తప్పు నాది కానే కాదు ఆయనదే

కరోనా మహమ్మారి మధ్యప్రదేశ్ ను వదలడం లేదు. మధ్యప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పాటు రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి. కొత్తగా [more]

Update: 2020-05-06 17:30 GMT

కరోనా మహమ్మారి మధ్యప్రదేశ్ ను వదలడం లేదు. మధ్యప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పాటు రాజకీయాలు కూడా ఊపందుకున్నాయి. కొత్తగా ఏర్పాటయిన ప్రభుత్వం కరోనా వైరస్ ప్రబలడానికి తన తప్పేమీ లేదంటోంది. తప్పు మొత్తం గత ప్రభుత్వానిదేనని చెబుతోంది. ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా విజృంభిస్తున్న సమయంలోనే పదవీ బాధ్యతలను చేపట్టారు.

కరోనా సమయంలోనే…

కరోనా కీలకంగా ఉన్న సమయంలోనే ఆయన మంత్రి వర్గ విస్తరణ చేపట్టారు. తొలుత ఆరోగ్యశాఖ మంత్రిని నియమించుకున్నారు. ప్రధానంగా ఇండోర్ ను కరోనా వైరస్ వణికిస్తుంది. అయితే తాజాగా ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇండోర్ లో కరోనా వ్యాప్తికి కమల్ నాధ్ కారణమని తప్పును ఆయన మీదకు నెట్టేశారు. కమల్ నాధ్ కరోనా విజృంభిస్తున్న సమయంలో దానిని కట్టడి చేయడంలో విఫలమయ్యారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికే….?

ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే కమల్ నాధ్ ఎక్కువగా దృష్టి పెట్టారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కరోనాను సయితం లెక్క చేయలేదన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాధ్ తన పదవీ బాధ్యతలను విస్మరించారని శివరాజ్ సింగ్ చౌహాన్ దుయ్య బట్టారు. తాను పదవీ బాధ్యతలను చేపట్టే నాటికే కరోనా వైరస్ అంటుకుందన్నది చౌహాన్ ఆరోపణ.

కాదు కాదు.. ఆయనే…..

కానీ కమల్ నాధ్ సయితం శివరాజ్ సింగ్ ఆరోపణలను ఖండించారు. మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం శివరాజ్ సింగ్ చౌహాన్ చూపిన శ్రద్ధ కరోనా కట్టడి లో చూపించడం లేదని ఆరోపించారు. తాము అసెంబ్లీ సమావేశాలను సయితం కరోనా కారణంగా వాయిదా వేస్తే కోర్టుకు వెళ్లి మరీ బలపరీక్షకు అనుమతి తెచ్చుకున్న విషయాన్ని కమల్ నాధ్ గుర్తు చేశారు. కరోనా కట్టడిలో శివరాజ్ సింగ్ చౌహాన్ విఫలమయ్యారన్నారు. మొత్తం మీద మధ్యప్రదేశ్ లో కరోనా కంటే రాజకీయ వైరస్ ఎక్కువగా అంటుకుందనే చెప్పాలి.

Tags:    

Similar News