గోవిందుడికి తప్పడం లేదు … ఇక కష్టమేనా?

ప్రపంచ ప్రఖ్యాత హిందూ దేవాలయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే భక్తులు పులకించిపోతారు. అయితే ఇప్పుడు అందరిలాగే తిరుమలకు కరోనా ప్రభావం మాములుగా లేదు. నిత్యం లక్షలాదిమంది భక్తులతో [more]

Update: 2020-08-01 11:00 GMT

ప్రపంచ ప్రఖ్యాత హిందూ దేవాలయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుంటే భక్తులు పులకించిపోతారు. అయితే ఇప్పుడు అందరిలాగే తిరుమలకు కరోనా ప్రభావం మాములుగా లేదు. నిత్యం లక్షలాదిమంది భక్తులతో కిటకిటలాడే ఈ దైవ క్షేత్రం ఇప్పుడు వైరస్ కాటు వేస్తుందన్న భయంతో భక్తుల రాక లేక బోసిపోతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లోని సిబ్బంది, స్వామి వారికి సేవలు చేసే అయ్యంగార్లకు వైరస్ ఎఫెక్ట్ గట్టిగానే తాకింది.

కోట్ల ఆదాయం లక్షల్లో పడిపోయింది…

లాక్ డౌన్ అనంతరం ఎప్పుడు ఎప్పుడు ఆలయం తెరుద్దామా అని ఎదురు చూసిన టిటిడి కి ఇప్పుడు నిత్యం అనేక సమస్యలు ఎదురు అవుతూనే ఉన్నాయి. భక్తుల సంఖ్య ఐదు నుంచి 9 వేల లోపే నిత్యం ఉంటుంది. కోట్ల రూపాయల్లో వచ్చే స్వామి వారి ఆదాయం ఇప్పుడు లక్షల్లో మాత్రమే వస్తుంది. దాంతో ఈ ఏడాది స్వామి వారి వార్షిక ఆదాయం రెండువేలకోట్ల రూపాయల లోపే ఉండొచ్చని భావిస్తున్నారు. గత నాలుగు నెలలుగా కరోనా కారణంగా శ్రీవారి కి రావాలిసిన 800 కోట్ల రూపాయలు వైరస్ లో కలిసిపోయాయి. ఇక అంతా సక్రమంగా ఉండి ఉంటె సుమారు 80 లక్షమందికి స్వామి వారిని దర్శించుకునే భాగ్యం దక్కి ఉండేది.

దర్శనాలు బంద్ చేస్తే …

ఈ ఆదాయం ఆందోళన పక్కన పెడితే కరోనా పూర్తిగా తగ్గే వరకు దర్శనాలను బంద్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ భక్తులకు దర్శనాలు కొనసాగిస్తూ ఉండటంతో ఇప్పటివరకు వారికి వైరస్ సోకినట్లు టిటిడి ప్రకటించలేదు. కానీ ఆలయ బాధ్యతలు చూసే వారు మాత్రం కరోనా బారిన పడుతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా తిరుపతిలో కరోనా తీవ్రంగా ఉంది. ఏడుకొండలవాడి దగ్గర విధులు నిర్వహించే వారు అత్యధికం కొండకిందే నివాసం ఉంటారు. వీరు అక్కడి నుంచి కొండపైకి రోజు వచ్చి వెళ్ళడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తేలుతుంది. దాంతో టిటిడి కూడా మరిన్ని జాగ్రత్తలు పాటిస్తూ స్వామి వారి దర్శనాల సంఖ్య క్రమంగా పెంచాలనే చూస్తూ ఉంది. దేవుడిపై భారం వేసి వ్యవహారం సాగిస్తుంది మరి.

Tags:    

Similar News