తస్మాత్ జాగ్రత్త

దొంగలు ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కేవలం రాజకీయ నాయకులకే కాదు మా చోర విద్య లోను పరిస్థితిని బట్టి మార్పులు [more]

Update: 2020-08-01 09:30 GMT

దొంగలు ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కేవలం రాజకీయ నాయకులకే కాదు మా చోర విద్య లోను పరిస్థితిని బట్టి మార్పులు చేసుకుంటామని చెప్పక చెబుతున్నారు కేడీలు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. దీన్నే అవకాశం గా మలచుకుంటే పోలా అనుకుంటున్నారు కేడీ లు. అనుకున్నదే తడవు సోషల్ మీడియా నే వేదికగా చేసుకుని పైసా పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయలు కొల్లగొట్టేయడానికి తెరలేపింది. అయితే వీరి బాగోతాన్ని భాగ్యనగర్ ఖాకీలు బట్టబయలు చేసేసారు.

ఆ వీడియోలే వారి పెట్టుబడి….

కరోనా మొదలైన నాటినుంచి సోషల్ మీడియా లో హృదయం కదిలించే అనేక వీడియో లు ప్రజలు అప్ లోడ్ చేస్తున్నారు. వాటిలో బాగా వైరల్ అయిన వీడియో లను సెలెక్ట్ చేసి హైదరాబాద్ పాత బస్తీకి చెందిన గ్యాంగ్ సోషల్ మీడియా లో సాయం కోసం అభ్యర్థిస్తుంది. ఇవి చూసి చలించిపోయిన వివిధ దేశాల్లో ఉన్నవారు ముఖ్యంగా అరబ్ దేశాలు, యుఎస్ లో ఉన్నవారు తమకు తోచిన సాయం ఆర్టీజిఎస్ రూపంలో ఆన్లైన్ ట్రాన్సఫర్ చేసేవారు.

కోటి రూపాయలకు పైగానే…

ఇలా కోటి రూపాయలకు పైగానే ఈ గ్యాంగ్ సంపాదించినట్లు తేలింది. అనుమానం వచ్చిన ఒక దాత ఫిర్యాదుతో తీగ లాగితే ఈ డొంక కదిలింది. తమదైన స్టయిల్ లో చాంద్రాయణ గుట్ట గ్యాంగ్ మరో ప్రాంతానికి చెందిన సల్మాన్ ఖాన్, రహీద్, అస్మా బేగం పట్టుకుని విచారించిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్ లు తగిలాయి. ఇలా ఎవరు బడితే వారికి అపాత్ర దానం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సో బీ కేర్ ఫుల్.

Tags:    

Similar News