కోడిపై కత్తికట్టిన కోస్తా ..!!.

సంక్రాంతి పండుగకు కోడి పందాలకు వీడతీయరని బంధం. ఈ పండుగలో సంప్రదాయంగా వస్తున్న కోడిపందాలు నిరోధించడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజకీయ నాయకుల లాబీయింగ్ ముందు [more]

Update: 2019-01-16 00:30 GMT

సంక్రాంతి పండుగకు కోడి పందాలకు వీడతీయరని బంధం. ఈ పండుగలో సంప్రదాయంగా వస్తున్న కోడిపందాలు నిరోధించడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజకీయ నాయకుల లాబీయింగ్ ముందు ఖాకీలు తలవంచకతప్పడం లేదు. పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్న పోలీసుల హెచ్చరికలు మాటలకే పరిమితం అవుతున్నాయి. ఈసారి పండగకు ఇలాంటి ప్రకటనలనుంచే పోలీసుల హెచ్చరికల రూపంలో రొటీన్ గా వచ్చాయి. అలాగే రొటీన్ గానే పందెం రాయుళ్ళు బహిరంగంగానే ఆంక్షలు తోసిరాజని ఆట మొదలు పెట్టేశారు.

అక్కడ ఏడాది మొత్తం …

ఇప్పుడు కోడిపందాలకు గోదావరి జిల్లాలకు వెళ్ళి రావడం వ్యయ ప్రయాసలు ఎందుకని ఎక్కడికక్కడే నిర్వహించేస్తున్నారు ఇటీవల. దాంతో అక్కడక్కడ తప్ప కోస్తాలోని అన్ని జిల్లాలు ఇప్పుడు కోడిపందాలకు వేదికలుగా మారాయి. గతంలో కోడిపందాల నిర్వహణపై దాఖలైన కేసుల్లో కోర్టు కత్తి కట్టకుండా పోటీలు నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం సూచించడంతో చిన్న వెసులుబాటు లభించింది. అయితే పందాలను మాత్రం కోర్టు అంగీకరించలేదు. గ్యాంబ్లింగ్ యాక్ట్ ప్రకారం జరిగే పందాలపై కేసులు నమోదు చేయొచ్చు. కానీ పందెం రాయుళ్ళు కోళ్ళకు కత్తి కట్టడం లేదని, సంప్రదాయాలంటూ పందేలు కానిస్తున్నారు.

నేతలకు తలపోటు … ?

ఎన్నికల ఏడాది కావడంతో గ్రామాల్లో నాయకుల పరిస్థితి అడ్డకత్తెరలో పోకచెక్కలా మారింది. కోడిపందాలు నిర్వహించుకోలేకపోతే గ్రామంలో పరువు పోతుంది. పోలీస్ దాడి చేస్తే మరో బాధ. కోడి పందాలకు ఆ పార్టీ ఈపార్టీ అని కాదు అందరు కలిసిపోతారు. అధికారపార్టీ నాయకులతోనే పోలీసులకు చెప్పించడం ఆనవాయితీగా వస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ప్రాంతంలో ఎమ్యెల్యే చింతమనేని ప్రభాకర్ ఆశీస్సులతో ఏడాది మొత్తం పందాలు సాగుతాయని ఆరోపణలు వున్నాయి. అంటే ఏ స్థాయిలో నేతల ప్రభావం పందాలపై సాగుతుందో చెప్పక చెప్పొచ్చు. కోళ్ళకు కత్తులు కట్టి మరీ పందాలు సాగుతున్నా ఒక పక్క టివి ఛానెల్స్ లో లైవ్ లో ఇవన్నీ చూపిస్తున్నా ఖాకీలు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పోలీస్ శాఖ చేతుల్లో ఏమి లేదన్నది తేటతెల్లం అయిపోతుంది.

Tags:    

Similar News