పూర్తయినా ఆగని సమరం

నాలుగేళ్ళ వన్డే వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది. ఇంగ్లాండ్ విన్నర్ గా న్యూజిలాండ్ రన్నర్ గా చరిత్రలో ఎన్నడూ లేని పోరాటం తో నిలిచాయి. ఈ మ్యాచ్ [more]

Update: 2019-07-16 02:00 GMT

నాలుగేళ్ళ వన్డే వరల్డ్ కప్ టోర్నీ ముగిసింది. ఇంగ్లాండ్ విన్నర్ గా న్యూజిలాండ్ రన్నర్ గా చరిత్రలో ఎన్నడూ లేని పోరాటం తో నిలిచాయి. ఈ మ్యాచ్ ఇచ్చిన మజా ఇప్పటివరకు క్రికెట్ లో ఎవ్వరు చూడనే లేదు. తొలి కప్ అందుకున్న ఇంగ్లాండ్ విజయం పై మాత్రం విమర్శల వర్షం కురుస్తునే వుంది. ముఖ్యంగా ఐసిసి నిబంధనలు క్రీడాభిమానులనుంచి క్రికెట్ పండితులు మాజీ క్రికెటర్ల వరకు అంతా తూర్పారబడుతున్నారు. ఇవేమి రూల్స్ అండి అని కడిగిపారేస్తున్నారు.

బౌండరీ లతో డిసైడ్ చేస్తారా ..?

ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ న్యూజిలాండ్ నడుమ టై అయ్యింది. దాంతో సూపర్ ఓవర్ నిర్వహిస్తే అది కూడా టై అయితే బౌండరీ లను లెక్కేసి విజేతను ప్రకటిస్తారా హవ్వ అంటూ మాజీ భారత క్రికెట్ స్టార్ యువరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. ఇదెక్కడి రూల్స్ అంటూ నిలదీశాడు యువరాజ్. ఇక నెటిజెన్స్ న్యూజిలాండ్ ఓపెనర్ గుప్టిల్ ను ట్రోల్ చేస్తున్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారం గుప్టిల్ రనౌట్ అయ్యాడంటూ కామెడీ చేస్తున్నారు. సెమీఫైనల్ లో ధోని ని అద్భుత రన్ అవుట్ చేసిన గుప్టిల్ అలాగే పెవిలియన్ చేరడంటూ ఆడుకుంటున్నారు. మరో పక్క టీం ఇండియా సారధి కోహ్లీ ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ – న్యూజిలాండ్ ఆడిన తీరును అభినందించాడు. ఇరు జట్లు అద్భుతంగా విజయం కోసం పోరాడాయని ప్రశంసించాడు. ఇలా ఒక్కోరు ఒక్కో రకంగా వరల్డ్ కప్ టోర్నీ ముగిసినా మాటల యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉండటం విశేషం.

Tags:    

Similar News