ఆ కుటుంబాన్ని కుదేలు చేశారుగా… పదవి ఇవ్వరా?

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. తమ సీనియారిటీని చూడమని కొందరు, దిగ్గజ కుటుంబాలను ఓడించామని మరికొందరు ముఖ్యమంత్రి జగన్ వద్ద అర్జీలు [more]

Update: 2021-07-01 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణపై చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. తమ సీనియారిటీని చూడమని కొందరు, దిగ్గజ కుటుంబాలను ఓడించామని మరికొందరు ముఖ్యమంత్రి జగన్ వద్ద అర్జీలు పెట్టుకుంటున్నారు. వారిలో పీలేరు నియోజకవర్గానికి చెందిన చింతల రామచంద్రారెడ్డి ఒకరు. పీలేరు నియోజకవర్గంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని దశాబ్దకాలంగా ఓడిస్తున్న తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఆయన కోరుతున్నారు.

నల్లారి కుటుంబానికి……

పీలేరు నియోజకవర్గం ఒకప్పుడు ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇటు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబాలకు పట్టు ఉండేది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నియోజకవర్గం నుంచి 1989, 1999. 2004 ఎన్నికలలో పీలేరు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అనంతరం ఆయన పుంగనూరుకు షిఫ్ట్ అయ్యారు. అలాగే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2009 ముందు వరకూ వాయల్పాడు నియోజకవర్గం నుంచి ఎన్నికవుతూ వస్తూ 2009 లో పీలేరు కు వచ్చి గెలుపొందారు.

దశాబ్దకాలం నుంచి….

అయితే అదే నల్లారి కుటుంబానికి ఆఖరి గెలుపు అయింది. 2014లో పీలేరు నుంచి చింతల రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పై గెలుపొందారు. అప్పడు ఆయన జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున పోటీ చేశారు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని చింతల రామచంద్రారెడ్డి మరోసారి ఓడించారు. దశాబ్దకాలంగా నల్లారి కుటుంబాన్ని పీలేరు నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు లేకుండా చేశారు.

అందుకే తనకు…..

నల్లారి కుటుంబానికి, ముఖ్యమంత్రి జగన్ కు మొదటి నుంచి పడదు. వైఎస్ మరణం తర్వాత జగన్ ను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకరు. అందుకే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. మరోసారి పీలేరులో విజయం సాధించి ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలన్నది చింతల రామచంద్రారెడ్డి డిమాండ్. ఈ మేరకు జగన్ ను కలసి తన గోడును చెప్పుకున్నట్లు తెలిసింది. కానీ అది చిత్తూరు జిల్లా కావడం, రెడ్డి సామాజికవర్గం కావడంతో చింతలకు మంత్రి పదవి రావడంపై డౌట్ గానే ఉంది.

Tags:    

Similar News