వీరిద్దరి దగ్గరికి షార్ట్ కట్ లో వస్తేనే బెటరట

పార్టీలో ఉంటే ఎప్పటికైనా పదవి దక్కుతుందన్న నమ్మకం ఉండాలి. పార్టీ కోసం పడిన శ్రమకు ప్రతిఫలం దక్కాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇటీవల కాలంలో కొత్తగా [more]

Update: 2021-08-03 12:30 GMT

పార్టీలో ఉంటే ఎప్పటికైనా పదవి దక్కుతుందన్న నమ్మకం ఉండాలి. పార్టీ కోసం పడిన శ్రమకు ప్రతిఫలం దక్కాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇటీవల కాలంలో కొత్తగా వచ్చిన వారికే ప్రాధన్యం దక్కుతుంది. పదవులు దక్కుతున్నాయి. దీంతో పాత కాపులంతా నిరుత్సాహంలో మునిగిపోయారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదవుల పంపిణీలో కొత్త వారికి ప్రాధాన్యం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయంగా లాభనష్టాలను బేరీజు వేసుకుని పదవుల పంపీణీని చేపడుతుండటంతో ఆది నుంచి ఉన్న వారికి పదవుల్లో అన్యాయం జరుగుతుంది.

పదిరోజుల్లోనే…..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల హుజూరాబాద్ నేత కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కేటాయించడం చర్చనీయాంశమైంది. కౌశిక్ రెడ్డి పార్టీలో చేరిన పదో రోజే చట్టసభలో సభ్యుడిగా మారారు. దీనిని తొలి నుంచి పార్టీలో ఉన్న వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీకి ఉద్యమ కాలం నుంచి పనిచేసిన వారిని పక్కన పెట్టి కేవలం ఉప ఎన్నికలో గెలుపు కోసం పదవులను పంచడమేంటన్న ప్రశ్న పార్టీ నేతల నుంచే వస్తుండటం విశేషం.

జగన్ కూడా తక్కువేమీ కాదు…

ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా తక్కువేమీ కాదు. పదవుల పందేరంలో ఉప ఎన్నికలు వంటివి లేకపోయినా భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన పదవులను భర్తీ చేస్తున్నారు. ఇటీవల తోట త్రిమూర్తులకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమేఇందుకు నిదర్శనం. తొలి నుంచి జగన్ వెంట నడచి వెన్నంటే ఉన్న వారిని పక్కన పెట్టి సామాజిక సమీకరణాల పేరుతో పదవులను పంచడంపై వైసీపీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బలంగా లేనప్పుడు….

వైసీపీ, టీఆర్ఎస్ రెండూ క్షేత్రస్థాయిలో బలంగా లేనప్పుడు కష్టపడిన నేతలను ఇద్దరు ముఖ్యమంత్రులు విస్మరించారంటున్నారు. షార్ట్ కట్ లో వచ్చిన వారికే పదవులు దక్కుతుండటంతో ఇక భవిష్యత్ లోనూ జంపింగ్ లకు అవకాశం కల్పించేలా ఇద్దరి తీరు ఉందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మొత్తం మీద జగన్, కేసీఆర్ లు తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొత్తగా చేరిన వారికి పదవులు ఇస్తూ పాత వారిని పక్కన పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News