తమ్ముడి కోసం అన్న దిగుతున్నాడా ?

అన్ని బంధాల కంటే అన్నదమ్ముల బంధం గట్టిది. నీటి కంటే రక్తం చిక్కనైనది అంటారు. ఇక తన అన్నతో వేరుపడి రాజకీయ పార్టీ పెట్టాను అని జనసేన [more]

Update: 2021-03-23 13:30 GMT

అన్ని బంధాల కంటే అన్నదమ్ముల బంధం గట్టిది. నీటి కంటే రక్తం చిక్కనైనది అంటారు. ఇక తన అన్నతో వేరుపడి రాజకీయ పార్టీ పెట్టాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినా కూడా జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే చిరంజీవి. పవన్ కల్యాణ‌్ వేరు కాదు అన్నది జనాల్లో గాఢమైన నమ్మకం. ఇక పవన్ కల్యాణ‌్ తిరిగి సినిమాల్లో నటిస్తున్నా, తన రాజకీయ ఒరవడిని మార్చుకున్నా దాని వెనక అన్నగా, అనుభవం ఉన్న పెద్దగా చిరంజీవి గైడెన్స్ ఉందని కూడా అంతా చెబుతారు.

సడెన్ డెసిషన్….

ఇక విశాఖ ఉక్కు కార్మాగారం ప్రైవేట్ పరం అవడం ఖాయమని కేంద్రం గట్టిగానే చెప్పేసింది. దాంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఏమీ అనలేక పోతోంది. పవన్ కళ్యాణ్ మొత్తానికి పొలిటికల్ ఫీల్డ్ లోకే రాలేకపోతున్నారు. సరిగ్గా ఈ సమయంలో మెగా ఫ్యామిలీ పెద్ద అయినా చిరంజీవి ఒక భారీ ప్రకటన చేశారు. విశాఖ ఉక్కు పోరాటానికి తన పూర్తి మద్దతు ఇచ్చారు. తాను విద్యార్ధి దశలో ఉన్నపుడే ఉక్కు పోరాటంలో పాలు పంచుకున్నానని కూడా చెప్పుకున్నారు. అవసరం అయితే ప్రత్యక్ష పోరాటానికి తాను సిద్ధమని కూడా ఆయన ప్రకటించారు.

బూస్ట్ లాంటిదే….

జనసేనకు ఇపుడు పెద్ద చిక్కు వచ్చిపడింది. విశాఖలో ఆ పార్టీకి బలం ఉంది అనుకుంటే అక్కడే కేంద్రం ఉక్కు మంటలు పెట్టింది. ఇప్పుడున్న స్థితిలో బీజేపీతో బంధం తెంచుకోలేరు. అలాగని మోడీ నిర్ణయాన్ని వ్యతిరేకించి బాహాటంగా ఉద్యమానికి మద్దతు ఇవ్వలేరు. దాంతో సతమతమవుతున్న జనసైనికులకు చిరంజీవి మెగా ప్రకటన భారీ ఊరటనే ఇచ్చిందని అంటున్నారు. మిగిలిన పార్టీలు ఉక్కు పోరాటంలో దూసుకుపోతూంటే జనసైనికులు ఒక దశ దిశ లేకుండా ఉన్నారు. ఇపుడు మెగాస్టార్ రెడీ అంటూంటే వారు కూడా సై అంటున్నారు.

ప్లస్ అవుతుందా …?

కేంద్రం ఏ విధంగా చూసినా ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గదు అని అంటున్నారు. మరి ఆ సమయంలో పోరాటం అయినా చేస్తే ఉక్కు కార్మక వర్గాలతో పాటు, జనాల్లో మంచి అయినా మిగులుతుంది. కానీ జనసేన పొత్తు కారణంగా నేరుగా ఆ పని చేయలేదు. కాబట్టి చిరంజీవి ఫీల్డ్ లోకి దిగారని అంటున్నారు. ఆయన ఉక్కు పోరాటానికి సినీ ప్రముఖుడిగా మద్దతు ఇచ్చినా రేపటి రోజునా మెగా బ్రదర్ గా జన‌సేన బీజేపీ కూటమి విజయానికి కూడా తన వంతుగా కృషి చేస్తారని అంటున్నారు. అపుడు ఉక్కు పోరాటానికి మద్దతు ఇచ్చిన చిరంజీవి వెనక ఉంటే కచ్చితంగా ఆ వర్గం ఓట్లు ఎటూ పోకుండా ఉంటాయని అంటున్నారు. ఇలా తెర వెనక ఎత్తుగడలతోనే చిరంజీవి సడెన్ గా ఉక్కుకు మద్దతు అంటూ సౌండ్ ఇచ్చారని అంటున్నారు. చిరంజీవి నిర్ణయం పట్ల రాజకీయాలకు అతీతంగా ఓ వైపు మద్దతు వస్తున్నా కూడా కొందరు మాత్రం ప్రత్యేక హోదా విషయంలో నాడు చిరంజీవి గొంతు ఎందుకు విప్పలేదు అన్న ప్రశ్నను కూడా సంధిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసమేనా నినాదాలు అన్న కామెంట్స్ కూడా పడుతున్నాయి. ఏది ఏమైనా కూడా మెగా రాజకీయల్లో భాగంగానే చిరంజీవి ప్రకటనను చూడాలని అన్న వారూ ఉన్నారు.

Tags:    

Similar News