చింతమనేని చివురుటాకులా వణికిపోతున్నారే?

తెలుగులో ఒక సామెత ఉంది. వెయ్యి గొడ్లు తిన్న రాబందు.. ఒక్క గాలివాన‌కు కూలిపోయింది. అని కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో మ‌నోళ్లు చెబుతుంటారు. ఇప్పుడు దీనిని కొంద‌రు [more]

Update: 2020-05-02 12:30 GMT

తెలుగులో ఒక సామెత ఉంది. వెయ్యి గొడ్లు తిన్న రాబందు.. ఒక్క గాలివాన‌కు కూలిపోయింది. అని కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో మ‌నోళ్లు చెబుతుంటారు. ఇప్పుడు దీనిని కొంద‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ టీడీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ చింత‌మనేని ప్రభాక‌ర్ కు అన్వయిస్తున్నారు. 2009, 2014లో వ‌రుస విజ‌యాలుసాధించిన చింత‌మ‌నేని ప్రభాకర్ ఆ ప‌ది సంవ‌త్సరాల కాలంలో రెచ్చిపోయారు. త‌న‌కు తిరుగులేద‌ని అనుకున్నారు. తాను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అనుకున్నారు. ఇక‌, త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గం సాగిలప‌డింద‌ని భావించారు.

సొంత పార్టీలోనే ఎగస్పార్టీ…..

అయితే, ఎంత ఎత్తు ఎదిగితే.. అంత‌గా ఒదిగి ఉండాల‌నే చిన్న సూత్రాన్ని చింత‌మనేని ప్రభాక‌ర్ మ‌రిచిపోయారు. ఫ‌లితంగా సొంత పార్టీలోనే ఎగ‌స్పార్టీ పెరిగేలా చేసుకున్నారు. ఇక‌,కులాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేక‌త సంపాయించుకున్నారు. ప్రతి విష‌యంలోనూ వివాదానికే ఎక్కువ‌గా స్కోప్ ఇచ్చారు. దీంతో ఆయ‌న వ్యవ‌హార‌మే ఆయ‌న శాపంగా మారి.. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయారు. స‌రే… ఎన్నిక‌ల్లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని స‌రిపెట్టుకున్నా.. వ్యక్తిగ‌తంగా చూసుకున్నా చింత‌మనేని ప్రభాక‌ర్ రాజ‌కీయ జీవితం తీవ్రమైన ఒడిదుడుకుల్లో ఉంద‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు.

మాట చెల్లుబాటు కాక…

గ‌తంలో త‌న కంటి సైగ‌ల‌తో శాసించిన నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు త‌న మాట చెల్లుబాటు కావ‌డం లేదు. అంతేకాదు, ఇటీవ‌ల స్థానిక సంస్థల ఎన్నికల నేప‌థ్యంలో ముగిసిన నామినేష‌న్ల ప‌ర్వంలోనే అధికార పార్టీ దూకుడు ప్రద‌ర్శించింది. ఇక్కడ నుంచి గెలిచిన కొఠారు అబ్బయ్య చౌద‌రి దూకుడు ముందు చింత‌మనేని ప్రభాక‌ర్ చివురుటాకులా ఒణుకుతున్నా ర‌ని అంటున్నారు స్థానిక నాయ‌కులు. నియోజ‌క‌వ‌ర్గంలో చింత‌మనేని ప్రభాక‌ర్ ఎన్నిక‌ల సంగ్రామానికి ముందే చేతులు ఎత్తేసిన‌ట్లయ్యింది. ప‌దేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి, విప్‌గా ప‌నిచేసి.. ఈ రోజు త‌న నియోజ‌క‌వర్గంలో స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున క్యాండిడేట్లను కూడా పెట్టలేని దీన‌స్థితికి చేరిపోయాడని అంటున్నారు.

84 పంచాయతీల్లో……

ఇప్పటికే ఏలూరు రూర‌ల్ మండ‌లం జ‌డ్పీటీసీ వైసీపీకి ఏవ‌గ్రీవం అయ్యింది. ఏలూరు రూర‌ల్ మండ‌లం లో 3 ఎంపీటీసీలు, దెందులూరు మండ‌లం రామారావుగూడెం ఎంపీటీసీ వైసీపీకి ఏక‌గ్రీవ‌మ‌య్యాయి. 84 పంచాయ‌తీల్లో టీడీపీ సింగిల్ డిజిట్ దాటే ప‌రిస్థితి లేదు. చివ‌ర‌కు టీడీపీ వాళ్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసే స‌త్తా లేక వైసీపీకి స‌ర్పంచ్ ప‌ద‌వి ఇస్తాం… మాకు ఉప స‌ర్పంచ్ ప‌ద‌వితో పాటు నాలుగు వార్డులు ఇవ్వాల‌ని ప్రతిపాద‌న‌లు పెడుతున్నారు. దీంతో చింత‌మనేని ప్రభాక‌ర్ రాజ‌కీయంగా తీవ్రస్థాయిలో దెబ్బతిన్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి కొఠారు అబ్బయ్య చౌదరికి ఇది తొలి విజ‌య‌మే.

చొచ్చుకుని పోతుండటంతో…..

కొఠారు అబ్బయ్య చౌదరి నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌తో నేరుగా సంబంధాలు పెట్టుకుని నిధులు తెచ్చుకుంటున్నారు. త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో స్వచ్ఛంద సంస్థల నుంచి కూడా నిధులు సేక‌రి స్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో లాక్‌డౌన్‌తో పేద‌లు ఇబ్బందులు ప‌డకుండా… కూర‌గాయ‌లు, నిత్యావ‌స‌రా లు పంపిణీ చేస్తున్నారు. కీల‌క‌మైన ప్రాజెక్టుల‌ను పూర్తి చేస్తున్నారు. ఇక‌, గ‌తంలో ఇక్కడ ప‌నులు చేసిన వారు కూడా త‌మ నిధుల కోసం ఎమ్మెల్యే ను ప్రస‌న్నం చేసుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో చింత‌మ‌నేని ప్రభాకర్ వ్యవ‌హారం చింత‌ల్లో ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News