ఊపు తెచ్చినట్లున్నారే?

జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపు, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు, హర్యానాలో బీజేపీని ముప్పుతిప్పలు పెట్టడం వంటి అంశాలు జాతీయ పార్టీ కాంగ్రెస్ లో నూతనోత్తేజం నింపాయనే చెప్పాలి. నిజానికి [more]

Update: 2020-01-01 17:30 GMT

జార్ఖండ్ ఎన్నికల్లో గెలుపు, మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు, హర్యానాలో బీజేపీని ముప్పుతిప్పలు పెట్టడం వంటి అంశాలు జాతీయ పార్టీ కాంగ్రెస్ లో నూతనోత్తేజం నింపాయనే చెప్పాలి. నిజానికి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ గడగడ లాడించింది. మోదీని భయపెట్టిందనే చెప్పాలి. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఓటమి ఒకింత నైరాశ్యంలోకి నెట్టింది. తిరిగి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో గెలుపులు కాంగ్రెస్ శ్రేణుల్లో దేశ వ్యాప్తంగా ఆనందంతో పాటు ధైర్యాన్ని నూరిపోశాయనే చెప్పాలి.

పార్లమెంటు ఎన్నికల్లో…..

అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పూర్తిగా దెబ్బతినింది. కనీస స్థానాలను కూడా సంపాదించుకోలేెక పోయింది. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. దీంతో కాంగ్రెస్ లో తీవ్ర వత్తిడి ప్రారంభమయింది. పార్టీని మీరే నడపండంటూ రాహుల్ గాంధీని బతిమాలినా వినలేదు. చివరకు సోనియా గాంధీ తాత్కాలికంగా ఆ బాధ్యతలను చేపట్టారు.

సోనియా తిరిగి…..

సోనియా గాంధీ అధ్యక్ష్య బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీకి వరస విజయాలు వస్తున్నాయి. అప్పటి వరకూ బీజేపీకి మిత్రులుగా ఉన్న వారిని తమలో కలిపేసుకుంటూ సోనియా మార్క్ రాజకీయాన్ని నడుపుతున్నారు. మహారాష్ట్రలో శివసేనకు మద్దతు ఇవ్వడం అంటే కాంగ్రెస్ సీనియర్ నేతలు సయితం కలలో కూడా ఊహించలేదు. లౌకిక వాద పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్ హిందుత్వ పార్టీకి మద్దతివ్వడం పార్టీ చరిత్రలో సంచలన నిర్ణయంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది.

ఉత్సాహం నింపేందుకు……

తాజాగా జార్ఖండ్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని ఇచ్చాయి. ఇప్పుడు పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై కాంగ్రెస్ దేశ వ్యాప్త ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించింది. స్వయంగా సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు ఈ ఆందోళనల్లో పాల్గొనడటంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఎన్సార్సీ అమలు విషయంలో అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తుండటంతో కాంగ్రెస్ తనకు అనుకూలంగా మలచుకుంటోంది. మొత్తం మీద గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహం కాంగ్రెస్ నేతల్లో కన్పిస్తుంది. ఏఐసీసీ భవన్ కళకళలాడుతుంది.

Tags:    

Similar News