సై రా నరసింహారెడ్డి మూవీ రివ్యూ 3

బ్యాన‌ర్‌: కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ న‌టీన‌టులు: చిరంజీవి, నయనతార, అమితాబ‌చ్చన్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, బ్రహ్మానందం, త‌మ‌న్నా, నిహారిక, బ్రహ్మాజీ, పృథ్వి, అనుష్క(గెస్ట్ రోల్) త‌దిత‌రులు [more]

Update: 2019-10-02 07:01 GMT

బ్యాన‌ర్‌: కొణిదెల ప్రొడ‌క్షన్ కంపెనీ
న‌టీన‌టులు: చిరంజీవి, నయనతార, అమితాబ‌చ్చన్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి, సుదీప్‌, బ్రహ్మానందం, త‌మ‌న్నా, నిహారిక, బ్రహ్మాజీ, పృథ్వి, అనుష్క(గెస్ట్ రోల్) త‌దిత‌రులు
ఎడిటింగ్‌: ఏ.శ్రీక‌ర ప్ర‌సాద్‌
వాయిస్ ఓవర్: పవన్ కళ్యాణ్ (తెలుగు), కమల్(తమిళ్) మోహన్ లాల్ (మలయాళం)
సినిమాటోగ్రఫీ: ఆర్‌.ర‌త్నవేలు
మాటలు: సాయి మాధ‌వ్ బుర్రా
మ్యూజిక్‌: అమిత్ త్రివేది
ర‌చ‌న‌: ప‌రుచూరి బ్రద‌ర్స్‌
నిర్మాత్‌: రామ్‌చ‌ర‌ణ్ కొణిదెల‌
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: సురేంద‌ర్‌రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే మెగా ఫాన్స్ కి పూనకలొచ్చేస్తాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరు సినిమా అంటే మెగా ఫాన్స్ కి మాత్రమే కాదు… సాధారణ ప్రేక్షకుడికి ఇంట్రెస్ట్ కలిగించేస్తుంది. కారణం.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని సై రా నరసింహారెడ్డి గా తెరకెక్కించడమే. బ్రిటిష్ దొరల దురాగత పాలనకు వ్యతిరేకంగా విప్లవాలను లేవదీసి స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధులు ఎంతో మంది ఉన్నారు. కానీ.. గాంధీ, నెహ్రూ, నేతాజి గురించి తెలిసినంతగా ఆ పోరాట యోధుల గురించి పెద్దగా ఎవ్వరికీ తెలీదు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం అలనాడు జరిగిన పోరాటంలో ఎందరో ధీరులు ప్రాణాలర్పించారు. కానీ, వారంతా చరిత్రలో మిగిలిపోయారంతే. అలా చరిత్రలో ఒకడిగా కనుమరుగైన పోరాట యోధుడి కథే ఈ సై రా నరసింహారెడ్డి. అసలు బ్రిటిషర్లపై కత్తెత్తిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని చెబుతున్నారు. రాయలసీమలోని కర్నూలు ప్రాంతానికి చెందిన నరసింహారెడ్డి.. బ్రిటిష్ పాలకుల వంచనను భరించలేక, తన ప్రజల కోసం విప్లవాన్ని లేవదీశారు… అదే చరిత్రని ఆధారం చేసుకుని కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో… మెగా హీరో రామ్ చరణ్ భారీ పెట్టుబడితో ఈ సైరా నరసింహ రెడ్డి సినిమాని తెరకెక్కించారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, అమితాబచ్చన్, సుదీప్, జగపతి బాబు లాంటి పలు భాష నటించడం, ట్రైలర్, టీజర్ అద్భుతంగా ఉండడంతో… సై రా పై విపరీతమైన ఆసక్తి క్రియేట్ అయ్యింది. అలాగే సై రా ట్రైలర్ లో సినిమా లోని పాత్రలు తీరుతెన్నులు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సై రా సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని మెగా ఫాన్స్ తో అపాటుగా ప్రేక్షకులు కాచుకుని కూర్చున్నారు. మరి ఎప్పుడు ఫైట్స్, డాన్స్ లతో కమర్షియల్ హంగులతో అలరించే మెగాస్టార్ చిరు.. మొదటిసారి ఇలాంటి చరిత్ర ఉన్న సినిమా తియ్యడం తో సినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక సినిమా విడుదలకు ముందు ఉయ్యాలవాడ ఫ్యామిలీతో సై రా సినిమాకి చిన్న చిన్న డిస్ట్రబెన్సెస్ వచ్చినప్పటికీ…. వాటిని నిర్మాత రామ్ చరణ్ చాకచక్యంగా సాల్వ్ చేసి.. సక్సెస్ ఫుల్ గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. మరి ఈ సినిమాతో సురేందర్ రెడ్డి, రామ్ చరణ్, చిరంజీవి లు ఇండియా వైడ్ గా పాగా వెయ్యాలని వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యిందా? ఈసినిమాతో వారంతా ఎలాంటి హిట్ అందుకున్నారు సమీక్షలో చూసేద్దాం.

కథ:

61 మంది పాలెగాళ్ళు దత్తమండలాలతో కొద్దిన రేనాడు ప్రాంతాన్ని చిన్న చిన్న సంస్థానాలుగా ఏర్పాటు చేసుకుని పరిపాలన సాగించినా ఎవరి మధ్యన సఖ్యత మాత్రం ఉండదు. ఒకరంటే ఒకరికి పడదు. బ్రిటిష్ వారు పన్నులు కట్టించుకుంటుంటే… రేనాడును పాలించే పాలెగాళ్లకు మాత్రం స్వతంత్రత అనేది ఉండకుండా పోతుంది. ఆ క్రమంలోనే రేనాడుని ఆక్రమించుకోవాలని బ్రిటిష్ వారు ప్రయత్నిస్తారు. అయితే పాలెగాళ్ళలో ఒకడైన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి దేశ స్వాతంత్య్రం కోసం వారికి ఎదురు తిరుగుతాడు. వారిని ఎదిరించే క్రమంలో అవుకు రాజు(సుదీప్), రాజ పాండి(విజయ్ సేతుపతి), వీరా రెడ్డి(జగపతి బాబు)లు ఉయ్యాలవాడకి తోడవుతారు. మరి సఖ్యత లేని 60 మంది పాలెగాళ్లను ఉయ్యాలవాడ ఒకతాటిపైకి ఎలా తెచ్చారు? బ్రిటిష్ వారిని పారద్రోలడానికి నరసింహా రెడ్డి ఎదుర్కొన్న సమస్యలేమిటి? అవుకు రాజు, రాజ పాండి, వీరా రెడ్డి లు ఉయ్యాలవాడకి చేసిన సహాయం ఏమిటి? నరసింహారెడ్డి పోరాటంతో ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష కలిగిందా? అనేది సై రా నరసింహారెడ్డి సినిమా చూస్తేనే తెలుస్తుంది.

నటీనటుల నటన:

చిరంజీవి 150 చిత్రాల అనుభవం మనకు సై రా నరసింహారెడ్డిలో కనబడుతుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సై రా లుక్ లో చిరు ఆహార్యం, నటన, లుక్స్ అన్ని హైలెట్ అనేలా ఉన్నాయి. ఆరు పదులు వయసు వచ్చినా సరే అంత ఎనర్జిటిక్ గా పలికించిన డైలాగ్స్ కానీ… చిరు చేసిన పోరాట సన్నివేశాలు కానీ సినిమాకే హైలెట్ అనేలా ఉన్నాయి. చిరు అభిమానులకు కావాల్సినవన్నీ ఈ సినిమాలో వారికీ పుష్కలంగా అకనబడతాయి. కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. స్వాతంత్య్ర సమరయోధుడిగా.. చిరు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్పారో ఈ సినిమా చూసి ప్రతీ ఒక్కరికి అర్ధం అవుతుంది. నరసింహారెడ్డి పాత్రలో చిరుని తప్ప మరొకరిని ఊహించుకోలేము అన్న రీతిలో ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అద్భుతమనే చెప్పాలి. కన్నడ హీరో కిచ్చ సుదీప్ తనదైన నటనతో ఆకట్టుకుంటారు. నరసింహారెడ్డి అంటే అసూయా కలిగిన రాజుగా సుదీప్ నటన సూపర్.అలాగే బ్రిటిష్ వారిపై నరసింహారెడ్డి పోరాటం చేసే సమయంలో… అవుకురాజుగా నరసింహారెడ్డికి సహకరించడం బావుంది. అలాగే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటన కోసం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. గోసాయి వెంకన్నగా నరసింహా రెడ్డి గురువు పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ పర్ఫెక్ట్ గా సెట్టయ్యారు. నరసింహారెడ్డికి విద్యలు నేర్పి, పోయారట స్ఫూర్తిని కలిగించే గురువుగా అమితాబ్ నటన అదుర్స్. నరసింహారెడ్డి భార్య సిద్దమ్మగా నయనతార లుక్స్, ఆమె పాత్ర తీరుతెన్నులు కూడా ఆకట్టుకున్నాయి. అలాగే మెగాస్టార్ మరియు నయనతారల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే నయన్ అద్భుత నటన కనబర్చింది. నరసింహారెడ్డి ప్రియురాలిగా మరో హీరోయిన్ తమన్నా లక్ష్మి పాత్రలో చెలరేగిపోయింది. అంతే కాకుండా చిన్న పాత్ర అయినా సరే మెగా హీరోయిన్ నిహారిక మంచి నటన కనబర్చింది. వీర రెడ్డి పాత్ర విలక్షణ నటుడు జగపతిబాబు కెరీర్ లో మరో మంచి పాత్ర చేరింది. నరసింహారెడ్డికి వెన్నుపోటు పొడిచే పాత్ర వీర రెడ్డి ది. మిగతా నటులంతా తమ పరిధిమేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

కమర్షియల్ దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక చరిత్రతో కూడిన కథని సినిమాగా హ్యాండిల్ చెయ్యడం సులభం కాదనుకున్నారు. కానీ సురేందర్ రెడ్డి సై రా సినిమా మొదలయ్యేటప్పుడే…. సై రా నరసింహారెడ్డి గురించి ఉయ్యాలవాడ కుటింబీకులను కలిసి ఆయన చరిత్రని తెలుసుకునే… సినిమాలోకి దిగాడు. అయితే సురేందర్ రెడ్డి సై రా సినిమాని ఒక అద్భుతంలా తెరకెక్కించాడు అనే చెప్పాలి.ప్రతీ పాత్రకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఎవరిని తక్కువ చెయ్యకుండా చాలా జాగ్రత్త వహించి తెరకెక్కించిన తీరుకు హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఇక సినిమా లోకి వెళితే… ఝాన్సీ పై బ్రిటిష్ వారు దాడి చెయ్యడంతో.. సినిమా ప్రారంభమవుతుంది. అయితే అంతకుముందే… ఆంగ్లేయులను నరసింహారెడ్డి గడగడలాడించాడని.. లక్ష్మి భాయి తన సైన్యానికి వివరించడంతో సై రా కథ మొదలవుతుంది. రేనాడు లో పన్నులు కట్టని ప్రజలను బ్రిటిష్ వారు హింసించడం,తో అలా నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు దర్శకుడు.అయితే ఫస్ట్ హాఫ్ కథనం అక్కడక్కడా కాస్త నెమ్మదిగా మొదలవుతున్నట్టు అనిపించినా… ఇంటర్వెల్ కు వచ్చేసరికి మెగాస్టార్ కు ఎలాంటి ఎలివేషన్లు ఇస్తే మాస్ ఆడియన్స్ మరింతగా కనెక్ట్ అవుతారో లాంటివి బాగా క్యారీ చేసారు.ముఖ్యంగా ఎమోషన్స్ ను బహ చూపించారు. మొదటినుండి చెప్పినట్టుగా ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చేసరికి ఆ పోరాట సన్నివేశాలు ఒళ్ళు గగురుపొడుస్తుంది. దానితో ప్రేక్షకుల్లకు సెకండ్ హాఫ్ మీద బాగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ప్రేక్షకుడి కి ఇంట్రెస్ట్ ఆకలిగేలా.. సెకండ్ హాఫ్ ని మలిచాడు సురేందర్ రెడ్డి. కథ కథనంలో వేగం పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో కథ మరింత రసకందాయంలో పెరుగుతుంది. కతలో నాటకీయత కూడా మొదలవుతుంది. అయితే ఇక్కడే కథకు కమర్షియల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. చిరు లోని మాస్ ఇమేజ్ ని, స్టార్ట్ డాం ని దృష్టిలో పెట్టుకుని… ఆయా సన్నివేశాలను రాసుకున్నాడు. సురేందర్ రెడ్డి. ఇక వీర రెడ్డి, బసిరెడ్డి పత్రాలు సై రా నరసింహారెడ్డికి సహకరిస్తున్నాయా? వెన్నుపోటు పొడుస్తున్నాయా? అనే విషయంలో ప్రేక్షకుడు తీవ్ర ఉత్కంఠకు గురవుతాడు. సెకండ్ హాఫ్ లో ఉన్న యాక్షన్ సీన్స్ కి ప్రేక్షకుడు ఫీలఅవడం ఖాయం. అభిమానులకైతే పండగే. కాకపోతే చిన్నదైనా సై రా సైన్యం పది వేల మంది బ్రిటిష్ సైన్యాన్ని మట్టుబెట్టడం అనేది కాస్త లాజిక్ కి దూరంగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ లో ఎమోషన్ గా భావోద్వేగాలు జోడించి.. కథ విషాదాంతంగా ముగించారని అనిపించకుండా దర్శకుడు తీసుకున్న జాగ్రత్త బావుంది. ఓవరాల్ గా సై రా నరసింహారెడ్డి మెగా ఫాన్స్ కి అభూతంగా ఉంటుంది.. సాధారణ ప్రేక్షకుడికి యావరేజ్ గా అనిపిస్తుంది.

సాంకేతికంగా…

ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అమిత్ త్రివేది… ఒక పాటకు ఎప్పటికి గుర్తుండిపోయే అదిరిపోయే సంగీతం ఇచ్చాడు. కానీ మిగతా పాటలు పర్వాలేదనిపిసిస్తాయి. కానీ జూలియస్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి ప్రాణం పోసింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో నేపధ్య సంగీతం అద్భుతమని చెప్పాలి. అంతేకాకుండా ప్రతి సన్నివేశంలో బ్యాగ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలవడమే కాదు.. ప్రేక్షకుడ్ని సినిమాలో లీనం చేసేలా ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ కి ముందు, క్లైమాక్స్ లో నేపధ్య సంగీతం హైలెట్ అనేలా ఉంది. ఇలా చారిత్రాత్మక సినిమాలకు సినిమాటోగ్రఫీ కి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. సెట్స్ ని నేచురల్గా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ కష్టపడాలి. సై రా కి రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా అద్భుతమైన కెమెరా పని తనం కనబడింది. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు. దర్శకుడు ఊహకు తగినట్టుగా… కెమెరా పనితనం ఉంది. ఎడిటర్ శ్రీక‌ర ప్ర‌సాద్‌ ఎడిటింగ్ బావున్నప్పటికీ.. ఫస్ట్ హాఫ్ లో ట్రిమ్ చెయ్యాల్సిన సన్నివేశాలు ఇంకా ఉన్నాయి. ఇక రామ్ చరణ్ సినిమాకి హై క్వాలిటీ నిర్మాణ విలువలు ఇచ్చాడు కాబట్టే.. ప్లస్ పాయింట్స్ లో నిర్మాణ విలువలు చర్చకు వచ్చాయి.

ప్లస్ పాయింట్స్: చిరు లుక్స్, నటన, కథనం, ఇంటర్వెల్ బ్యాంగ్, నటీనటులు పాత్రలు, నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్: ఫస్ట్ హాఫ్, కథ తెలిసిపోవడం, ఫస్ట్ హాఫ్ క్లో నేరేషన్, కమర్షియల్ ఇలెవెన్త్స్ లేకపోవడం

రేటింగ్: 2.75/5

Tags:    

Similar News