జగన్ దెబ్బతీయడానికి ప్రత్యర్థులతో చేతులు కలుపుతారా?

కాంగ్రెస్ పార్టీని మూడు దశాబ్దాలకు పైగా వైఎస్సార్ మోశారు. ఆ పార్టీ నుంచే ముఖ్యమంత్రి అయ్యారు. అలా కావడమే తనకు గర్వకారణం అని కూడా అనుకున్నారు. ఆయన [more]

Update: 2021-07-09 06:30 GMT

కాంగ్రెస్ పార్టీని మూడు దశాబ్దాలకు పైగా వైఎస్సార్ మోశారు. ఆ పార్టీ నుంచే ముఖ్యమంత్రి అయ్యారు. అలా కావడమే తనకు గర్వకారణం అని కూడా అనుకున్నారు. ఆయన కుమారుడు జగన్ కాంగ్రెస్ బడిలోనే రాజకీయ అక్షరాభ్యాసం చేసినా కూడా సొంత దారి వెతుక్కున్నారు. దానికి అటూ ఇటూ కూడా కారణమే అని చెప్పాలి. ఇక కాంగ్రెస్ పార్టీ తన మీద అక్రమంగా సీబీఐ కేసులు పెట్టించింది, తన తండ్రి కష్టంలో దక్కిన అధికారంలో తనకు ఏ మాత్రం వాటా ఇవ్వకుండా చేసింది అన్నది జగన్ ఆక్రోశంగా ఉంది. అదే సమయంలో తండ్రిని రాజకీయంగా ఎంతో ఎత్తుకు తెచ్చిన పార్టీకి వెన్నుపోటు పొడిచి జగన్ వెళ్ళిపోయారని కాంగ్రెస్ పెద్దలు కూడా భావిస్తున్నారు.

ఎప్పటికీ దూరమేనా …?

జగన్ ఇపుడు ఏపీలో బలమైన నాయకుడిగా ఉన్నారు. అటు వైపు చూస్తే కాంగ్రెస్ దైన్యం అంతా ఇంతా కాదు. ఏడేళ్ళుగా వనవాసమే చేస్తోంది. ఈ రోజుకు కూడా దశ దిశ అన్నది కాంగ్రెస్ కి కనిపించడంలేదు. అలాంటి కాంగ్రెస్ మోడీకి తగ్గుతున్న ప్రజాదరణను అయినా సొమ్ము చేసుకుని 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే మార్గాలని వెతకడం లేదా అన్న చర్చ అయితే వస్తోంది. ఇటు జగన్ తోనూ అటు కేసీయార్ తోనూ పేచీకే రెడీ అవుతోందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇక ఏపీలో చూస్తే జగన్ మీద గెలవాలన్న ఆరాటమే కాంగ్రెస్ లో కనిపిస్తోంది అంటే ఎప్పటికీ దూరంగానే ఈ ఇద్దరూ ఉంటారని చెప్పాల్సిందే.

రాంగ్ రూట్ లో …

కాంగ్రెస్ చాలా కాలం క్రితమే రూట్ తప్పేసింది. లేకపోతే మోడీ సర్కార్ ఫెయిల్యూర్స్ ని అనుకూలంగా మార్చుకుని తనతో విభేదించిన వారితో జట్టుకట్టే ప్రయత్నం ఎందుకు చేయకూడదు. బెంగాల్ లో మమతా బెనర్జీని, ఏపీలో జగన్ ని, తెలంగాణాలో కేసీయార్ ని మచ్చిక చేసుకుంటే కాంగ్రెస్ అనుకున్నది సాధ్యమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. కానీ కాంగ్రెస్ పాత పగలతో రగులుతోంది అనిపిస్తోంది. తనకు ఏ మాత్రం బలం లేకపోయినా కాంగ్రెస్ వీడి వెళ్ళిన వారిని మాజీలను చేయాలనే కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారానికి ఆమడ దూరంలో నిలిచానని మాత్రం మరచిపోతోంది.

కచ్చితంగా అంతే…?

తెలంగాణాలో కేసీయార్ కి పోటీగా రేవంత్ రెడ్డిని పెట్టాక టీఆర్ఎస్ కచ్చితంగా 2024లో కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చే సీన్ ఉండదు. అదే విధంగా ఏపీలో జగన్ ని దెబ్బతీయాలని ప్రత్యర్ధులతో చేతులు కలుపుతున్న తీరుతో ఆయన అసలు కాంగ్రెస్ ని దగ్గరకు రానీయడు. రాహుల్ ప్రధాని గా ఓటే వేయరు అన్న మాట ఉంది. చిత్రమేంటి అంటే కాంగ్రెస్ మరోసారి చంద్రబాబును నమ్ముకుంటోంది అన్న వార్తలు రావడం. 2019 ఎన్నికల తరువాత ఓడి వాడిన బాబు విపక్ష కూటమిని ఏ మాత్రం బలోపేతం చేయకుండా వారి ఊసు తలవకుండా ఉన్నారు. అలాంటి బాబుతోనే నడవాలని కాంగ్రెస్ నిర్ణయించుకుందని అందుకే ఆయన శిష్యుడికి తెలంగాణా పగ్గాలు అప్పగించిందని టాక్. ఇదే నిజమైతే మాత్రం కాంగ్రెస్ ని ఆ దేవుడు కూడా కాపాడలేడేమో.

Tags:    

Similar News