గుజరాత్ లో కాంగ్రెస్ కు కష్టకాలమేనా?

గుజరాత్ లో కాంగ్రెస్ కు కలసి రావడం లేదు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత డీలా పడిపోయింది. రాహుల్ నాయకత్వంలో గుజరాత్ [more]

Update: 2020-06-07 16:30 GMT

గుజరాత్ లో కాంగ్రెస్ కు కలసి రావడం లేదు. గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత డీలా పడిపోయింది. రాహుల్ నాయకత్వంలో గుజరాత్ ఎన్నికలకు వెళ్లిన కాంగ్రెస్ మంచి ఫలితాలనే సాధించింది. అప్పట్లో గుజరాత్ ఎన్నికల తర్వాత రాహుల్ నాయకత్వంపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ మరింత పుంజుకుంటుందని అందరూ భావించారు.

కోలుకోలేని పరిస్థితి…..

కానీ జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో కోలుకోలేని పరిస్థితికి చేరుకుందనే చెప్పాలి. గుజరాత్ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పుట్టినిల్లు. సొంత రాష్ట్రంలో పట్టును నిలుపుకోలేకపోతే వారికి దేశ వ్యాప్తంగా ఇబ్బందులు ఎదురవుతాయి. పార్టీలో కూడా వ్యతిరేకత వస్తుంది. అందుకే తొలి నుంచి గుజరాత్ పై మోదీ, అమిత్ షాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎన్ని సమస్యలున్నప్పటికీ వారు గుజరాత్ ను మాత్రం విస్మరించబోరు.

హ్యాండిస్తున్నారు….

గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఇందులో బీజేపీకి ప్రస్తుతం 103 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ కు 66 మంది శాసన సభ్యులున్నారు. వీరిలో ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతుండం కాంగ్రెస్ లో కలవరం రేపుతోంది. అధికారంలో లేకపోయినా ప్రతిపక్షంలో ఉండి మోదీ సొంత రాష్ట్రంలో ధీటుగా ఎదుర్కొనాలనుకున్న కాంగ్రెస్ కు సొంత పార్టీ ఎమ్మెల్యేలే హ్యాండ్ ఇస్తుండటం ఆందోళన కల్గిస్తుంది.

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే…?

ఈనెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలున్నాయి. నాలుగు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో బీజేపీ మూడు రాజ్యసభ స్థానాలకు పోటీ చేయనుంది. ఈ మూడు స్థానాలు బీజేపీ సిట్టింగ్ స్థానాలే. అందుకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ వల వేసింది. రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం ప్రారంభమయింది. ఇప్పటికే ఏడుగురు కాంగ్రెస్ సభ్యులు రాజీనామా చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు.మరి కాంగ్రెస్ మిగిలిన సభ్యులను ఎలా కాపాడుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News