జయరాం హత్య నేర్పుతున్న పాఠం

అక్రమ సంబంధాలు సక్రమంగా సాగినంత కాలం బాగానే ఉంటాయి. వీటికి తోడు ఆర్ధిక క్రమశిక్షణ లేని జీవితాలు ఎప్పుడో ఒకప్పుడు విషాదాన్ని మిగులుస్తాయి. ఇవన్నిటితో బాటు విలాసాలు [more]

Update: 2019-02-10 09:30 GMT

అక్రమ సంబంధాలు సక్రమంగా సాగినంత కాలం బాగానే ఉంటాయి. వీటికి తోడు ఆర్ధిక క్రమశిక్షణ లేని జీవితాలు ఎప్పుడో ఒకప్పుడు విషాదాన్ని మిగులుస్తాయి. ఇవన్నిటితో బాటు విలాసాలు వ్యసనాలు మనిషి జీవితాన్ని మరింత పతనం చేస్తాయి. అదే ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్న అంశం. హాయిగా భార్య పిల్లలతో సుఖ సంతోషాలతో వుండాలిసిన జయరాం తన అలవాట్ల కారణంగా అర్ధాంతరంగా హత్యకు గురికాబడి తనువు చాలించాలిసి వచ్చింది. దీనికి కారణం “మనీ” షీ.

కుప్పలు తెప్పలుగా ఇవే కేసులు ….

ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు ఆర్ధిక సంబంధాలు, అక్రమ సంబంధాలు ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తున్న కేసులు సమాజంలో విలువల పతనాన్ని సూచిస్తున్నాయి. నిత్యం తెలుగు రాష్ట్రాల్లో నమోదు అవుతున్న ఈ తరహా కేసులు పోలీసులను సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. ఐటీ రంగం తెచ్చిన ఆదాయాలతో ఇప్పుడు పబ్ లు క్లబ్ ల కల్చర్ విచ్చలవిడి తనానికి తెరతీసింది. వీటితో బాటు మద్యం, మగువ, జూదాలకు అంతా బానిసలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే కోట్ల రూపాయలు వున్నవారు సైతం రాత్రికి రాత్రి అప్పులు చేసే స్థాయికి చేరి బికారులు అవుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు కొందరు పాల్పడుతుంటే మరికొందరు హత్యలకు, కిడ్నాప్ లకు గురి అవుతున్నారు.

మార్పు రావాలంటే …?

ప్రమాదకర ధోరణిలో సాగుతున్న ప్రస్తుత పరిణామాల్లో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరు కృషి చేయాలిసి వుంది. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందేలా చేయడం. పెద్దవారు బాధ్యతలు మరిచి వ్యవహరించకుండా సమాజం పట్ల భక్తి ప్రపత్తులు కలిగివుండటం వంటివి అలవర్చుకోవాలి అని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. అదే విధంగా ఆర్ధిక క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని విలాసవంత జీవితాలకు దూరంగా ఉండటం తో పాటు ఆధ్యాత్మిక చింతన, ధార్మిక భవనాలు ప్రతి వారు అవలంభించాలని సూచిస్తున్నారు. ఆ దిశగా అడుగులు పడిన రోజున ఈ తరహా నేరాలు ఘోరాలు తగ్గుముఖం పడతాయంటున్నా నిపుణుల సూచనలు పాటించే వారు సుఖపడతారు.

Tags:    

Similar News