చిరాగ్ చించిదేంటి? పొడిచిందేంటి?

యువ కెరటమంటూ చిరాగ్ పాశ్వాన్ పై ఎన్నికలకు ముందు మీడియా ప్రశంసలు కురిపించింది. బీజేపీ చేతిలో పావుగా మారిన చిరాగ్ పాశ్వాన్ తన పార్టీని విజయపథం వైపు [more]

Update: 2020-11-11 17:30 GMT

యువ కెరటమంటూ చిరాగ్ పాశ్వాన్ పై ఎన్నికలకు ముందు మీడియా ప్రశంసలు కురిపించింది. బీజేపీ చేతిలో పావుగా మారిన చిరాగ్ పాశ్వాన్ తన పార్టీని విజయపథం వైపు నడిపించ లేకపోగా, కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. బీహార్ రాజకీయాల్లో ిచిరాగ్ పాశ్వాన్ కు భవిష్యత్ ఉందా? అన్న సందేహాలు తెచ్చేలా చేశారు. బీహార్ ఎన్నికలు ముగిసాయి. ఈ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతినింది ఎవరంటే ఖచ్చితంగా చిరాగ్ పాశ్వాన్ అని చెప్పక తప్పదు.

మోదీకి వీరభక్తుడిగా…..

ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాశ్వాన్ పార్టీ లోక్ జనశక్తి ఎన్నికలకు ముందు బయటకు వచ్చింది. చిరాగ్ పాశ్వాన్ ఎన్డీఏ నుంచి బయటకు రావడానికి నితీష్ కుమార్ కారణం. ఆయనను వ్యతిరేకించిన చిరాగ్ పాశ్వాన్ మోదీ పట్ల మాత్రం విపరీతమైన భక్తిశ్రద్ధలను చూపేవారు. తన ఎన్నికల ప్రచారంలో మోదీ ఫొటోను కూడా వాడారంటే చిరాగ్ పాశ్వాన్ వ్యూహం ఏంటో చెప్పకనే చెబుతుంది. బీజేపీ చేతిలో చిరాగ్ పాశ్వాన్ పావుగా మారారన్నది వాస్తవం.

జేడీయూ ఉన్న చోటే……

బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ తన పార్టీ అభ్యర్థులను 52 చోట్ల బరిలోకి దించారు. అదీ జేడీయూ పోటీ చేసే చోట మాత్రమే అభ్యర్థులను నిలిపారు. తన టార్గెట్ నితీష్ కుమార్ మాత్రమేనని, ఆయన కుర్చీ నుంచి దిగిపోవాలని చిరాగ్ పాశ్వాన్ ప్రచారంలో పదే పదే చెప్పారు. బీజేపీ అభ్యర్థులున్న చోట ఆయన పోటీకి దింపలేదు. దీంతో బీజేపీతో లోపాయికారీ ఒప్పందాన్ని చిరాగ్ పాశ్వాన్ కుదుర్చుకున్నారన్నది సుస్పష్టం.

ఒక్క సీటులో గెలిచి……

ఇంతకీ చిరాగ్ పాశ్వాన్ పార్టీ 52 చోట్ల పోటీ చేస్తే గెలిచింది ఒక్కచోట మాత్రమే. వామపక్షాలు, ఎంఐఎం కూడా అధిక స్థానాలను గెలవడం విశేషం. చిరాగ్ పాశ్వాన్ తాను గెలవకపోగా 18 చోట్ల ఆర్జేడీ, 16 చోట్ల జేడీయూను, ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ను దారుణంగా దెబ్బతీశారు. బీజేపీకి టూల్ గా పనిచేశారు. ఆయన కేంద్ర మంత్రి పదవి కోసమే లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇప్పుడు చిరాగ్ పాశ్వాన్ కోరుకున్నట్లు జరగలేదు. నితీష్ కుమార్ మరోసారి సీఎం అవుతున్నారు. ఇంతకీ చిరాగ్ పాశ్వాన్ ఏం సాధించినట్లు అని ప్రశ్నించుకుంటే.. శూన్యమనే చెప్పాలి.

Tags:    

Similar News