వీక్ గా ఉన్న చోటనే…??

పార్టీ బలహీనంగా ఉన్న చోటనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించారు. సంక్రాంతి తర్వాత చేరికలతో తెలుగుదేశం పార్టీలో జోష్ నింపాలన్నది [more]

Update: 2019-01-13 13:30 GMT

పార్టీ బలహీనంగా ఉన్న చోటనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించారు. సంక్రాంతి తర్వాత చేరికలతో తెలుగుదేశం పార్టీలో జోష్ నింపాలన్నది చంద్రబాబు ప్రయత్నం. తమకు బలం ఉన్న చోట కాకుండా, బలహీనంగా ఉండే ప్రాంతాల్లోనే చేరికలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం మంచి రోజులు లేకపోవడంతో చేరాలనుకున్న నేతలుకూడా మంచి ముహూర్తం కోసం వెయిట్ చేస్తున్నారు. వీరిలో కొందరు ముహూర్తాలను ఇప్పటికే ఖరారు చేసుకుని చంద్రబాబు సమయం ఎప్పుడిస్తారా? అని వెయిట్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు నేతలు ఎంతమంది పార్టీలో చేరితే అంత మైలేజీ వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు.

చేరికలు లేకపోవడంతో…

గత కొన్ని నెలలుగా చేరికలు పార్టీలో లేవు. జగన్ పాదయాత్రకు మంచి స్పందన వస్తుండటంతో నేతలు కూడా తమంతట తాముగా టీడీపీలోకి వచ్చేందుకు పెద్దగా సుముఖత చూపడం లేదు. దీనివల్ల పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టాలని చేరికలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన సినీనటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావును పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూడా ముహూర్తం నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. అయితేఈమెకు మంగళగిరి టిక్కెట్ పై ఎటువంటి హామీ లభించలేదన్నది సమాచారం.

పొలిటికల్ లీడర్స్ కాకుండా….

కేవలం రాజకీయ పార్టీ నేతలను మాత్రమే కాకుండా ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులను కూడా రాజీనామా చేయించి పార్టీలోకి తీసుకు వచ్చే యోచనలో చంద్రబాబు ఉన్నారు. మేధావి వర్గాలను మంచి చేసుకోవడం ద్వారా ప్రజల్లోకి మంచి సంకేతాలను పంపాలనుకుంటున్నారు చంద్రబాబు. వీరితో పాటుగా సినీ పరిశ్రమకు చెందిన వారిని కూడా పార్టీలోకి ఆహ్వానించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సినీనటులు పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. వీరు కూడా చేరితే పార్టీకి మంచి ఊపు వస్తుందని ఆయన భావిస్తున్నారు.

పొత్తు అంటూనే…..

ఒకవైపు కాంగ్రెస్ తో పొత్తు అంటూనే మరోవైపు ఆ పార్టీ నేతలకు చంద్రబాబునాయుడు గాలం వేయడం కూడా చర్చనీయాంశమైంది. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి, సాకే శైలజానాధ్, అహ్మదుల్లా, సబ్బం హరి వంటి వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. అయితే వీరితో ఒక దఫా చర్చలు పూర్తయ్యాయి. డీఎల్ రవీంద్రారెడ్డికి మైదుకూరు, అహ్మదుల్లాకు కడప అసెంబ్లీ టిక్కెట్ ఇస్తామన్న హామీ వీరికి లభించినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ తమపై నెపం మోపకుండా వారంతట వారే తమ పార్టీలోకి వచ్చేలా చంద్రబాబు వ్యూహంరూపొందించారు. మరి సంక్రాంతి తర్వాతమాత్రం తెలుగుదేశం పార్టీని చేరికలతో కళకళలాడే చేయాలన్నది చంద్రబాబు ఆలోచన.మరి ఏంజరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News