నాడి పట్టడంలో సక్సెస్…..డిఫరెంట్ స్టయిల్ తో?

నాయ‌కుల‌న్నాక‌.. ప‌ద‌వులు, అధికారం కోస‌మేనా.. ఒకింత ప్రజాసేవ కూడా చేయాల‌నే ఆలోచ‌న ఉండొద్దూ. అచ్చు ఇదే సూత్రాన్ని ఒంట‌బ‌ట్టించుకున్నారు చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి. [more]

Update: 2020-04-21 00:30 GMT

నాయ‌కుల‌న్నాక‌.. ప‌ద‌వులు, అధికారం కోస‌మేనా.. ఒకింత ప్రజాసేవ కూడా చేయాల‌నే ఆలోచ‌న ఉండొద్దూ. అచ్చు ఇదే సూత్రాన్ని ఒంట‌బ‌ట్టించుకున్నారు చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర‌రెడ్డి. అన్ని వ‌ర్గాల్లోనూ మంచి పేరు తెచ్చుకున్న చెవిరెడ్డి ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాల‌కు అతీతంగా ప్రజ‌ల మ‌న‌సుల్లో చోటు సంపాయించుకున్నారు. విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలోనూ ఇప్పుడు అధికార ప‌క్షంలో ఉన్నప్పుడు కూడా ఆయ‌న రాజ‌కీయాల్లో కీల‌క‌మైన ప్రజ‌ల నాడిని ప‌ట్టడంలో స‌క్సెస్ అయ్యారు. వాస్తవానికి ఏ నాయ‌కుడైనా కూడా.. త‌న‌కు అధికారం ఉంటేనో.. లేదా త‌న పార్టీ అధికారంలో ఉంటేనో.. ప్రజ‌ల‌కు సేవ‌చేయాల‌నే ఆలోచ‌న చేస్తారు.

సాధారణ వ్యక్తిగానే…..

కానీ, చెవిరెడ్డి మాత్రం అలా అంద‌రిలా ఆలోచించే మ‌న‌స్తత్వం కాదు. ఆయ‌న‌దంతా డిఫ‌రెంట్ స్టయిల్‌. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా. కూడా డౌన్ టు ఎర్త్ అనే ఫార్ములాను అమ‌లు చేస్తున్నారు.ఒక సాధారణ మ‌ధ్యత‌ర‌గ‌తి వ్యక్తిగానే ఆయ‌న ఆహార్యం ఉంటుంది. సూటు బూటుల‌కు క‌డు దూరం. స్టయిల్ మెయింటెన్ చేసేందుకు కూడా ఆయ‌న విముఖం. అన్నింటికీమించి త‌న నియ‌జ‌క‌వ‌ర్గంలో ప్రజ‌ల‌కు ఏ క్షణంలో అయినా అందుబాటులో ఉండే త‌త్వం కూడా చెవిరెడ్డి సొంతం. రాజ‌కీయాల్లో త‌న‌దైన బాణిలో విమ‌ర్శలు చేయ‌డంలో ఆయ‌న ఎలా గుర్తింపు పొందారో.. సేవ చేయ‌డంలోనూ ప్రజ‌ల్లో అంతే త‌ర‌హాలో ఆయ‌న గుర్తింపు సాధించారు.

కష్ట సమయంలోనూ….

ప్రజల‌కు ఏక‌ష్టమొచ్చినా.. నేనున్నానంటూ.. ఆయ‌న ముందుంటారు. అంతేకాదు, పండ‌గ‌ల‌కు ఉద్యోగులకు బ‌ట్టలు పెట్టడంలోను, తిరునాళ్ల వంటి కార్యక్రమాల‌ను విస్తృతంగా చేయ‌డంలోను కూడా ఆయ‌న ముందుంటున్నారు. త‌న అభిమానుల ఇళ్లలోనేకాదు, త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ఎవ‌రి ఇళ్లలోనైనా కూడా జ‌రిగే శుభ కార్యాల‌కు పిల‌వ‌డ‌మే త‌రువాయి.. ఆయ‌న రెక్కలు క‌ట్టుకుని వాలిపోతారు. ఇక‌, తాజాగా క‌రోనా ఎఫెక్ట్ నేప‌థ్యంలో ఇప్పటికే ప‌ది రోజుల కింద‌ట 1.6 ల‌క్షల మందికి శానిటైజ‌ర్లను సొంత నిధుల‌తో పంపిణీ చేసిన చెవిరెడ్డి తాజాగా 16 వేల ట‌న్నుల కూర‌గాయ‌ల‌ను నియోజ‌క‌వ‌ర్గంలో పంపిణీ చేసి త‌న దాతృత్వాన్ని, ప్రజాసేవ ప‌ట్ల త‌న అంకిత భావాన్ని ప్రద‌ర్శించారు.

డిఫరెంట్ గా ఆలోచిస్తూ….

జ‌న‌తా క‌ర్ఫ్యూ రోజు నుంచి నేటి వ‌ర‌కు ఆయ‌న ప్రతి రోజు నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా విష‌యంలో ప్రజ‌ల‌ను ఎప్పటిక‌ప్పుడు అప్రమ‌త్తం చేస్తున్నారు. ఇక ప్రజ‌లు ఎంత మాత్రం బ‌య‌ట‌కు రావొద్దని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పుడు మాస్క్‌ల‌తో పాటు కూర‌గాయాలు పంపిణీ చేస్తూ రాజ‌కీయాల‌కు అతీతంగా ప్రశంస‌లు అందుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప‌క్కనే ఉన్న తిరుప‌తి న‌గ‌రంలో క‌రోనా కేసులు ఉన్నాయి. దీంతో చెవిరెడ్డి చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా ముందుగానే ప‌క్కా ప్లానింగ్‌తో వ్యవ‌హ‌రిస్తూ వైసీపీ ఎమ్మెల్యేల్లో ఆయ‌న డిఫ‌రెంట్ గురూ! అని అనిపించుకుంటున్నారు. మ‌రి ఇది స్వాగ‌తించాల్సిన విష‌య‌మే క‌దా.

Tags:    

Similar News