అలజడి ఇప్పట్లో చల్లారేలా లేదే?

కాంగ్రెస్ అసలే కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో సమన్వయంతో వ్యవహరించాల్సిన నేతలు కట్టకట్టుకుని పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఇది కాంగ్రెస్ ఆడుతున్న డ్రామానా? లేక నిజంగానే [more]

Update: 2020-08-24 17:30 GMT

కాంగ్రెస్ అసలే కష్టకాలంలో ఉంది. ఈ సమయంలో సమన్వయంతో వ్యవహరించాల్సిన నేతలు కట్టకట్టుకుని పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ఇది కాంగ్రెస్ ఆడుతున్న డ్రామానా? లేక నిజంగానే కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ అధిష్టానం పట్ల వ్యతిరేకతతో ఉన్నారా? అన్నది చర్చనీయాంశమైంది. రెండుసార్లు వరస ఓటములను చవిచూసిన కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు సరిదిద్దుకోక పోగా, సీనియర్లు తమ ఆధిపత్యం పార్టీపై ప్రదర్శించడం కోసం ఈ లేఖ రాశారా? అన్నది తెలియాల్సి ఉంది.

తొలిసారి సోనియాపైనే….?

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏడు గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ యువనేత సీనియర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాహుల్ సీనియర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. సోనియా గాంధీ నాయకత్వంపై తొలిసారి తిరుగుబాటు కన్పించింది. కాంగ్రెస్ కు చెందిన 23 మంది సీనియర్లు సీడబ్ల్యూసీ సమావేశానికి ముందు లేఖ రాశారు. సంస్థాగత ఎన్నికలు జరపాలని, స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలని, పటిష్టమైన నాయకత్వం కావాలని ఏడు పేజీల లేఖ రాసిన సంగతి తెలిసిందే.

సీనియర్లు అందరూ కట్టకట్టుకుని….

గత కొద్దిరోజులోగా కాంగ్రెస్ ల యువనేతలు, వృద్ధనేతల మధ్య గత కొంతకాలంగా అంతర్గత యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 7వ తేదీన ఈ లేఖ రాస్తే, 23వ తేదీన ఈ లేఖను ఒక జాతీయ పత్రికకు లీక్ చేశారు. ప్రధానంగా లేఖ లీక్ విషయంపైనే రాహుల్ గాంధీ, ఏకే ఆంటోని వంటి వారు తప్పు పట్టారు. లేఖ రాసిన వాళ్లలో గులాం నబీ ఆజాత్, శశిధరూర్. వివేక్ తన్ ఖా, పృథ్వీరాజ్ చౌహాన్, కపిల్ సిబాల్. మనీష్ తివారి, ఆనందశర్మ తదితరులు ఉన్నారు.

రాహుల్ పై వ్యతిరేకతతోనే…

ప్రధానంగా రాహుల్, ప్రియాంక ల జోక్యం పట్ల సీనియర్లు కొంత అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. తమ అసంతృప్తిని లేఖ ద్వారా బయటపెట్టినట్లు తెలిసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇబ్బంది పెడుతున్న జూనియర్ నేతలను కట్టడి చేసేందుకే ఈ లేఖ రాశారని చెబుతున్నారు. రాహుల్ నాయకత్వ బాధ్యతలను వదిలేసిన తర్వాతనే ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని, అయితే సీనియర్ల సూచనలను రాహుల్ పట్టించుకోక పోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. మొత్తం మీద సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతారని ప్రకటించినా, పార్టీలో తలెత్తిన అలజడి ఇప్పట్లో సర్దుబాటు అయ్యేలా కన్పించడం లేదు.

Tags:    

Similar News