కలుపుకుని పోదామనుకున్నా…. కలసి రావడం లేదే?

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా? దీనిపై ప్రజలకు ఎప్పుడో క్లారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రం ఇంకా డౌటుగానే ఉంది. అసలు [more]

Update: 2020-09-17 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా? దీనిపై ప్రజలకు ఎప్పుడో క్లారిటీ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రం ఇంకా డౌటుగానే ఉంది. అసలు పార్టీ ఉంటే సీనియర్ నేతలందరూ ఏమయ్యారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటు న్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని వివాదాస్పదమవుతున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం పట్టించుకోవడం లేదు. విపక్షాలన్నీ ఏదో ఒక అంశంపై ఉద్యమిస్తూ ప్రజల్లో ఉంటుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం గుమ్మం దాటి బయటకు రావడం లేదు. ప్రధానంగా సీనియర్ నేతలు పార్టీని పట్టించుకోవడం లేదు.

ఎన్నో పదవులు అనుభవించి…..

పదేళ్లకు ముందు వరకూ కాంగ్రెస్ నేతలు ఎన్నో పదవులు అనుభవించారు. కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలను చేపట్టిన వారే. కానీ పదేళ్ల నుంచి వారు పత్తా లేకుండా పోయారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసుకుందామన్న ధ్యాస కూడా లేదు. ఒక్క పార్టీ అధ్యక్షుడు శైలజానాధ్ మాత్రమే ప్రతి అంశంపైనా స్పందిస్తున్నారు. సీనియర్ నేతలను కలుపుకుని పోయేందుకు శైలజానాధ్ ఎంతగా ప్రయత్నిస్తున్నా వారు కలసి రావడం లేదు.

నల్లారి నివేదికలు తప్పించి…..

రాష్ట్ర విభజనతో సీనియర్ నేతలు కొందరు పార్టీని వీడి వెళ్లినా మరికొందరు మాత్రం పార్టీలో ఉన్నా లేనట్లే. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా ఆయన సింబల్ ను చొక్కా జేబులో పెట్టుకున్నారు కాని, ఎక్కడా ఆయన ఆచూకీ కన్పించదు. మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన కేంద్ర నాయకత్వానికి సలహాలు, నివేదికలు ఇస్తున్నారు తప్పించి పార్టీని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర సమస్యలపై ఇలా చేయాలని కూడా నాయకత్వానికి డైరెక్షన్ ఇవ్వడం లేదు.

సీనియర్ నేతలున్నా…..

ఇక సీనియర్ నేతలు జేడీ శీలం, పల్లంరాజు, చింతామోహన్, కనుమూరి బాపిరాజు వంటి నేతలు కన్పించడం మానేశారు. చింతామోహన్ తనకు ఏపీసీసీ పదవి దక్కలేదన్న ఆగ్రహంతో ఉన్నారు. అందుకే ఆయన పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. వీరందరితో విడతల వారీగా శైలజానాధ్ సమావేశం అవుతున్నా వారు సరిగా సహకరించడం లేదు. రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు యాక్టివ్ గా ఉన్న వారు ఇప్పుడు ఎందుకు లేరన్న ప్రశ్న తలెత్తుతోంది. మొత్తం మీద ఏపీ లో కాంగ్రెస్ భవిష్యత్ లోనూ కోలుకునే అవకాశం లేనట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News