ఈయన ఏమయ్యారు.. వాయిస్ ఏదీ?

ఆయనకు 2014 ఎన్నికలకు ముందు వరకూ రాజకీయాలతో సంబంధంలేదు. కాకుంటే తెలుగుదేశం పార్టీ బ్యాక్ ఆఫీస్ కు సలహాలు ఇచ్చేవారు. ఆర్థిక అంశాలపైనా టీడీపీ అధినేత చంద్రబాబు [more]

Update: 2020-08-22 05:00 GMT

ఆయనకు 2014 ఎన్నికలకు ముందు వరకూ రాజకీయాలతో సంబంధంలేదు. కాకుంటే తెలుగుదేశం పార్టీ బ్యాక్ ఆఫీస్ కు సలహాలు ఇచ్చేవారు. ఆర్థిక అంశాలపైనా టీడీపీ అధినేత చంద్రబాబు పిలిచినప్పుడు వెళ్లి బ్రీఫ్ చేసేవారు. పార్టీకోసం ఆయన సేవలను ఉపయోగించుకున్న చంద్రబాబు 2014 లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రాగానే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు మంచి పదవే ఇచ్చారు. ఆయనే చెరుకూరి కుటుంబరావు. ఆర్థిక సంఘం నిపుణుగా మంచిపేరుంది.

ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా….

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకూరి కుటుంబరావుకు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. కేబినెట్ ర్యాంకు ఉన్న ఈ పదవిలో చెరుకూరి కుటుంబరావు 2019 ఎన్నికల వరకూ కొనసాగారు. అప్పట్లో కీలకమైన ఆర్థిక అంశాలపై కుటుంబరావు మాత్రమే వివరణ ఇచ్చారు. ఆర్థిక అంశాలతో పాటు రాజధాని, పోలవరం ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం తీరుపై కూడా కుటుంబరావు విమర్శలు చేసేవారు. మంత్రుల కంటే కుటుంబరావే ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చేందుకు ముందు ఉండేవారు.

ఛార్టెట్ అకౌంట్ గా….

అమరావతి బాండ్ల జారీ విషయం కుటుంబరావు ఆలోచనలోనే పుట్టిందంటారు. అందుకే చంద్రబాబు ఆయనను అంత దగ్గరకు తీసుకున్నారు. ప్రతి ముఖ్యమైన సమావేశంలోనూ కుటుంబరావు పాల్గొనేవారు. అమరావతి బాండ్ల జారీ విషయంలోనూ ఆయన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో అప్పట్లో బహరింగ చర్చకు సిద్ధమయ్యారు. కుటుంబరావు స్వతహాగా ఛార్టెట్ అకౌంట్. న్యాయవిద్యను కూడా అభ్యసించారు.

ఇప్పుడేమయింది?

అయితే పార్టీకి తల్లో నాలుకగా వ్యవహరించిన కుటుంబరావు పార్టీ అధికారం కోల్పోయిన కొన్నాళ్లు యాక్టివ్ గానే ఉన్నారు. అమరావతి విషయంలో స్పందించారు. కానీ గత ఎనిమిది నెలలుగా కుటుంబరావు యాక్టివిటీకి దూరంగా ఉంటున్నారు. రాజధాని అమరావతి మార్చడంపై కూడా ఆయన స్పందించడంలేదు. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ భానునగర్ లో కుటుంబరావు ఫ్యామిలీకి చెందిన 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై న్యాయస్థానంలో వివాదం నడుస్తుంది. కుటుంబరావు యాక్టివ్ గా లేరని చెబుతారు.

Tags:    

Similar News