చిరంజీవికి లక్కీ చాన్స్?

అదేంటో రాజకీయాలు వద్దు అంటున్నా కూడా చిరంజీవిని అవి వదిలేలా కనిపించడంలేదు. చిరంజీవి బుద్ధిగా ఇపుడు సినిమాలు చేసుకుంటున్నారు. పైగా ఒక సినిమా ఫంక్షలో ఆయన రాజకీయాలు [more]

Update: 2020-02-13 06:30 GMT

అదేంటో రాజకీయాలు వద్దు అంటున్నా కూడా చిరంజీవిని అవి వదిలేలా కనిపించడంలేదు. చిరంజీవి బుద్ధిగా ఇపుడు సినిమాలు చేసుకుంటున్నారు. పైగా ఒక సినిమా ఫంక్షలో ఆయన రాజకీయాలు మిత్రులను విడదీస్తాయి. సినిమాలు కలుపుతాయి అంటూ పాలిటిక్స్ పైన సెటైర్లు వేశారు. సరే అవన్నీ పెద్ద సీరియస్ గా తీసుకోకపోయినా చిరంజీవికి మాత్రం రాజకీయాల పట్ల ఆసక్తి లేదని అంతా అంటారు. అయితే అవకాశం, అదృష్టం తలుపు కొడుతూంటే ఎవరూ వద్దనరు కదా. చిరంజీవి కూడా అంతే మరి.

జగన్ ప్రేమ…..

మెగాస్టార్ చిరంజీవి మీద జగన్ కి ప్రేమ ఎక్కువగా ఉంది. ఆయన చిరంజీవి పెద్దాయనగా గౌరవిస్తారు. తండ్రి వైఎస్సార్ సీఎంగా ఉన్నపుడు సాక్షి ప్రారంభానికి చిరుని పిలిచి జగన్ సమాదరించారు. ఆ తరువాత రాజకీయంగా ఇద్దరి దారులు వేరు అయినా ఏనాడూ జగన్ చిరంజీవి మీద మాట తూలలేదు. ఇక జగన్ సీఎం అయ్యాక ఆయన ఇంటికి వచ్చిన చిరంజీవికి చేసిన మర్యాదను అంతా చూశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే చిరంజీవిని రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ కమ్మని జగన్ కోరినట్లుగా వార్తలు అప్పట్లో వచ్చాయి. ఇక రాజ్యసభకు చిరంజీవిని పంపాలని జగన్ ఆలోచిస్తున్నారని కూడా ప్రచారం సాగుతోంది.

మోడీ క్యాబినెట్లో….

అన్నీ అనుకూలిస్తే చిరంజీవి మరోసారి కేంద్ర మంత్రి కాబోతారని ఢిల్లీ సర్కిళ్ళలో కొత్త న్యూస్ షికార్ చేస్తోంది. చిరంజీవిని రాజకీయంగా వాడుకోవాలని బీజేపీకి ఉంది. అయితే వారికి ఏపీలో బలం లేదు. దాంతో మిత్రుడిగా ఉన్న వైసీపీ ద్వారా రాజ్యసభకు చిరంజీవి వస్తే కేంద్ర మంత్రిని చేయడానికి మోడీ రెడీగా ఉన్నారట. నిజానికి చిరంజీవిని మళ్ళీ రాజకీయాల్లోకి తెస్తే ఆయన వైసీపీకి, బీజేపీకి పెద్ద అసెట్ అవుతారని రెండు పార్టీలూ భావిస్తున్నాయి.

కాపు కోసమేనా?

ఇక ఏపీలో విజయానికి గోదావరి జిల్లాలు ముఖ్యం. అక్కడ ఇప్పటికీ చిరంజీవికి ఆదరణ ఉంది. ఆయనని కేంద్ర మంత్రిగా చేయడం ద్వారా వైసీపీ సామాజిక పునాదులను గట్టిపరచుకోవాలని కూడా భావిస్తున్నారుట జగన్. ఇక చిరంజీవికి గతంలో నిర్వహించిన పర్యాటక శాఖ ఇస్తారని కూడా మరో ప్రచారం బయల్దేరింది. మొత్తానికి జగన్ ఢిల్లీ టూర్ కాదు కానీ సినీనటుడు చిరంజీవి దశ తిరగబోతోందని మాత్రం పుకార్లు జోరు చేస్తున్నాయి. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News