సేన, పవార్ మధ్యలో కాంగ్రెస్..?

మహారాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఆటలో అరటిపండుగా మారిపోనుంది. ఉద్దండుడైన శరద్ పవార్ వ్యూహంతో కాంగ్రెస్ మహారాష్ట్ర రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి కన్పిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లో [more]

Update: 2021-01-08 16:30 GMT

మహారాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఆటలో అరటిపండుగా మారిపోనుంది. ఉద్దండుడైన శరద్ పవార్ వ్యూహంతో కాంగ్రెస్ మహారాష్ట్ర రాజకీయాల నుంచి నిష్క్రమించే పరిస్థితి కన్పిస్తుంది. ఉత్తర్ ప్రదేశ్ లో మాదిరిగానే కాంగ్రెస్ పరిస్థితి మహారాష‌్ట్రలోనూ అయ్యేందుకు ఎంతో దూరం లేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది దాటి పోయింది.

ప్రాధాన్యత ఇవ్వకుండా….

అయితే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆ పార్టీ నేతల ఆరోపణ. అంతా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చెప్పినట్లే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నడుచుకుంటున్నారని, కీలక నిర్ణయాల్లోనూ తమ అభిప్రాయాలను తీసుకోవడం లేదన్నది వారి వాదన. అంతేకాదు మంత్రి వర్గ సమావేశాల్లో మాత్రమే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు తమకు తెలుస్తున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

ఎన్నికల విషయంలోనూ….

దీంతో పాటు ఎన్నికల విషయంలోనూ కాంగ్రెస్ ను ఆ రెండు పార్టీలు పక్కన పెడుతున్నాయంటున్నారు. ఏ ఎన్నికలు జరిగినా తమకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదన్నది మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతల ఆవేదన. గతంలో జరిగిన ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు తక్కువ స్థానాలను కేటాయించాలన్న ఉద్దేశ్యంతో శివసేన, ఎన్సీపీలు ఉన్నాయంటున్నారు.

బలహీనం చేసే యత్నమేనని…..

మహారాష్ట్రలో బలంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు శివసేన, ఎన్సీపీలు కలిస్తే విజయానికి ఇక తిరుగుండదని వారు భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని తక్కువగా చూస్తున్నారంటున్నారు. ఈ మేరకు మహారాష‌్ట్ర కాంగ్రెస్ నేతలు ఇటీవల సోనియాగాంధీకి లేఖ రూపంలో తెలియజేశారట. ఇలాగే చూస్తూ ఊరుకుంటే శివసేన, ఎన్సీపీలు కలసి కాంగ్రెస్ ను మహారాష్ట్రలో నామరూపాల్లేకుండా చేస్తాయని ఆ లేఖలో పేర్కొన్నారని తెలిసింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా మేలుకోకుంటే భవిష‌్యత్ ఉండదన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయం.

Tags:    

Similar News