చింతా మోహ‌న్ వ్యూహం ఇదేనా…?

రాజ‌కీయాల్లో త‌క్షణ‌మే గుర్తింపు రావాలంటే.. సంచ‌ల‌న ప్రక‌ట‌నో.,. వివాదాస్పద ప్రక‌ట‌నో చేస్తే స‌రి! ఇప్పుడు రాజ‌కీయ నేత‌ల‌కు అబ్బిన విద్య ఇదే. ఇప్పటిక‌ప్పుడు ఇలా చేయ‌డ‌మే రాజ‌కీయాల్లో [more]

Update: 2019-08-25 09:30 GMT

రాజ‌కీయాల్లో త‌క్షణ‌మే గుర్తింపు రావాలంటే.. సంచ‌ల‌న ప్రక‌ట‌నో.,. వివాదాస్పద ప్రక‌ట‌నో చేస్తే స‌రి! ఇప్పుడు రాజ‌కీయ నేత‌ల‌కు అబ్బిన విద్య ఇదే. ఇప్పటిక‌ప్పుడు ఇలా చేయ‌డ‌మే రాజ‌కీయాల్లో పెద్ద ప్లస్‌గా భావి స్తున్నారు. ఇప్పుడు ఇలాంటి రూట్‌నే ఎంచుకున్నారు చింతా మోహ‌న్. సీనియ‌ర్ రాజ‌కీయ నేత అయిన ఈయ‌న కాంగ్రెస్‌లో కీల‌క నేత‌గా వ్యవ‌హ‌రించారు. ప‌లుమార్లు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు కూడా. అదే స‌మ‌యంలో రాష్ట్ర విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే, ఆ త‌ర్వాత మాత్రం ఇప్పటి వ‌ర‌కు ఆయ‌న పెద్దగా రాజ‌కీయాల్లో క్రియాశీలంగా మారింది లేదు.

మళ్లీ వెలుగులోకి….

కానీ, కాంగ్రెస్‌లోనే కొన‌సాగారు. అయితే, ఇటీవ‌ల రాష్ట్ర రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ ప్రభుత్వం చేస్తున్న ప్రక‌ట‌న‌ల‌పై స్పందించిన ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు. రాజ‌ధాని విష‌యంలో కుప్పిగంతులు వేయడం ప్రభుత్వానికి మంచిది కాద‌ని చెప్పిన ఆయ‌న .. అదే స‌మ‌యంలో ప్రజ‌ల జీవితాల‌తో ఆడుకోవ‌ద్దని హిత వు ప‌లికిన‌ట్టుగా గ‌ట్టిగానే వ్యాఖ్యానించారు దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ వ్యతిరేక మీడియా, ముఖ్యంగా జ‌గన్‌పై వ్యక్తిగ‌త క‌క్షలు, కార్పణ్యాల‌తో ర‌గిలిపోతున్న ఓ వ‌ర్గం మీడియా దీనిని హైలెట్ చేసింది. దీంతో ఒక్కసారిగా చింతా మోహ‌న్ మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చారు.

రాజధానిని తెరపైకి తెచ్చి…

ఇక‌, అదేస‌మ‌యంలో చింతా మోహ‌న్ మ‌రో సంచ‌ల‌న ప్రక‌ట‌న కూడా ఆయ‌న చేశారు. తిరుప‌తిని ఏపీ రాజ‌ధాని చేయాల‌ని , ఇక్కడైతే.. ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రంకూడా ఉండ‌బోద‌ని చెప్పారు. ఇక‌, తిరుప‌తిలో ప్రతి ఒక్కరూ పూజించే ఏడుకొండ‌ల వాడు కూడా ఉన్నాడు కాబ‌ట్టి.. ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండ‌బోవ‌ని సెంటిమెంట్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వెన‌క‌ప‌డిన ప్రాంతం… సీమ మ‌ఖ‌ద్వారంగా ఉన్న తిరుప‌తిని రాజ‌ధానిని చేస్తే ఈ ప్రాంతం అన్ని విధాలా అనువుగా ఉంటుంద‌ని ఆయ‌న స్పష్టం చేశారు.

ఎంత ప్రయత్నించినా….

తిరుప‌తిని ఎందుకు రాజ‌ధాని చేయాలో ఆయ‌న అనేక విష‌యాలు కూడా చెప్పారు. ఇలా మొత్తానికి ఒక్కసారిగా చింతా మోహ‌న్ వ్యాఖ్యలు చేయ‌డం వెనుక నియోజ‌క‌వ‌ర్గంపై ఆయ‌న దృష్టి పెట్టార‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆయ‌న ఇక్కడ నుంచి పోటీ చేసే వ్యూహంతోనే త‌న‌ను తాను ప‌ట్టిష్టం చేసుకునేందుకు వేసిన ఎత్తుగ‌డ‌లో భాగంగానే ఇలా వ్యాఖ్యానించార‌ని అంటున్నారు. ఆయ‌న‌కు మ‌ళ్లీ రాజ‌కీయంగా యాక్టివ్ అవ్వాల‌న్న ఆశ ఉన్నా… క‌నీసం లీడ‌ర్లే లేని కాంగ్రెస్‌ను ప‌ట్టుకుని వేలాడితే ఉప‌యోగం ఏంటో ? మోహ‌న్ వ్యూహం ఏంటో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News