Congress : ఇక శాసించేది ఈ ఇద్దరేనట

కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేని నాయకత్వ సంక్షోభం నెలకొంది. శాశ్వత అధ్యక్షుడు ఇప్పటి వరకూ లేరు. దీంతో కాంగ్రెస్ నేతలతో పాటు మిత్ర పక్షాలు కూడా అసంతృప్తి [more]

Update: 2021-10-11 16:30 GMT

కాంగ్రెస్ పార్టీలో ఎన్నడూ లేని నాయకత్వ సంక్షోభం నెలకొంది. శాశ్వత అధ్యక్షుడు ఇప్పటి వరకూ లేరు. దీంతో కాంగ్రెస్ నేతలతో పాటు మిత్ర పక్షాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ తాను పార్టీ అధ్యక్షుడిగా ఉండలేనని చెబుతూ వస్తున్నారు. కానీ రోజురోజుకూ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు కావాలన్న డిమాండ్ పెరగడంతో ఇప్పుడిప్పుడే పార్టీ అధినాయకత్వం చర్యలు ప్రారంభించింది.

వచ్చే జూన్ నెలలో….

జూన్ నెలలో పార్టీ అధ్యక్షుడు ఎన్నికవుతారని పార్టీ నాయకత్వం ప్రకటించింది. నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియపై చర్చించేందుకు ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అధ్యక్షుడిగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై క్లారిటీ రానుంద.ి సంస్థాగత ఎన్నికలను జరపాలని పార్టీ నాయకత్వం నిర్ణయించడంతో ఇక ఎవరు అధ్యక్షుడన్న ఉత్కంఠ నెలకొంది.

జట్టుగా బాధ్యతలను….

అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక లు జట్టుగా బాధ్యతలను చేపడతారన్న ప్రచారం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రియాంకలు ఉంటారు. వీరి పర్యవేక్షణలోనే పార్టీ వచ్చే లోక్ సభ ఎన్నికలకు వెళ్లనుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాతనే పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, మణిపూర్, గోవా, గుజరాత్ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి.

మూడు రాష్ట్రాలపై….

ఈ ఎన్నికలు ముగిసిన తర్వాతనే అధ్యక్ష ఎన్నిక ఉండేలా ప్లాన్ చేశారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ గుజరాత్, పంజాబ్, గోవాలపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో గెలిచినట్లుగానే, ఈసారి మూడు రాష్ట్రాలను కైవసం చేసుకుంటామన్న ధీమాలో ఉంది. దీంతో ఆ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ రాబోతున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయబోతున్నారు.

Tags:    

Similar News