ఊపిరి పీల్చుకున్నారు… ఇక ముహూర్తమేనా?

తమిళనాడు రాజకీయాల్లో క్లారిటీ వచ్చింది. రజనీకాంత్ పార్టీ ఈ ఎన్నికలకు వచ్చే అవకాశం లేదు. దీంతో డీఎంకే లో ఆనందోత్సాలు వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటి వరకూ రజనీకాంత్ పార్టీపై [more]

Update: 2021-01-05 17:30 GMT

తమిళనాడు రాజకీయాల్లో క్లారిటీ వచ్చింది. రజనీకాంత్ పార్టీ ఈ ఎన్నికలకు వచ్చే అవకాశం లేదు. దీంతో డీఎంకే లో ఆనందోత్సాలు వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటి వరకూ రజనీకాంత్ పార్టీపై డీఎంకేలో కొంత అయోమయం నెలకొంది. రజనీకాంత్ ఎఫెక్ట్ తన పార్టీ విజయంపై ప్రభావం ఉంటుందేమోనన్న ఆందోళన అయితే నిన్న మొన్నటి వరకూ ఉంది. తమకు దగ్గరగా వచ్చిన అధికారం రజనీకాంత్ వల్ల కోల్పోతామోనన్న భావన కూడా డీఎంకే నేతల్లో ఉంది.

రజనీ వెనక్కు తగ్గడంతో…..

అయితే రజనీకాంత్ పార్టీ రాకపోతుండటంతో డీఎంకే లో ఎన్నికలకు ముందే సంబరాలు కన్పిస్తున్నాయి. డీఎంకే పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉంది. ఈసారి గెలుపు ఖాయమని అనేక సర్వేలు చెబుతున్నాయి. గతంలో జరిగిన పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో సయితం డీఎంకే ఘన విజయం సాధించడంతో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని భావించారు. కానీ రజనీకాంత్ పార్టీ వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందేమోనన్న ఆందోళన వారిలో ఎక్కువగా కన్పించింది.

బలంగా ఉండటంతో…..

డీఎంకే ఇప్పుడు తమిళనాడులో బలంగా ఉంది. చిన్న పార్టీలతో కలసి అది కూటమిగా ఏర్పడింది. స్టాలిన్ బలమైన నేతగా తమిళనాడు ప్రజలకు కన్పిస్తున్నారు. ఈ దశలో రజనీకాంత్ వచ్చి తమ అదృష్టాన్ని చెడగొడతారేమోనన్న భయం వారిని పట్టుకుంది. అయితే రజనీకాంత్ ప్రకటన వచ్చే వరకూ వేచి చూడాలని, సంయమనం పాటించాలని స్టాలిన్ పార్టీ నేతలకు చెప్పారు.దీంతో వారు రజనీకాంత్ పై ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ చేయకుండా సంయమనం పాటించారు.

మొన్నటి వరకూ భయమే…..

ఇప్పుడు రజనీకాంత్ పార్టీ ఈ ఎన్నికలకు వచ్చే అవకాశమే లేదు. దీంతో స్టాలిన్ విజయం ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అన్నాడీఎంకే కూటమి నుంచి కూడా అనేక పార్టీలు తమ వైపు వచ్చే అవకాశముందని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. రజనీకాంత్ పార్టీ ప్రకటనను వెనక్కు తీసుకోవడంతో డీఎంకే నేతలు ఊపిరి పీల్చుకున్నారనే చెప్పాలి. మొత్తం మీద డీఎంకేకు ముందున్నవన్నీ మంచిరోజులేనని చెప్పాలి. అన్నీ సక్రమంగా జరిగితే స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యే రోజు ఎంతో దూరం లేదంటున్నారు ఆ పార్టీ నేతలు.

Tags:    

Similar News