అన్నయ్య అయినా వదలరట… ?

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని ఒక సామెత ఉంది. అది నిజమే. ఎందుకంటే ఎవరి దారులు వారివి అయ్యాక ఎవరి విజన్ వారికి ఉన్నాక రూట్లు [more]

Update: 2021-06-26 14:30 GMT

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని ఒక సామెత ఉంది. అది నిజమే. ఎందుకంటే ఎవరి దారులు వారివి అయ్యాక ఎవరి విజన్ వారికి ఉన్నాక రూట్లు కూడా సెపరేట్లు అవుతాయి. మెగా బ్రదర్స్ విషయంలో ఇపుడు అదే జరుగుతోందా అన్న అనుమానాలు అయితే ఉన్నాయి. రాజకీయాల్లో కొంత కాలం ఉన్న చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం ముగిసాక సినిమాలకే పరిమితం అయ్యారు. అయితే ఆయన గురించి రాజకీయ వర్గాల్లో ఎపుడూ ఒక ప్రత్యేక అటెన్షన్ ఉంటుంది. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తారు అన్న మాట కూడా వినిపిస్తూనే ఉంటుంది. దాన్ని గట్టిగా చిరంజీవి కొట్టి పారేయకపోవడం కూడా ఈ రకమైన అనుమానాలకు తావు ఇస్తోంది.

జగన్ తో అలా ….

రాజకీయాల్లో జగన్ పవన్ బద్ధ శత్రువులు మాదిరిగా ఉంటారు. ఇద్దరూ అసలు ఎపుడూ కలుసుకోలేదు కూడా. అదే చిరంజీవి విషయానికి వతే జగన్ తో చాలా కాలంగా పరిచయం ఉంది. జగన్ సొంత మీడియా సాక్షి ప్రారంభోత్సవానికి చిరంజీవి వచ్చారు. ఆ తరువాత కూడా ఇద్దరు పలు ప్రైవేట్ ఫంక్షన్లలో కలుసుకుని ముచ్చటించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక జగన్ సీఎం అయ్యాక ఏకంగా తాడేపల్లిలోని ఆయన ఇంటికి వచ్చి మరీ చిరంజీవి దంపతులు విందారగించారు. ఇక జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన‌ను జనసేన అధినేతగా పవన్ వ్యతిరేకిస్తే చిరంజీవి బాహాటంగా మద్దతు ఇచ్చారు. అలాగే అనేక విషయాల్లో ఆయన జగన్ గురించి పాజిటివ్ గానే మాట్లాడుతూ వస్తున్నారు. తాజాగా ఏపీలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింతే దాన్ని కూడా చిరంజీవి అభినందించారు.

స్పూర్తి దాయకమేనా …?

జగన్ ది స్పూర్తిదాయకమైన నాయకత్వం అని చిరంజీవి అంటున్నారు. అదే సమయంలో జగన్ ఏలుబడిలో ఏపీ జనం సంతోషంగా లేరని పవన్ అంటున్నారు. పవన్ వచ్చే ఎన్నికల్లో జగన్ ని మరోసారి సీఎం కాకుండా చేయాల్సినదంతా చేస్తారు అంటున్నారు. అవసరం అయితే చంద్రబాబుతో మళ్లీ చేతులు కలుపుతారు అని కూడా అంటున్నారు. ఈ సమయంలో జగన్ కి ఏపీ నిండా రాజకీయ శత్రువులే ఉన్నారు. ఈ వేడిలో చల్లని నీడలా చిరంజీవి మాటలు జగన్ కి ఎనలేని ఆనందాన్ని కలిగిస్తూంటే పవన్ కి మాత్రం భరించరానివిగా ఉన్నాయని అంటున్నారు. నిజానికి చిరంజీవికి రాజకీయాలు పట్టవు. ఆయన బోళాగా ఉన్నది మాట్లాడేస్తూంటారు. కానీ అది పవన్ రాజకీయానికి ఇబ్బందిగా మారుతోంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటు ఇస్తుంది అని ప్రచారమైతే ఉంది. దాని మీద కూడా ఎక్కడో డౌట్లు జనసైనికులకు కొడుతున్నాయట.

భారీ ట్రోలింగ్…..

చిరంజీవి రాజకీయాల‌లో లేడు. కానీ సినీ లోకాన మెగాస్టార్, పైగా పవన్ కి పెద్దన్నయ్య. ఆయన వల్లనే పవన్ ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారని చెప్పాలి. అలాంటి చిరంజీవి వ్యాక్సినేషన్ విషయంలో మెచ్చుకుని ఒక మంచి మాట అంటే జనసైనికులు యమ సీరియస్ గానే తీసుకున్నారుట. ఏకంగా చిరంజీవినే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మరి పవన్ మీద ఫ్యాన్స్ వీర భక్తి అలాంటిది. అన్నయ్య అయినా వదలమని చెప్పేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మరో అన్న నాగబాబు కూడా ఈ మధ్యన పవన్ పార్టీ పేరు చెప్పలేక మీడియాలో అడ్డంగా దొరికేశారు. దాని మీద ప్రత్యర్ధి పార్టీలు ట్రోల్ చేస్తూంటే జనసైనికులకు మండుతోందిట. ఇద్దరు అన్నలూ ఇలా చేయడమేంటని వారు గుస్సా అవుతున్నారుట. మొత్తానికి తమ్ముడు ఎక్కడైనా కానీ రాజకీయాల్లో కాదు అన్నట్లుగానే మెగా బ్రదర్స్ ఆలోచనలు ఉన్నాయేమో.

Tags:    

Similar News