కన్ఫ్యూజన్ తో కమలం?

ఏపీ రాజకీయాల్లో కమలం పార్టీ కన్ఫ్యూజన్ కొనసాగుతూనే వుంది. ఒక్కో నేత ఒక్కోరకమైన వ్యాఖ్యలతో వారి పార్టీలో అయోమయాన్ని మరింతగా పెంచుతున్నారు. జగన్ సర్కార్ మూడు రాజధానుల [more]

Update: 2020-02-17 09:30 GMT

ఏపీ రాజకీయాల్లో కమలం పార్టీ కన్ఫ్యూజన్ కొనసాగుతూనే వుంది. ఒక్కో నేత ఒక్కోరకమైన వ్యాఖ్యలతో వారి పార్టీలో అయోమయాన్ని మరింతగా పెంచుతున్నారు. జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయం దగ్గర నుంచి మండలి రద్దు వరకు బీజేపీ నేతల వైఖరి భిన్నమైన దారుల్లో వెళ్లడంతో రాష్ట్ర పార్టీ వ్యూహాని,కి కేంద్ర ప్రభుత్వ వ్యూహానికి బాగా తేడా స్పష్టం అయిపోతుంది. ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తమ పార్టీ ఆలోచన ఇది అని చెప్పిన సమయంలోనే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జివి ఎల్ వ్యాఖ్యలు దానికి భిన్నంగా ఉంటాయి. ఇక మాజీ కేంద్రమంత్రి పురంధరేశ్వరి ఒకటి అంటే ఎమ్యెల్సీ సోము వీర్రాజు మరొకరకంగా స్పందించడం గమనార్హం.

మండలి రద్దుపై తలోదారి …

వచ్చే మునిసిపల్ ఎన్నికలకు కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు బీజేపీ రాజమహేంద్రిలో ఒక సమావేశం నిర్వహించింది. దీనికి బీజేపీ నేతలు పురంధరేశ్వరి, పైడికొండల మాణిక్యాల రావు, ఎమ్యెల్సీలు మాధవ్, సోము వీర్రాజులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధరేశ్వరి, సోము వీర్రాజు లు పార్టీ కార్యాలయంలోనే విడి విడిగా మీడియా తో మాట్లాడారు. శాసన మండలి రద్దు సరైన నిర్ణయం కాదని పురంధరేశ్వరి స్పందించారు. ఆ తరువాత మాట్లాడిన సోము వీర్రాజు అసలు మండలి వ్యవస్థపై ప్రజల్లో సదాభిప్రాయమే లేదని, అది ఉన్నా లేకపోయినా నష్టం లేదన్నారు. తమ పార్టీ అధిష్టానం నిర్ణయమే తమకు శిరోధార్యమని తమ సొంత అభిప్రాయాలు ఏమి లేవని తేల్చేశారు.

గతంలోనూ అంతే ….

గతంలో కూడా మూడు రాజధానుల అంశంపై బీజేపీ లో రచ్చ మొదలైనప్పుడు ఆ పార్టీ ఎపి ఇంచార్జ్ సునీల్ దేవధర్ దాన్ని సామరస్యంగా పరిష్కరించారు. ఎంపీ సుజనా చౌదరి కన్నా లక్ష్మీనారాయణ లు ఒక వాదన, సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు లది మరో వాదన కావడంతో కమలం లో రెండు మూడు వర్గాలుగా వ్యవహారం సాగి చివరికి పెద్దల జ్యోక్యంతో సెట్ అయ్యింది. తాజాగా ఏపీ లో వేగంగా మారుతున్న రాజకీయాలు, సర్కార్ నిర్ణయాలతో మరోసారి బీజేపీ లో భిన్నస్వరాలు మరోసారి వినిపించడం ఇప్పుడు చర్చనీయం అయ్యింది.

Tags:    

Similar News