కిక్ కావాలంటే…? సిటీకి రావాల్సిందే

హైదరాబాద్ నగరం డ్రగ్స్ తయారీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది. అంతేకాకుండా హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ అనేది కుటీర పరిశ్రమగా మారిపోయింది.. ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ [more]

Update: 2020-12-22 17:30 GMT

హైదరాబాద్ నగరం డ్రగ్స్ తయారీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది. అంతేకాకుండా హైదరాబాద్ లో డ్రగ్స్ తయారీ అనేది కుటీర పరిశ్రమగా మారిపోయింది.. ఎక్కడపడితే అక్కడ డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ముంబై మాఫియా కి హైదరాబాద్ కేంద్ర స్థానం గా మారింది. హైదరాబాదులో డ్రగ్స్ తయారీకి కావలసిన మొత్తం కూడా ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ముంబై మాఫియా నేరుగా హైదరాబాద్ కు ల్యాండ్ అయి డ్రగ్స్ తయారీకి అవసరమైన రా మెటీరియల్ తీసుకొని వెళ్లి పోతున్నారు. ఇటీవల కాలంలో చిన్న చిన్న పరిశ్రమ లో మత్తు మందు తయారు చేస్తున్న ముఠాలను డైరెక్ట్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. డ్రగ్స్ తయారు చేసే వారిని అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ముఠా దగ్గర నుంచి వందల కిలోల డ్రగ్స్ ను స్వాధీనపర్చుకున్నారు. అసలీ డ్రగ్ ఎలా తయారవుతుంది. ఎవరి తయారు చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? వీటన్నింటిపై సమగ్ర కథనం.

ఫార్మాసిటీగా….

హైదరాబాద్ నగరం ఫార్మాసిటీ కంపెనీలకు హబ్ గా మారింది. గత కొన్ని నెలల నుంచి కూడా హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో పనిచేసే బయోకెమిస్ట్రీ ఉద్యోగులు ఇప్పటివరకు తప్పుడు మార్గంలో తమ పనులను ఎంచుకొని డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కిక్ ఇచ్చే డ్రగ్స్ తయారు చేసేందుకు బయోకెమిస్ట్రీ పని చాలా కీలకం. పలు కంపెనీల్లో లో బయో కెమిస్ట్రీ లతోపాటు ఎమ్మెస్సీ చేసిన ఉద్యోగులు కొంత మంది కలిసి డ్రగ్స్ తయారు చేస్తున్న ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే గత ఆరు నెలల కాలంలో ఆరు ప్రధానమైన ముఠాలను డి ఆర్ ఐ అధికారులు పట్టుకున్నారు. హైదరాబాదు శివారు ప్రాంతాల్లో డ్రగ్స్ తయారీ డెన్ పెట్టుకొని అందులో తయారు చేస్తున్న విషయాన్ని డైరెక్ట్ రెవెన్యూ అధికారులు బట్టబయలు చేశారు. హైదరాబాద్ డ్రగ్స్ తయారీకి డెన్ గా మారినట్లు గా మారినట్లు అధికారులు చెబుతున్నారు.

కెమికల్స్ సులువుగా…

ముఖ్యంగా శిధిలావస్థకు చేరిన ఫార్మా కంపెనీలను టార్గెట్ గా చేసుకొని తయారీ ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఈ ఫార్మా కంపెనీలను లీజ్ పద్ధతిలో తీసుకొని అక్కడ ఉన్న మిషనరీ తో డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కొన్ని సమయాల్లో డైరెక్ట్ గా తయారు చేసి ముంబై లాంటి ప్రదేశాలకు పంపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ఫార్మాస్యూటికల్ కంపెనీలు పెద్ద ఎత్తున ఉండడంతో కెమికల్స్ ఈజీగా దొరుకుతున్నాయి. అంతే కాకుండా చేసుకోవడం కూడా తేలికగానే ఉంటుంది. హైదరాబాద్ కి కెమికల్స్ ని విదేశాలనుంచి దిగుమతి చేసుకున్నప్పటికీ ఎక్కడా అనుమానం రాదు. ఎందుకంటే ఫార్మాస్యూటికల్ కంపెనీలు చిన్నచిన్న కంపెనీలతో టై అప్ లు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైనా సరే కెమికల్స్ ని దిగుమతి చేసుకున్నా కొనుగోలు చేసినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉండవు. దీనిని ఆసరాగా చేసుకుని హైదరాబాద్ ని డ్రగ్స్ తయారీ కేంద్రంగా చేసుకుని కేంద్రంగా తయారీ పెద్ద ఎత్తున చేస్తున్నారు. చిన్న చిన్న గదిలో పెద్ద ఎత్తున డ్రగ్స్ తయారు చేసే ముఠాలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

వందల కోట్ల విలువైన….

ఇదిలా ఉంటే ముంబై ముఠాలు హైదరాబాద్ ను టార్గెట్ చేసుకున్నాయి. హైదరాబాద్ లో ఈజీగా డ్రగ్స్ తయారీ కి కావలసిన ముడిసరుకు మొత్తం కూడా ఇక్కడే లభ్యమవుతుంది. దీనిని ఫార్మసిస్ట్, బయోకెమిస్ట్రీ తోటి ముడి సరుకును శుద్ధి చేయించి నేరుగా ముంబైకి తీసుకెళ్తున్నారు. అక్కడ అ ఇలాంటి డ్రగ్స్ తయారు చేస్తున్నారు. తిరిగి నేరుగా ఈ డ్రగ్స్ ను ఇండియా మొత్తానికి కూడా సరఫరా చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ముంబై లో పట్టుబడిన ఒక ముఠా ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లోని మూడు ముఠాలకు సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది . మొత్తానికి డ్రగ్స్ తయారీకి కావలసిన ప్రాసెస్ చేస్తున్న ముఠా లను ఇప్పటి వరకు అధికారులు పట్టుకున్నారు. ఈ ముఠా దగ్గర నుంచి దాదాపు రెండు వేల పైచిలుకు డ్రగ్స్ తయారీ ముడి సరుకు స్వాధీనపర్చుకున్నారు. ఇది బహిరంగ మార్కెట్ లో కోట్ల రూపాయల విలువ చేస్తుంది. శుద్ధి చేసిన తర్వాత అది వందల కోట్లకు వెళ్ళింది. ఒకసారి అది డ్రగ్స్ గా తయారయింది అంటే వేల కోట్లకు వెళ్తుంది. తయారీ అయిన డ్రగ్స్ ఎక్కడికి వెళ్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న. ముఖ్యంగా హైదరాబాద్ నగరం లో తయారైన డ్రగ్స్ చివరికి ఇంజనీరింగ్ వైద్య విద్యార్థుల తో పాటుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగులకు సరఫరా చేస్తున్నారు. ఇక దీనితో పాటుగా హైదరాబాద్ నగరంలో ఉన్న పబ్ లకు కూడా ఈ డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు గా అధికారులు చెబుతున్నారు.

ముఠా గుట్టురట్టు….

హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో మరో మాదకద్రవ్యాల తయారీ ముఠా గుట్టురట్టయింది. నిషేధిత మెపెడ్రోన్‌ చేతులు మారుతోందనే సమాచారంతో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు నిఘా ఉంచగా ఇద్దరు నిందితులు చిక్కారు. ఈ దందా వెనక రసాయనశాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందిన వేగి శ్రీనివాసరావు అనే పరిశోధకుడు ఉన్నట్లు తేలింది. అధికారులు అతడితోపాటు సరకు స్వాధీనం చేసుకునేందుకు ముంబయి నుంచి వచ్చిన మరో నిందితుడు అష్రాఫ్‌ను అరెస్ట్‌ చేశారు. వారిద్దరి నుంచి రూ.63.12 లక్షల విలువైన 3.156 కిలోల మెపెడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జీడిమెట్లలోని ఓ ప్రయోగశాలలో ఈ మాదకద్రవ్యాన్ని తయారు చేసి మరో ముఠాకు అప్పగిస్తుండగా పట్టుకున్నారు. ప్రయోగశాలపై దాడి చేయగా మరో రూ.12.4 లక్షల విలువైన 112 గ్రాముల మెపెడ్రోన్‌ నమూనాలు, మెపెడ్రోన్‌ తయారీకి వినియోగించే 219.5 కిలోల ముడిపదార్థాలు లభ్యమయ్యాయి. ‘డ్రోన్‌’, ‘మియావ్‌ మియావ్‌’ అనే మారుపేర్లతో పిలిచే ఈ మాదకద్రవ్యం ఎండీఎంఏ, అంపెటమైన్‌, కొకైన్‌ తరహాలో ప్రభావం చూపుతుందని, కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు డీఆర్‌ఐ అధికారులు గుర్తించారు.

సులభంగా సంపాదించేందుకు…..

అనకాపల్లి ప్రాంతానికి చెందిన వేగి శ్రీనివాసరావు గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ బయోటెక్‌ సంస్థలో బయోకెమిస్ట్‌గా పనిచేశాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఏడాదిన్నరగా డ్రగ్స్‌ తయారీ చేస్తున్నాడు. దీనికోసం జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ ఇంటిలోనే ప్రయోగశాలను ఏర్పాటు చేశాడు. అక్కడ ప్రతి నెల 10-15 కిలోల మెపెడ్రోన్‌ తయారుచేస్తూ.. కిలోకు రూ.3 లక్షల చొప్పున ముంబయిలోని ముఠాలకు విక్రయిస్తున్నట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో తేలింది. అక్కడ లభించిన సమాచారం ఆధారంగానే శ్రీనివాసరావును పట్టుకున్నారు. ముంబయి నుంచి సరకు కొనుగోలు చేసేందుకు వచ్చిన అష్రాఫ్‌పై నిఘా ఉంచి వెంబడించడంతో సరకు అందజేస్తూ శ్రీనివాసరావు చిక్కాడు. హైదరాబాద్ నగరంలో ఇబ్బడిముబ్బడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయి . దీనిని ఎప్పటికప్పుడు కట్టడి చేసేందుకు అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇతర దేశాలకు చెందిన వాళ్లతో పాటు డ్రగ్స్ కు అలవాటు పడిన కొంతమంది వ్యక్తులు వీటిని అమ్ముతున్నారు. ఇప్పటివరకు దాదాపు 200 మంది డ్రగ్స్ అమ్ముతుండగా అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇందులో కొంతమంది సినీ ప్రముఖులకు కూడా డ్రగ్స్ అమ్ముతూ దొరికారు.

Tags:    

Similar News