మహా ‘‘బలులు‘‘ ఎవరు?

మహారాష్ట్ర ఎన్నికల నగారా మోగింది. వచ్చే 21వ తేదీన పోలింగ్ మహారాష్ట్రలో జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు పొత్తులపై ఒక స్పష్టతకు వచ్చాయి. మరో ఐదు రోజుల్లో [more]

Update: 2019-09-21 18:29 GMT

మహారాష్ట్ర ఎన్నికల నగారా మోగింది. వచ్చే 21వ తేదీన పోలింగ్ మహారాష్ట్రలో జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు పొత్తులపై ఒక స్పష్టతకు వచ్చాయి. మరో ఐదు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుండటంతో కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీ, శివసేన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మహారాష్ట్రలో తిరిగి విజయం సాధించాలని బీజేపీ కూటమి, ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే సోనియా గాంధీ మహారాష్ట్ర ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుకు స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

కాంగ్రెస్ కూటమి…..

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్నాయి. కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే అవగాహనకు వచ్చాయి. ప్రాంతాల వారీగా సీట్ల సర్దుబాబు చేసుకుంటున్నారు. సోనియా గాంధీ, శరద్ పవార్ లు కలసి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చర్చలు జరిపారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు చావుదెబ్బ తినడంతో ఈసారి జాగ్రత్తగా అడుగులు వేయాలని నిర్ణయించాయి. మహరాష్ట్ర నవ నిర్మాణ సేనను కూడా కలుపుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

బీజేపీ, శివసేనలు కలసి….

ఇక అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, శివసేన లు కూడా కలసి పోటీ చేయాలని నిర్ణయించాయి. పొత్తు పై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లే. అయితే సీట్ల సర్దుబాటు విషయం మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. రేపో, మాపో సీట్ల సర్దుబాటుపై కూడా రెండు పార్టీలూ సంయుక్త ప్రకటన చేసే అవకాశముంది. ఇప్పటికే మొత్తం 288 సీట్లలో శివసేన 126, బీజేపీ 162 సీట్లలో పోటీ చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే కొన్ని సీట్లను తగ్గించుకోవాలని శివసేన బీజేపీపై వత్తిడి తెస్తోంది. తమకు అధిక సీట్లు కావాలని కోరుతోంది.

బీజేపీకే ఛాన్సెస్….

అమిత్ షా ఈ నెల 22న మహారాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈలోపే సీట్ల సర్దుబాబు జరిగిపోవాలని శివసేన అధినేత బాల్ ధాక్రే కోరుతున్నారు. ఇప్పటికే లోక్ సభ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఊపు మీదున్న ఈ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇతర పార్టీల నుంచి నాయకులు ఇప్పటికే బీజేపీలో చేరుతుండటం మరింత బలాన్ని ఇస్తోంది. కాంగ్రెస్ కూటమికి మాత్రం మహారాష్ట్ర ఎన్నికల్లో కష్టాలు తప్పవంటున్నారు. ఆ పార్టీ ఓటు బ్యాంకు కూడా దాదాపుగా కోల్పోయిందంటున్నారు. ఎన్సీపీ కొన్ని ప్రాంతాలకే పరిమితమయింది కావడంతో బీజేపీ కూటమికే ఎక్కువ విజయావకాశాలున్నాయన్నది విశ్లేషకుల అంచనా.

Tags:    

Similar News