ఈ బుల్లి దేశానిది… పెద్ద విజయమే?

కరోనా కలకలం రేపుతోంది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొవాలో తెలియక ప్రపంచం తలపట్టుకుని కూర్చొంది. అగ్ర రాజ్యాలు సైతం ఆందోళన చెందుతున్నాయి. నివారణ [more]

Update: 2020-03-29 16:30 GMT

కరోనా కలకలం రేపుతోంది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొవాలో తెలియక ప్రపంచం తలపట్టుకుని కూర్చొంది. అగ్ర రాజ్యాలు సైతం ఆందోళన చెందుతున్నాయి. నివారణ చర్యలు ఫలించక బిక్కమెుహం వేస్తున్నాయి. చైనాలోని హుబెయ్ ప్రావిన్స్ (మనదేశంలో రాష్ట్రం లాంటిది) రాజధాని వూహాన్ నగరంలో వెలుగుచుాసిన కరోనా రోజులు గడిచేకొద్దీ ప్రపంచదేశాలకు పాకి చైనాకు వేలకిలోమీటర్ల దుారంలోగల దేశాల్లో కుాడా విస్తరించింది. ఆ యా దేశాలు నానా హైరానా పడుతున్నాయి. అమెరికా భారత్, జర్మనీ, స్పెయిన్, ఇరాన్, ఇరాక్, అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాలు పడరాని పాట్లు పడుతున్నాయి. ఐరోపా దేశమైన ఇటలీలో మరణ మృదంగం వినపడుతోంది. వేలసంఖ్యలో చనిపోతున్నారు. ఎప్పటికి ఈ మహమ్మారి నుంచి ఉపశమనం లభిస్తుందో తెలియక ఆ యా దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

తమ దరి చేరనివ్వకుండా…?

ఈ విపత్కర పరిస్దితుల్లో కారుచీకట్లో కాంతిరేఖలో తైవాన్ నిలుస్తోంది. చైనా పొరుగునే ఉన్న ఈ బుల్లి దేశం కరోనాను తమ దేశానికి రానీయకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టి విజయం సాధించింది. ఇతర దేశాలతో పోలిస్తే తైవాన్ దేశం చైనాకు చాలా సమీపంలో ఉంది. ముందే ప్రమాదాన్ని పసిగట్టి పకడ్బందీ చర్యలతో కరోనాను కట్టడి చేసి అంతర్జాతీయ సమాజానికి ఆదర్శంగా నిలిచింది. చైనాకు 2102 కిలోమీటర్ల దూరంలో తైవాన్ ఉంది. అక్కడ ముత్తం 108 కరోనా కేసులు నమెాదయ్యాయి. కానీ ఒకే ఒక్కరు మృతి చెందారు. దీనిని బట్టి ఆదేశం ఎంత సమర్ధంగా వ్యవహరంచారో అర్ధమవుతుంది. వూహాన్ లో కరోనా వెలుగు చూసిన వెంటనే తైవాన్ లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) అప్రమత్తమైంది. జనవరి 21న మెుట్టమెుదటి కరోనా కేసు నమోదు కావడంతో యుద్ధప్రాతిపదికన స్పందించింది.

ముందు నుంచే అన్ని విధాలుగా…..

డిసెంబరు 31న వూహాన్ నుంచి వచ్చే ప్రయాణికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి చేసింది అప్పట్లో వూహాన్ లో నమెాదైన కేసుల సంఖ్య కేవలం 27. విదేశాల నుంచి తమదేశంలోకి అడుగుపెట్టినవారికి 26 రకాల పరీక్షలను నిర్వహించింది. పాజిటివ్ వచ్చిన వారిని తక్షణమే ‘ఏకాంత పరిశీలన’ (క్వారంటైన్) గృహాలకు తరలించింది. వ్యక్తిగత పరిశుభ్రత ఆవశ్యకతపై దేశ వ్యాప్తంగా విస్తృత పచారం చేసింది. మాస్కుల తయారీని వేగవంతం చేసింది. అంతేకాక మాస్కుల ఎగుమతులపై నిషేధం విధించింది. సైన్నాన్ని రంగంలోకి దించి మాస్కుల తయారీని ఉదృతం చేసింది. ఫిబ్రవరి 6 నుంచి వాటిని ప్రజలకు పంపిణీ చేసింది. దేశంలో ప్రతిఒక్కరికీ వీటి అందజేసింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్ధలకు సెలవులు ప్రకటించింది. అదేసమయంలో శానిటైజర్లను విస్తృతంగా ప్రజలకు అందుబాటు లోకి తీసుకువచ్చింది. ప్రజల్లో అవగాహన కల్పించింది. నివారణ చర్యలకన్నా ముందస్తు చర్యలకే ప్రాధాన్యం ఇచ్చింది. అందువల్లే ఒక ఒక్క మరణంతో ఈ మహమ్మారిని నిలువరించింది. చైనాకు పొరుగునే ఉన్న వైరస్ వ్యాప్తిని విజయవంతంగా అడ్డుకుని అంతర్జాతీయ సమాజానికి ఆదర్శంగా నిలచింది.

అనేక దేశాలు దూరంగా ఉన్నా…..

అలక్షం వహించిన దేశాలు అందుకు ముాల్యం చెల్లించాయి. చైనాకు 17,562 వేల కిలోమీటర్ల దూరంలోగల ఐరోపా దేశమైన ఇటలీ లో ఎటుచూసినా మరణ మృదంగం వినిపిస్తోంది. ఈనెల19 నాటికి 25,713 కేసులు నమెాదు కాగా ముాడువేల మందికి పైగా మృత్యువాత పడటం అందరినీ ఆందోళనపరుస్తోంది. చైనాకు 11,640 కలోమీటర్ల దూరంలోగల అమెరికా 9,486 కేసులు నమెాదు కాగా 157 మంది కన్నుముాశారు. ఐరోపా దేశమైన స్పెయిన్ లో 17,147 కేసులు నమెాదు కాగా 767 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశం చైనాకు 8,783 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనాకు 8,107 కిలో మీటర్ల దూరంలో గె మరో ఐరోపాదేశం ఫ్రాన్స్ లో 9,134 కేసులు నమెాదుకాగా 264 మంది మృతిచెందారు. 7,219 కిలో మీటర్ల దూరంలో గల జర్మనీలో 13,632 కేసులు నమెాదుకాగా 36 మంది చనిపోయారు. 4,609 కిలో మీటర్ల దూరంలో గల ఇరాక్ లో 18,407 కేసులకు గాను 1284 మంది మరణించారు. 2,117 కిలో మీటర్ల దూరంలో గల దక్షిణకొరియాలో 8,565 కేసులకు గాను 91 మంది కన్నుముాశారు. ఈ వివరాలను విశ్లేషించినపుడు చిన్న దేశమైన తైవాన్ సాధించిన విజయం ఎంత పెద్దదో అర్ధమవుతుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News