ఇక్కడ బలం పెరుగుతుందా? బలహీనమవుతుందా?

దేశంలో కమ్యునిస్టులు పార్టీలు కనుమరుగవుతాయనుకుంటున్న తరుణంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కమ్యునిస్టులు కేరళ, పశ్చిమ బెంగాల్ లోనే కొంత పట్టు ఉంది. [more]

Update: 2021-03-15 17:30 GMT

దేశంలో కమ్యునిస్టులు పార్టీలు కనుమరుగవుతాయనుకుంటున్న తరుణంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కమ్యునిస్టులు కేరళ, పశ్చిమ బెంగాల్ లోనే కొంత పట్టు ఉంది. కేరళలో కొంత విజయావకాశాలు కన్పిస్తున్నప్పటికీ, పశ్చిమ బెంగాల్ లో కమ్యునిస్టుల పరిస్థితి ఏంటన్నది దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పశ్చిమ బెంగాల్ లో ఈసారి కనీసం కమ్యునిస్టులు పరువు నిలబెట్టుకుంటారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో….

కమ్యునిస్టులకు ఇటీవల ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత బలం పెరుగుతుంది. బీహార్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లోనూ ఆర్జేడీ కూటమి నుంచి పోటీ చేసిన కమ్యునిస్టు పార్టీలు 12 స్థానాలను చేజిక్కించుకున్నాయి. కాంగ్రెస్ కంటే మెరుగైన ఫలితాలు సాధించాయి. కాంగ్రెస్ కంటే తక్కువ స్థానాల్లో పోటీ చేసి సమాన స్థాయిలో విజయం సాధించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లోనూ కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు కూటమి కట్టాయి.

ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి….

92 అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కు ఇచ్చి మిగిలిన స్థానాల్లో కమ్యునిస్టులు పోట ీచేయడానికి రెడీ అవుతున్నారు. 2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో కనీస పనితీరును కనపర్చలేదు. 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ కమ్యునిస్టులది అదే పరిస్థితి. కొన్ని దశాబ్దాల పాటు పశ్చిమ బెంగాల్ ను ఏలిన కమ్యునిస్టు పార్టీలు పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉంటూ వస్తున్నాయి. నేతలు పార్టీ వీడినా క్యాడర్, ఓటు బ్యాంకు ఇంకా బలంగా ఉందని కమ్యునిస్టులు విశ్వసిస్తున్నారు.

కూటమి ఏర్పాటులోనూ….

కమ్యునిస్టు పార్టీలు ఈసారి కూటమి ఏర్పాటులో జాగ్రత్త వహించాయి. కాంగ్రెస్ తో పాటు ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ను కలుపుకున్నాయి. ఇది ముస్లిం అనుకూల పార్టీ కావడంతో కొంత బలం పెరుగుతుందని కమ్యునిస్టులు భావిస్తున్నారు. వీరి ఓట్లను చీల్చడం ద్వారా తాము అనేక నియోజకవర్గాల్లో పాగా వేయమన్న అంచనాలో కమ్యునిస్టులు ఉన్నారు. వందకు పైగా స్థానాల్లో ఐఎస్ఎఫ్ కీలకంగా మారడంతో ఈసారి కమ్యునిస్టుల కూటమి కొంత బలంగా కన్పిస్తుంది. మరి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచిచూడాలి.

Tags:    

Similar News