సొంతూర్లో బాబు హల్ చల్ … !!

పండగకు సొంతూరు వెళ్ళి మస్తు ఎంజాయ్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి, మనుమడు దేవాన్ష్ తో [more]

Update: 2019-01-16 09:30 GMT

పండగకు సొంతూరు వెళ్ళి మస్తు ఎంజాయ్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తన సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మిణి, మనుమడు దేవాన్ష్ తో చిత్తూరు జిల్లా నారావారిపల్లె లో సందడి చేశారు. ఇక బావమరిది, వియ్యంకుడు అయిన బాలకృష్ణ కూడా సతీ సమేతంగా నారావారిపల్లెలో కుమార్తె అల్లుడితో పండగ ను పంచుకున్నారు. నారా నందమూరి కుటుంబాలకు చెందిన వారంతా పల్లెకు రావడంతో వీరిని చూసేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ క్యాడర్ నారావారిపల్లెకు రావడంతో వారందరిని ఇంటికి వెళ్ళి కుటుంబాలతో గడపాలని చంద్రబాబు సున్నితంగా వెనక్కి పంపారు. గ్రామంలో రెండెడ్ల బండిని మనుమడితో కలిసి ఎక్కి బాబు హల్చల్ చేసి ఆకట్టుకున్నారు. ఇక బాలయ్య, లోకేష్ లు ఎప్పటిలానే ఆటపాటల్లో మునిగి తేలారు.

పాలకొల్లులో అల్లు అర్జున్ …

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈసారి పండగ తన తాత ఊర్లో జరుపుకున్నారు. భార్య తో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు చేరుకున్నారు. పంచారామా క్షేత్రాల్లో ఒకటైన క్షీరా రామలింగేశ్వర ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు అర్జున్. తన తాత అల్లురామలింగయ్య విగ్రహానికి దండ వేసి నివాళులు అర్పించారు. ఇక తమ అభిమాన స్టార్ రావడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ బ్యాక్ ర్యాలీలతో ఘనస్వాగతం పలికారు.

Tags:    

Similar News