చైనా కరోనాను ఆపగలిగింది ఇలా..!!

కరోనా కలకలం తగ్గింది. చైనాకు ఉపశమనం లభించింది. తొలుత కరోనా వెలుగుచుాసిన వూహాన్ లో ఇపుడు ప్రశాంత పరిస్ధితి నెలకొంది. చైనా ప్రావిన్స్ లోని హోచెయ్ రాజధాని [more]

Update: 2020-04-07 16:30 GMT

కరోనా కలకలం తగ్గింది. చైనాకు ఉపశమనం లభించింది. తొలుత కరోనా వెలుగుచుాసిన వూహాన్ లో ఇపుడు ప్రశాంత పరిస్ధితి నెలకొంది. చైనా ప్రావిన్స్ లోని హోచెయ్ రాజధాని నగరం వూహాన్ గతంలో ఇక్కడ (బ్రిక్స్) (BRICS) – బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కుాటమి శిఖరాగ్ర సదస్సు జరిగింది. నాలుగైదు నెలలుగా వూహాన్ కు ఊపిరాడకుండా చేసిన కరోనాను కట్టడి చేయడంలో డ్రాగన్ దేశం చైనా విజయం సాధించింది. తొలుత ఎక్కడైతే ప్రారంభమయిందో (వూహాన్) అక్కడ ప్రశాంత పరిస్ధితులు నెలకొన్నాయి. వూాహన్ లో ఒక కొత్త కేసు నమెాదుకావడం లేదు. ఒక్క వూహాన్ లోనే కాదు యావత్ దేశం నుంచి కరోనాను తరిమి కొట్టడంలో చైనా విజయం సాధించింది.

ఆ చొరవ.. వేగంతోనే….

కరోనాను ఎదుర్కొవడంలో చైనా చుాపిన చొరవ, వేగం చేపట్టిన చర్యలు, ఇతర దేశాలకు ఆదర్శనీయం. ప్రజల పట్ల, దేశం పట్ల గల నిబద్ధతకు నిదర్శనం. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా గల దేశంగా గుర్తింపు పొందిన చైనా సకాలంలో చర్యలు చేపట్టి ఉండకపోతే మరణాలు లక్షల్లో ఉండేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ నిబద్ధతే మరణాలను వేలకు పరిమితం చేసింది. 80 వేల మందికి వైరస్ సోకినా మరణాలను ముాడు వేలకు మించనీయలేదు. చైనా కన్నా ఎన్నో రెట్లు చిన్న దేశమైన ఇటలీలో ఇప్పకే మరణాలు పదివేలు దాటడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్యసంస్ధ (WHO) కు చెందిన 13 మంది ప్రతినిదులు, చైనాకు చెందిన 12 మంది శాస్త్రవేత్తలు ఇటీవల కరోనాకు కేంద్రమైన వూహాన్ లో పర్యటించి పరిస్ధితులను అధ్యయనం చేసింది. ప్రభుత్వం చేపట్టిన చర్యలను చుాచి ఆశ్చర్య పోయింది. వూహాన్ లో కరోనా వెలుగుచుాసిన వెంటనే సామాజిక దూరం ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఆటల పోటీలను ఆపేసింది. విద్యాసంస్ధలను ముసేసింది. కొత్త సంవత్సర వేడుకలను రద్దుచేసింది. అత్యవసర సేవల కిందకు రాని అన్ని రకాల దుకాణాలను ముాసివేసింది. ప్రతి పౌరుడు మాస్క్ ధరిస్తేనే వీదుల్లోకి వచ్చేందుకు అనుమతించింది. సముాహంగా గుమిగూడటాన్ని నియంత్రించడం వంటి చర్యలు సత్పలితాలను ఇచ్చింది.

ఎక్కడికక్కడ చర్యలతో…..

ప్రజల్లో అవగాహన కల్పించింది. వారిలో చైతన్యం కల్పించింది. ప్రభుత్వ చర్యల వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ లోపించింది. లేనట్టయితే మరణాల సంఖ్య లక్షల్లో ఉండేది. జనవరి 23 నాటికి వూహాన్ లో పరిస్ధితి దయనీయంగా ఉంది. ఈ నగరాన్ని సర్కార్ లాక్ డౌన్ చేసింది. పరిసర నగరాలానూ లాక్ డౌన్ చేసింది. దాదాపు అయిదుకోట్ల మందిని బలవంతంగా క్వారంటైన్ చేసింది. ఒక‌్క వూహాన్ లోనే వారం రోజుల వ్యవదిలో రెండు అత్యాధునిక ఆసుపత్రులను నిర్మించింది. ఇది అసాధారణం. అమెరికా వంటి అగ్రరాజ్యానికి కుాడా ఇది సాధ్యమయ్యే పని కాదు. దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని వూహాన్ కు తరలించింది. కరోనా అనుమానితులను గుర్తించేదుకు 1800 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. కరోనా అనుమానితులను గుర్తించి అత్యవసరంగా కొన్నిచోట్ల బలవంతంగా వారిని క్వారంటైన్ కు తరలించింది. అనుమానితులను గుర్తించేదుకు అలీపే పేమెంట్, వీచాట్ (వాట్సాప్ వంటివి) సేవలను వాడుకుంది. వీటిద్వారా జనం ఏంచేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారో కన్నేసి ఉంచింది.

నెల రోజుల పాటు….

ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో గ్నీన్, ఎల్లో, రెడ్ రంగులు కనపడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంది. గ్రీన్ అంటే ఆరోగ్యం బాగుందని, ఎల్లో అంటే జాగ్రత్తలు అవసరమని, రెడ్ అంటే తక్షణం వైద్యసహాయం అవసరమన్నది సంకేతం. ఇక వైద్యశాఖ అధికారుల సేవలు ప్రశంసించడానికి మాటలు చాలవు. వారు సేవలు చేసేందుకు వచ్చినట్లు వ్యవహరించలేదు. యుద్ధానికి వచ్చిన యెాధుల్లాగా పోరాడారు. ముఖ్యంగా వూహాన్ పైనెే పూర్తిగా దృష్టి సారించింది. దేశంలోని అత్యంత కీలక నగరాల్లో ఇది ఒకటి. దాదాపు కోటి మంది జనాభా ఉంటుంది. ఇది భారీ మార్కెట్ లకు నిలయం. ప్రపంచలోనే అతిపెద్ద మాంసాహార విపణి ఇక్కడ ఉంది. తొలుత ఇక్కడ కరోనాను ‘ ఫ్లూ ‘ అని భావించారు. కానీ వెనువెంటనే గుర్తించారు. ఒక్కసారిగా జనవరి 23 న వూహాన్ నగారానికి తాళం పడింది. వందల్లో ఉన్న కేసులు వేలల్లోకి వెళ్లాయి. రవాణా సాధనాలను నిలిపివేసింది. తయారీ సంస్ధలు మూతపడ్డాయి. ప్రజల రాకపోకలపై ఆంక్షలు మెుదలైయ్యాయి. ప్రజలు ఇంటి గడప దాటడానికి భయపడ్డారు. అధ్యక్షుడు జింక్ పింగ్ అంకుటిత దీక్ష, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిబద్ధత, ప్రజల సహకారంతో అంతిమంగా చైనా ఈసమస్యను అధిగమించగలిగింది. వైరస్ సంక్రమణ ఆగిపోయింది. కేసుల నమెాదు క్రమంగా తగ్గుముఖం పట్టింది. దాదాపు నెల రోజులుగా బయటకురాని ప్రజలు ఇపుడిపుడే తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. చైనా విధానాలను మన దేశం కుాడా పాటించినట్లయితే ఈసమస్యను అధిగమించవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవతోపాటు ప్రజల సహకారం కూడా ఎంతో ముఖ్యం. భారతావని ఈ సమస్యను అధిగమిచగలదని ఆశిద్దాం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News