చిదంబరం అందుకే అలా అయ్యారట

కాంగ్రెస్ పార్టీ దాదాపు ఏడేళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉంది. అనేక మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకించినా సీనియర్ నేత చిదంబరం మాత్రం హైకమాండ్ [more]

Update: 2021-05-22 18:29 GMT

కాంగ్రెస్ పార్టీ దాదాపు ఏడేళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉంది. అనేక మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకించినా సీనియర్ నేత చిదంబరం మాత్రం హైకమాండ్ కు అండగానే ఉంటున్నారు. దక్షిణాది నేత అయినప్పటికీ చిదంబరం మాత్రం హైకమాండ్ వద్ద మంచి పలుకుబడిని సంపాదించారు. ఇప్పుడు కూడా తమిళనాడులో డీఎంకే కూటమి అధికారంలోకి వస్తే భవిష్యత్ లో తనకు రాజకీయ పదవి లభిస్తుందని చిదంబరం అంచనా వేస్తున్నారు. అందుకే పార్టీకి ఇప్పుడు ప్రధాన వాయిస్ గా మారారు.

అందరూ మూగనోము పట్టినా..?

ిఇటీవల కాలంలో కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ మూగనోము పట్టారు. కనీసం కరోనాపై మోదీ వ్యవహరిస్తున్న తీరును కూడా తప్పుపట్టేందుకు ముందుకు రావడం లేదు. సోనియా, రాహుల్, ప్రియాంకల గొంతు మాత్రమే విన్పిస్తుంది. చిదంబరం కూడా ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచానన్న పేరుతో పాటు గుర్తింపును కూడా గాంధీ కుటుంబం నుంచి దక్కించుకోవాలన్న తపన చిదంబరంలో కనపడుతుంది.

రాజ్యసభకు పంపుతారని….

చిదంబరం కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. కేంద్ర ఆర్థిక మంత్రిగా ఆయన పనిచేశారు. ఒక దశలో ప్రధాని పదవికి చిదంబరం పేరు కూడా విన్పించిందంటే అతిశయోక్తి కాదు. ఎయిర్ సెల్ మ్యాక్సిస్ , ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొన్న చిదంబరం వంద రోజులకు పైగానే జైలు జీవితం కూడా గడిపి వచ్చారు. ఇప్పుడు తమిళనాడులో డీఎంకే అధికారంలోకి వస్తే రానున్న కాలంలో తనను మరోసారి రాజ్యసభకు పంపుతారన్న ఆశ చిదంబరంలో ఉంది.

మోదీపై విమర్శలు….

అందుకే చిదంబరం ఇటీవల కాలంలో యాక్టివ్ గా మారారంటున్నారు. రాహుల్ గాంధీకి మరింత సన్నిహితంగా మెలుగుతున్నారు. రాహుల్ టీంలో ఒకరుగా మారిపోయారు. తన కుమారుడు కార్తి చిదంబరం రాజకీయ భవిష్యత్ కోసమే ఆయన ప్రయత్నిస్తున్నారని కొందరు అంటున్నా, తాను ఇంకా కొన్నాళ్లపాటు కాంగ్రెస్ లో కీలక నేతగా మెలగాలన్న ఆలోచనలోఉన్నారు. అందుకే చిదంబరం మిగిలిన సీనియర్ నేతలకు భిన్నంగా వ్వవహరిస్తున్నారు.

Tags:    

Similar News