అదే ఇద్దరికీ తేడా?

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించిన యుద్ధనీతులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని అత్యంత కీలకమైనవి. వాటిని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదు. అలా చేయడం మౌలిక అంశాలకు నీళ్లొలొదడవమే అవుతుంది. [more]

Update: 2020-10-01 16:30 GMT

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదించిన యుద్ధనీతులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని అత్యంత కీలకమైనవి. వాటిని ఎవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లంఘించరాదు. అలా చేయడం మౌలిక అంశాలకు నీళ్లొలొదడవమే అవుతుంది. చేతిలో ఆయుధం లేని శత్రువుతో పొరపాటున కూడా పోరాడరాదు. అదేవిధంగా పిల్లలు, ముసలివారు, మహిళలు, సామాన్య పౌరులనులక్ష్యంగా చేసుకుని దాడులు చేయరాదు. ఒకవేళ పొరపాటున పౌరులు చిక్కినా వారిని క్షేమంగా సంబంధిత దేశానికి తిరిగి అప్పగించాలి. ఆఖరికి సైన్యం బందీలుగా చిక్కినా వారి పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలి.

భారత్ మొదటి నుంచి….

1971 బంగ్లాదేశ్ యుద్ధ సమయంలో బందీలుగా పట్టుకున్న వేలాది మంది పాక్ సైన్యాన్ని భారత్ క్షేమంగా విడుదల చేసిన విషయం గర్తుండే ఉంటుంది. జనావాస ప్రాంతాలు, విద్యా, వైద్య సంస్థలను దాడుల నుంచి మినహాయించాలి. వీటికి విరుద్ధంగా వ్యవహరించడాన్ని ఆధునిక నాగరిక సమాజం అంగీకరించదు. భారత్ ఈ నిబంధనలను మొదటినుంచీ తుచ తప్పకుండా పాటిస్తోంది. చైనా, పాకిస్థాన్లతో జరిగిన యుద్ధాల సమయంలో వీటిని పాటించింది. ఇలాంటి పద్ధతులను చైనా పాటించిన దాఖలాలు లేవు. తాజాగా భారత్-చైనా మధ్య ఘర్షణల్లో వీటిని ఉల్లంఘించి తన దుర్నీతిని చాటుకుంది. వారి చేతికి చిక్కిన భారత పౌరుల జాడ కొన్ని రోజులు తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో భారత జవాన్లకు చిక్కిన చైనా పౌరులను క్షేమంగా వెనక్కి పంపి తన మానవీయతను, ఉదారతను చాటుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలు ఇరుదేశాల వైఖరులను తేటతెల్లం చేస్తున్నాయి.

పొరపాటున వెళితే…..

ఈశాన్య భారతంలోని అరుణాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దు రాష్ట్రం. ఇక్కడే వాస్తవాధీన రేఖ (లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్- ఎల్ఏ సీ) ఉంది. దీనినే మక్ మోహన్ లైన్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ కచ్చితంగా ఇప్పటికీ సరిహద్దులను నిర్థారించలేదు. దీంతో సామాన్య పౌరులు అప్పడప్పుడూ తెలియక సరిహద్దులు దాటి పొరపాటున చైనా భూభాగంలోకి ప్రవేశించడం సహజం. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సుబన్ సిరి జిల్లాకు చెందిన అయిదుగురు పౌరులు నాచో ప్రాంతంలో అడవిలో వేట కోసం పొరపాటున చైనా భూభాగంలోకి ప్రవేశించారు. వారిలో ఇద్దరు తప్పించుకుని తిరిగి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వారు విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భాజపాకు చెందిన అరుణాచల్ ప్రదేశ్ తూర్పు నియోజకవర్గ ఎంపీ అయిన తాపిర్ గవో కు కూడా విషయాన్ని తెలియజేశారు. స్థానిక కాంగ్రస్ శాసనసభ్యుడు నినాంగ్ఎరింగ్ విషయాన్ని నేరుగా ప్రధాని మోదీ దష్టికి తీసుకెళ్లారు. రాష్రానికి చెందిన కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఈ విషయమై పోలీసు, మిలటరీ అధికారులతో చర్చలు జరిపారు. ఈ విషయమై ఇంకా ఎలాంటి ఆచూకీ లభించలేదని జిల్లా ఎస్పీ తెలిపారు. చైనా సైన్యం నుంచి ఈ విషయమైఎలాంటి ప్రతిస్పందనా లేదని ఆయన తెలిపారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. అయితే ీ ఏడాది మార్చి 19న తప్పిపోయిన యువకుడిని ఆ త రవాత చైనా తిరిగి అప్పగించిందని జిల్లా పోలీసు అధికారి తెలిపారు. చైనా సైన్యం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఇప్పటివరకు ఈ ఘటనపై అధికారికంగా నోరు మెదపకపోవడం గమనార్హం.

అదే భారత్ లో…..

ఇలాంటి ఘటనే భారత్ లో జరగగా మన సైన్యం ఉదాత్తంగా స్పందించింది. మానవీయకోణంలో వ్యవహరించి మన్ననలు అందుకుంది. మన దేశంలోని సిక్కిం రాష్ర్టం కూడా చైనాతోసరిహద్దులు కలిగి ఉంది. తాజాగా చైనా పౌరులు పొరపాటున దారి తప్పి ఉత్తర సిక్కింలోకి ప్రవేశించారు. దాదాపు 40 కిలోమీటర్లు భారత భూభాగంలోకి వచ్చారు. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు 17,500 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ గడ్డ కట్టే చలి ఉంటుంది. ప్రత్యేకమైన దుస్తులు లేకపోతే ఇక్కడి చలికి తట్టుకోవడం కష్టం. చలికి గజగజలాడుతున్న వారిని భారత సైన్యం గుర్తించింది. వారెవరన్న విషయాన్ని పక్కనపెట్టి వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంది. తక్షణం వారికి ఆహారం, ఆక్సిజన్, చలిని తట్టుకునేందుకు అవసరమైన ప్రత్యేక దుస్తులు అందజేసి వారి ప్రాణాలను కాపాడింది. వారు క్షేమంగా స్వదేశం వెళ్లేందుకు దారి చూపింది. ప్రత్యేక వాహనం ఇచ్చి సరిహద్దు ఆవలికి పంపి సహకరించింది. తద్వారా మానవీయతను చాటింది. తమకు చైనా అనే శత్రువుతోనే యుద్ధం తప్ప అమాయకులైన ఆ దేశ సామాన్య పౌరులతో కాదని ఈ సందర్భంగా ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం భారతీయ విలువలకు నిదర్శనం. ఇదీ భారత్, చైనాలకు గల తేడా. దీనిని అంతర్జాతీయ సమాజం కూడా ఏనాడో గుర్తించింది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News