క్లీన్ ప్లేట్.. చైనా అందుకే చేస్తుందా?

చైనా ఎప్పుడు ఏ పనిచేసినా దానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఏదీ ఊరికే చైనీయులు చేయరు. ప్రస్తుతం చైనాలో కొత్త నినాదం బయలుదేరింది. క్లీన్ ప్లేట్ [more]

Update: 2020-08-27 18:29 GMT

చైనా ఎప్పుడు ఏ పనిచేసినా దానికి ఒక కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఏదీ ఊరికే చైనీయులు చేయరు. ప్రస్తుతం చైనాలో కొత్త నినాదం బయలుదేరింది. క్లీన్ ప్లేట్ నినాదాన్ని ఆ దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా క్లీన్ ప్లేట్ ను అమలు చేయాలని ఈ నినాదం సారాశం. అంటే ఆహారాన్ని వృధా చేయకూడదన్నది ముఖ్య ఉద్దేశ్యం. గతంలో కూడా ఇలాంటి నినాదాలు వచ్చినా ప్రజల వరకూ అమలు చేయలేదు. ఈసారి ప్రజలందరికీ వర్తింప చేయడం పలు అనుమానాలకు తావిస్తుంది.

భవిష్యత్తులో సమస్యే…..

ప్రధానంగా చైనా ఆహార ధాన్యాల సమస్య ను ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఆహార సమస్య తలెత్తుతుందనే ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే చైనా వరదలు ముంచెత్తాయి. దీంతో ఉన్న పంట పొలాలు కూడా నాశనం అయ్యాయి. భవిష్యత్తులో ఆహార ఉత్పత్తి తగ్గుముఖం పడుతుందన్న అంచనాకు జిన్ పింగ్ వచ్చారు. అందుకే దీర్ఘకాలిక దృష్టితోనే జిన్ పింగ్ క్లీన్ ప్లేట్ నినాదాన్ని తీసుకువచ్చారంటున్నారు.

అన్నీ నిండుకుంటున్నాయి….

గతంలో ఇతర దేశాలనుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునేది. ప్రస్తుతం గోధుమలను చైనా పెద్ద యెత్తున దిగుమతి చేసుకుంటోంది. గోధుమ నిల్వలు కూడా నిండుకునే పరిస్థితి ఏర్పడటంతో రిజర్వ్ లో ఉంచిన మొక్క జొన్నలను కూడా బయటకు తీస్తుంది. దీన్ని బట్టి చైనాలో ఆహార సమస్యను అర్ధం చేసుకోవచ్చు. దీంతో పాటు ప్రస్తుతం ఇతర దేశాల నుంచి పెద్దయెత్తున మాంసాహార ఉత్పత్తులను కూడా దిగుమతి చైనా చేసుకుంటోంది. చైనాకు ఇటువంటి నినాదాలు కొత్త కాదు.

కొత్తేమీ కాకపోయినా….

2013లోనూ ఆపరేషన్ క్లీన్ ప్లేట్ అన్న నినాదం తెచ్చారు. అది అప్పడు కేవలం పెద్దయెత్తున జరిగే ఫంక్షన్లకే పరిమితం చేశారు. 2015లో 18 మిలియన్ టన్నుల ఆహారం వృధా అయిందని చైనా అంచనా వేసింది. అందుకే భవిష్యత్తులో ఆహార సమస్య తలెత్తకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ క్లీన్ ప్లేట్ నినాదాన్ని అమలు చేయమని చెబుతున్నారు. రెస్టారెంట్లకు కూడా దీనిని వర్తింప చేస్తున్నారు. తక్కవ ఫుడ్ ను సప్లయ్ చేయాలి. ఎవరూ ఫుడ్ ను వేస్ట్ చేయకూడదు. ఎప్పుడు పడితే అప్పుడు భుజించకూడదు. ఇవన్నీ ఖచ్చితంగా పౌరులు అమలు చేస్తే ఆహార సమస్యను కొంతవరకూ అధిగమించవచ్చన్నది జిన్ పింగ్ అంచనా. మొత్తం మీద క్లీన్ ప్లేట్ ఉద్యమం చైనా లో ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News