కరోనా మళ్లీ పెరగడానికి కారణమిదేనా?

కరోనా తగ్గిపోయింది. ఇక వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. భయంలేకుండా ప్రజలు బయటకు రావడానికి కారణమిదే. అందుకే మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు [more]

Update: 2021-02-27 18:29 GMT

కరోనా తగ్గిపోయింది. ఇక వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. భయంలేకుండా ప్రజలు బయటకు రావడానికి కారణమిదే. అందుకే మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన కేరళ, కర్ణాటకల్లో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతనే కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని వైద్య నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రజలు విచ్చలవిడిగా నిబంధనలను పాటించకుండా తిరగడంతో కరోనా మళ్లీ తిరగబెట్టే అవకాశముంది.

పంచాయతీ ఎన్నికల తర్వాతే…?

కేరళలో పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేరళలో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య పది లక్షలకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతుండటంతో కరోనా భయం అందరినీ పట్టిపీడిస్తుంది. నిబంధనలను పూర్తిగా సడలించడం, స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంతో కేరళలో కేసుల సంఖ్య పెరిగిందన్నది విశ్లేషకుల అంచనా. ఎన్నికల సమయంలో బహిరంగసభలు కూడా ఎక్కువ కావడంతో మరిన్ని కేసులు పెరిగే అవకాశముంది.

కర్ణాటకలోనూ అంతే..?

ఇక కర్ణాటకలో సయితం కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేరళ నుంచి వచ్చిన వారితో కరోనా సోకిందని చెబుతున్నా, ఇక్కడ కూడా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరమే ఇక్కడ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోలన కల్గిస్తుంది. కర్ణాటకలో కరోనా కేసులు 9.50 లక్షలకు దాటాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం తిరిగి కరోనా నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది.

ఏపీలో కూడా అంతేనా?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుతున్నట్లు కన్పిస్తుంది. అయితే ఇక్కడ కూడా పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో రానున్న కాలంలో ఏపీలో కూడా కరోనా కేసులు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. చలికాలం కావడం, ప్రజలు నిబంధనలను పాటించకుండా వ్యవహరించక పోవడంతో కేసులు దేశ వ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్నాయన్న ఆందోళన వైద్య వర్గాల్లో వ్యక్తమవుతుంది. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలు కరోనా వ్యాప్తికి కారణమయ్యాన్న వాదన బలంగా విన్పిస్తుంది.

Tags:    

Similar News