భయంలో వైసీపీ… ఆనందంలో టీడీపీ కారణమిదే?

ఏపీలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల వేడి జోరుగా ఉంది. మరో పదిహేను రోజుల పాటు ఇదే హడావుడి, సందడి కనిపిస్తోంది. ఎన్నికలు అంటే జాతరే, ప్రచారం పెద్ద [more]

Update: 2020-03-15 05:00 GMT

ఏపీలో ప్రస్తుతం స్థానిక ఎన్నికల వేడి జోరుగా ఉంది. మరో పదిహేను రోజుల పాటు ఇదే హడావుడి, సందడి కనిపిస్తోంది. ఎన్నికలు అంటే జాతరే, ప్రచారం పెద్ద ఎత్తున చేయాలి. జన సమూహాల్లో తిరగాలి. మరో వైపు చూసుకుంటే కరోనా వైరస్ వీర విజృంభణ చేస్తోంది. దేశమంతా రెడ్ అలెర్ట్ పెట్టేసింది. ఎక్కడ చూసినా అన్నీ బంద్ అంటున్నారు. పొరుగున ఉన్న తెలంగాణాలో కూడా అన్నీ మూసేస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో ఏపీలో ఎన్నికల కోలాహలం ఓ లెవెల్లో సాగుతోంది. అయితే ఏపీలో ఎన్నికలు వాయిదా వేయాలని ఇపుడు పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.

కరోనా భయమట…..

దేశమంతా కరోనా వైరస్ తో వణుకుతూంటే ఇపుడు ఏపీలో ఎన్నికలు ఎందుకు అని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు ప్రశ్నిస్తున్నారు. జనం చస్తూంటే ఎన్నికలు పెట్టి పదవులు తీసుకోవాలా అని ఏకంగా జగన్ ప్రభుత్వం మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలు వాయిదా వేసి ముందు కరోనా వైరస్ సంగతి చూడండని ఆయన గట్టిగా కోరుతున్నారు. ఎన్నికలు ఎపుడైనా పెట్టుకోవచ్చు ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యమని ఆయన అంటున్నారు. ఇప్పటికే ఇదే రకమైన డిమాండ్ ని టీడీపీ సహా ఇతర పార్టీలు చేశాయి.

బ్యాలెట్ పేపర్ తో….

కరోనా వైరస్ బ్యాలెట్ ప్యాపర్ మీద నుంచి ఒకరి నుంచి ఒకరిని పాకుతుందని కూడా విపక్ష రాజకీయ నేతలు భయపెడుతున్నారు. బ్యాలెట్ పేపర్ మీద కనీసం అయిదు రోజుల పాటు వైరస్ బతికి ఉంటుందని, ఆ విధంగా ఓటు వేసే వారికి వైరస్ పాకితే ఎవరు బాధ్యులని కూడా ప్రశ్నలు సంధిస్తున్నారు మరో వైపు జనాలు ఓటు కోసం క్యూలో ఉంటే అక్కడ కూడా వైరస్ పాకుతుందని భయపెడుతున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో వచ్చే వారికి ఏ రకమైన వైరస్ ఉందో ఎవరికి తెలుసు అంటున్నారు.

వాయిదాయేనా…?

ఇప్పటిదాకా వైసీపీ తప్ప ఏపీలో ఎవరూ ఎన్నికలను కోరుకోలేదన్నది నిజం. వాస్తవానికి ఏపీలో జగన్ కుర్చీ ఎక్కిన దగ్గర నుంచి దిగిపో జగన్ అంటూ డిమాండ్ చేసినది చంద్రబాబు, పవన్ వంటి వారే. అటువంటి వారే ఇపుడు ఎన్నికలు వద్దు అంటూ వేదాంతం ప్రకటిస్తున్నారు. వామపక్షాలు సైతం ఎన్నికలు వద్దు అంటున్నారు. కాంగ్రెస్ నేతలు అయితే ఎన్నికల‌ను రీషెడ్యూల్ చేయమని ఏకంగా గవర్నర్ వద్దకు వెళ్ళి వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఇవన్నీ చూసినపుడు రాజకీయ డిమాండ్లుగా కొట్టి పారేసినా ఇపుడు దేశాన్నే కాదు, ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ గురించి జనాలు బాగా భయపడుతున్నారు. పైగా ఓటేస్తే వైరస్ అంటుకుంటుందని విపక్షాలు ప్రచారం చేస్తూంటే అసలు పోలింగుకు జనం వస్తారా అన్నది కూడా పెద్ద డౌటే. మొత్తానికి ఈ ప్రచారం పెరిగి పెద్దదైతే మాత్రం స్థానిక ఎన్నికలు వాయిదా పడతాయేమోనన్న భయం వైసీపీలో ఉందిట. అనుకున్నట్లే ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా ఎఫెక్ట్ తో ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేశారు. ఆరు వారాల తర్వాత కొత్త షెడ్యూల్ ను విడుదల చేస్తారు. దీంతో టీడీపీలో ఆనందం కన్పిస్తుంది.

Tags:    

Similar News