సర్వం విలీనం … ఇదే గులాబీ మంత్రం …?

అపూర్వ విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు అశ్వమేధ యాగానికి సిద్ధమైంది. శత్రువులను పూర్తిగా నిర్ములించడమే లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతుంది. ఇప్పటికే ఇద్దరిని [more]

Update: 2019-01-12 09:30 GMT

అపూర్వ విజయం సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు అశ్వమేధ యాగానికి సిద్ధమైంది. శత్రువులను పూర్తిగా నిర్ములించడమే లక్ష్యంగా తన వ్యూహాలకు పదును పెడుతుంది. ఇప్పటికే ఇద్దరిని తమ పార్టీలో కలిపేసుకున్న గులాబీ దళం తాజాగా టిడిపిపై కన్నేసింది. వీరి తరువాత కాంగ్రెస్ సంగతి చూడాలన్న ఎత్తుగడలతో కదులుతూ ప్రత్యర్థులకు దడపుట్టిస్తుంది. దాంతో తెలంగాణాలో ప్రధాన పార్టీలేవీ మనుగడ సాధించలేని స్థితి రాబోయే రోజుల్లో కనిపించే బోతుంది.

సండ్ర, మెచ్చా వికెట్లు పడనున్నాయా ..?
మిషన్ భగీరథ కు ఛైర్మెన్ పదవిని టిడిపి ఎమ్యెల్యే సండ్ర వీరవెంకటయ్యకు, మెచ్చా నాగేశ్వర రావు కు గిరిజన ఆర్ధిక సంస్థకు చైర్మెన్ పదవులు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకారం కుదిరినట్లు టాక్. అయితే తాను మారబోనని ఇటీవలే మెచ్చా నాగేశ్వర రావు అమరావతి వెళ్ళి మరీ చంద్రబాబు చేతిలో చెయ్యేసి చెప్పి వచ్చారు. అయితే ఆయనపై నిరంతరం పెరుగుతున్న వత్తిడితో గులాబీ కండువా కప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆయన సన్నిహితులు చెబుతన్నారు. దాంతో మంచి ముహూర్తం చూసుకుని టిడిపి జండా పీకడానికి వీరిద్దరూ సిద్ధంగా వున్నారని తెలుస్తుంది.

కాంగ్రెస్ మొత్తాన్ని …
టిడిపి సంగతి అలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కి వలవిసురుతుంది టీఆరెస్. ఇప్పటికే కాంగ్రెస్ కి చెందిన 8 మంది ఎప్పుడెప్పుడు అధికారపార్టీలోకి వెల్దామా అని ఎదురు చూస్తుంటే మరో ఐదుగురు చేరితే కాంగ్రెస్ మెజారిటీ పక్షాన్ని కలుపుకుని వెళ్లాలని గులాబీ వ్యూహం సిద్ధం చేసింది. ఎన్నికైన వారిలో 13 మంది అధికార పార్టీ తీర్ధం పుచ్చుకుంటే న్యాయపరమైన సాంకేతిక సమస్యలు ఉండవని గులాబీ పార్టీ ఇప్పటివరకు వేచి చూస్తుంది. మరి ఏమి జరగనుందో.

Tags:    

Similar News