వెన్నుపోటుకు పాతికేళ్ళు….అదీ చెప్పుకోవాలిగా?

అవును మరి ఇది కూడా చెప్పుకోవాలి. నాణేనికి రెండవ వైపు చూస్తే ఇదే కనిపిస్తుంది. పాతికేళ్ళ పాటు పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్నానని చంద్రబాబు పార్టీ క్యాడర్ ముందు [more]

Update: 2020-05-27 15:30 GMT

అవును మరి ఇది కూడా చెప్పుకోవాలి. నాణేనికి రెండవ వైపు చూస్తే ఇదే కనిపిస్తుంది. పాతికేళ్ళ పాటు పార్టీని ఒంటిచేత్తో నడిపిస్తున్నానని చంద్రబాబు పార్టీ క్యాడర్ ముందు గొప్పగా చెప్పుకోవచ్చు కానీ ఆ పార్టీ పగ్గాలు ఎలా వచ్చాయి. ఏం చేస్తే వచ్చాయి అన్న చర్చ కూడా ఉంటుంది. ఒక వైపు చంద్రబాబు చెప్పుకుంటే రెండవ వైపు ప్రత్యర్ధులు చెబుతారు. అందరి కన్నా ముందు బాబు సొంత అత్త లక్ష్మీ పార్వతే ఆ ముచ్చట చెప్పి చంద్రబాబు సంబరాన్ని నేలకు దించేస్తుంది. ఆమె చెప్పింది అని అనుకోకపోయినా తెలుగుదేశపు రాజకీయాన్ని ఒక చరిత్రగా చూసుకున్నా కూడా రెండవ వైపు అలాగే చదువుకోవాలిగా.

మచ్చేగా …?

తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఒక్కరే ఉంటారు. అలాగే ముఖ్యమంత్రిగా ఒకే పేరు వినిపిస్తుంది అని అటు పార్టీయే కాదు, ఇటు జనం కూడా బలంగా నమ్మిన రోజులవి. ఇక పార్టీలో తెరవెనక చంద్రబాబు ఎంత కష్టపడ్డారో, ఆయన వ్యూహాలు పార్టీ ఎదుగుదలకు ఎలా పనికివచ్చాయో బయట లోకానికి తెలియదు, అది వారికి అక్కరలేదు కూడా. టీడీపీ అంటే ఎన్టీఆర్, ముఖ్యమంత్రి అంటే కూడా ఆయనే. సైకిల్ పార్టీ గుర్తు అచ్చంగా అన్నగారిదే. ఇలా బలమైన ముద్ర పడిపోయిన దశలో 1994 చివరిలో బంపర్ మెజారిటీతో ఎన్నికై కేవలం ఎనిమిది నెలలు తిరగకుండానే మేరు నగధీరుడు లాంటి మహా నాయకుడిని సొంత కుటుంబ సభ్యులే కూడబలుక్కుని మరీ గద్దె దించడం. అందులో అతి ముఖ్యపాత్రధారిగా చంద్రబాబు ఉండడం ఎప్పటికీ టీడీపీకి, ఆయనకీ కూడా మాయని మచ్చే.

చెత్త రాజకీయాలా…?

చంద్రబాబుది కాంగ్రెస్ రక్తం. తన బ్లడ్ లో ముప్పై శాతం అదే ఉందని నిండు అసెంబ్లీలో చంద్రబాబు ఎపుడో చెప్పుకున్నారు. ఆయన టీడీపీలోకి రాకతో ఆ పార్టీలో స్వచ్చదనం, కొత్తదనం కలుషితం అయ్యాయన్న భావన ఆనాడే ఉండేది. ఎన్టీయార్ ఏరి కోరి విద్యావంతులను, తటస్తులను పార్టీలోకి తెచ్చి టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులుగా చేశారు. అటువంటి వారికి వెన్నుపోట్లు, విష రాజకీయాలు తెలియవు. చంద్రబాబు రాజకీయ చాణక్యం వ్యూహాలతో నాదెండ్ల భాస్కర రావు ఎపిసోడ్ లో నెగ్గామని ఎన్టీఆర్ తదితరులు సంబర పడినంత సేపు పట్టలేదు, అదే అచ్చమైన కాంగ్రెస్ విక్రుత రాజకీయం అల్లుడు రూపంలో ఇంట్లోనే ఉండి తననూ, పార్టీని నిలువెల్ల కబలిస్తుందని అన్న గారికి తెలియకపోవడం ఉత్త అమాయకత్వమే. అందుకే లక్ష్మీ పార్వతి అంటున్నారు. నాటి నుంచి నేటివరకూ చంద్రబాబు చేస్తున్నది పూర్తిగా చెత్త రాజకీయమేనని.

అది గతమేనా..?

అప్రతిహత విజయాలు, బంపర్ మెజారిటీలు అన్నీ కూడా అన్న ఎన్టీయార్ తోనే టీడిపీకి చెల్లిపోయాయి. ఆయన ఒకే ఒక్కడుగా నిలిచి జనాన్ని గెలుచుకున్నారు. ఆయనకు నేరుగా ప్రజలతోనే పొత్తులు, అందుకే ఆయన ధీమాగా ఎన్నిసార్లు ఎన్నికలు అయినా సై అనేవారు. ఇక చంద్రబాబు గారి జమానాలో అటువంటి సీనే లేదు. అత్తెసెరు మెజారిటీతో రెండు సార్లు గెలిచారు. అదీ పొత్తులతో, ఎత్తులతో దక్కిన బొటాబొటీ గెలుపు మాత్రమే. ఇక‌ ఇపుడు చూస్తే అన్ని రకాల అస్త్రాలు తుత్తునియలు అయిన వేళ చేష్టలుడిగి,వయసు మళ్ళిన చంద్రబాబు, నడివయసులో పడ్డ పార్టీకి సారధిగా ఉన్నారు. మళ్లీ తెలుగుదేశం బతికి బట్టకట్టడం కష్టమని విశ్లేషణలు ఓవైపు ఉన్న వేళ సొంత అత్త లక్ష్మీపార్వతి కూడా చంద్రబాబు రాజకీయం ఇక ముగిసింది అని ఏకంగా పెద్ద శాపమే ఇచ్చేశారు. చంద్రబాబు గారి వెన్నుపోటుకు పాతికేళ్ళు అంటూ ఆమె వగచి వాపోతున్నారు.

Tags:    

Similar News