అందుకే ఆలీ అలా వద్దంది

ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు సినీనటుడు ఆలీ రాజకీయాల్లో నవ్వులు పండించారు. సినిమాలకు, టీవీషోలకు, రాజకీయాలకు తేడా తెలియనట్లు ఆలీ వ్యవహరించారు. ఎన్నికలకు ముందు ఆలీ ఏ [more]

Update: 2019-09-14 08:00 GMT

ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు సినీనటుడు ఆలీ రాజకీయాల్లో నవ్వులు పండించారు. సినిమాలకు, టీవీషోలకు, రాజకీయాలకు తేడా తెలియనట్లు ఆలీ వ్యవహరించారు. ఎన్నికలకు ముందు ఆలీ ఏ పార్టీలో చేరతారనేది అందరినీ కొద్ది కాలం సస్పెన్స్ లో ఉంచారు. చివరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆలీ వంటి వారి విషయంలో వైసీపీ అధినేత జగన్ జాగ్రత్త పడుతున్నారంటున్నారు. కమిట్ మెంట్ లేకుండా కామెడీగా వ్యవహరించేవారికి రాజకీయాల్లో ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయో ఆలీని చూసి నేర్చుకోవాల్సిందే.

ఎన్నికలకు ముందు….

రాజమండ్రికి చెందిన ఆలీ సినీనటుడు,కామెడీ యాక్టర్ గా అందరికీ సుపరిచితమే. ఆయన కూడా రాజకీయాల్లోకి రావాలని తహతహలాడారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ప్రచారంలో పాల్గొన్నారు. 2009 ఎన్నికలలో ఆలీ ప్రజారాజ్యం పార్టీకి మద్దతుగా నిలిచారు. తిరిగి 2014 ఎన్నికలకు వచ్చేసరికి రాజకీయాల జోలికి రాలేదు. అయితే 2019 ఎన్నికలకు ముందు ఆయన దాదాపు అన్ని పార్టీల గడపలు తొక్కారు. తొలుత ఆలీ జనసేనలో చేరతారని అందరూ భావించారు. పవన్ కల్యాణ్ తో ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో సుదీర్ఘ అనుభవం ఉండటం,ఇద్దరూ కలసి అనేక సినిమాల్లో నటించడంతో ఆలీ ఖచ్చితంగా పవన్ కల్యాణ్ వైపే నిలుస్తారనుకున్నారు.

బాబును కలిసి….

అయితే ఆలీ ఉన్నట్లుండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు. టీడీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. ఆలీకి గుంటూరు తూర్పు నియోజకవర్గం టిక్కెట్ ఖరారయిందని కూడా ప్రచారం జరిగింది. తొలి నుంచి ఆలీ టీడీపీ సానుభూతిపరుడిగా ఉండటంతో ఆయన టీడీపీలో చేరతారని అందరూ భావించారు. కానీ ఆలీ టీడీపీలో చేరలేదు. చివరకు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు జగన్ సమక్షంలో ఆలీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి భరత్ నామినేషన్ కు కూడా హాజరయ్యారు.

ప్రాధాన్యత దక్కకపోవడంతో….

వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ ఆలీ తనకు పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం లేదని మదనపడుతున్నారట. తోటి నటుడు పృధ్వీని ఎస్వీబీసీ ఛైర్మన్ గా చేయడం కూడా ఆలీకి రుచించడం లేదట. అయితే ఆలీ అన్ని కుప్పిగంతులు వేయడం వల్లనే జగన్ పార్టీ దూరంగా పెట్టిందన్న టాక్ ఇన్నర్ సర్కిళ్లలో విన్పిస్తుంది. జగన్ అపాయింట్ మెంట్ కూడా ఆలీకి దొరరకడం లేదని చెబుతున్నారు. ఆలీ ఎన్నికలకు ముందు వేసిన తప్పటడుగులే ఆయనకు రాజకీయంగా ఈ పరిస్థితులు తీసుకొచ్చాయన్నది వాస్తవం. మరి ఆలీ నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండనున్న వైసీపీ వెంట నడుస్తారా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News