బాబు తమ్ముళ్లకు చెప్పింది వింటే…!

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం స‌హ‌జమే! అయితే, ఇప్పుడు మారుతున్న రాజ‌కీయాల్లో మాత్రం ఈ ప‌రిస్థితి చాలా తీవ్రంగా క‌నిపిస్తోంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు [more]

Update: 2018-12-30 11:00 GMT

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థులు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం స‌హ‌జమే! అయితే, ఇప్పుడు మారుతున్న రాజ‌కీయాల్లో మాత్రం ఈ ప‌రిస్థితి చాలా తీవ్రంగా క‌నిపిస్తోంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డంతోనే స‌రి పెట్టుకోవ‌డం లేదు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల వ‌ర‌కు కూడా వెళ్తున్నారు. ఈ ప‌రిణామాల‌పైనే తాజాగా స్పందించారు టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు, తిట్లు ఓట్లు రాలుస్తాయా? అనేది ఆయ‌న ప్ర‌శ్న. నిజ‌మే.. నిన్న మొన్న‌టి తెలంగాణా ఎన్నిక‌ల్లోనూ నాయ‌కులు చాలా వ‌ర‌కు హ‌ద్దులు మీరారు. అరెయ్‌.. ఒరెయ్ అనే వ్యాఖ్య‌లు (మాజీ మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి ఏపీ నేత‌ల‌ను ఉద్దేశించి ఇలానే వ్యాఖ్యానించారు) కూడా చేశారు.

జగన్,చంద్రబాబులు…..

అయితే, ఇలాంటి వ్యాఖ్య‌లు ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు లేక‌పోయినా.. కొన్నాళ్ల‌కింద‌టి వ‌ర‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. చంద్ర బాబును నువ్వు-నువ్వు అనే ఏక వ‌చ‌నంతోనే సంబోధించారు. ఈ విష‌యంపై త‌మ్ముళ్లు చాలానే నొచ్చుకున్నారు. తండ్రి లాంటి నాయ‌కుడిని ప‌ట్టుకుని ఏక‌వ‌చ‌నంతో సంబోధించ‌డం త‌గునా? అని ఎదురు దాడి చేశారు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక ల‌కు నాలుగు మాసాలే గ‌డువు ఉన్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు త‌న పార్టీ నాయ‌కుల‌కు కొన్ని హిత‌వులు ప‌లికారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు పెద్ద‌పీట వేయాల‌ని ఆయ‌న ఆదేశించారు. అదేస‌మ‌యంలో పార్టీని ప్ర‌జ‌ల్లోకి మ‌రింత‌బ‌లంగా తీసుకు వెళ్లాల‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల‌తో ల‌బ్ది పొందుతున్న‌వారిని ముందు వ‌రుస‌లోకి తీసుకు వ‌చ్చి పార్టీకి అనుకూలంగా ప్ర‌చారం చేయించాల‌ని దిశానిర్దేశం చేశారు.

వ్యక్తిగత విమర్శలకు వద్దంటూ…..

అదే స‌మ‌యంలో పార్టీ నాయ‌కులు ఎక్క‌డా ప్ర‌త్య‌ర్థుల వ్య‌క్తిగత విష‌యాల జోలికి పోరాద‌నే విష‌యాన్ని నొక్కి చెప్పారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఓట్లు రాల‌తాయ‌ని అనుకుంటే పెద్ద పొర‌పాటు అవుతుంద‌ని చంద్ర‌బాబు చేసిన సూచ‌న‌ల ఆ ఒక్క పార్టీ నేత‌ల‌కే కాదు.. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి పార్టీకి, ప్ర‌తి నేత‌కూ అనుస‌రించే సూచ‌నే అవుతుంది. కానీ, ఇలాంటి సూచ‌న‌ల‌ను ఎంత‌మంది పాటిస్తారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌. సో.. ఏదేమైనా రాజ‌కీయాల్లో మార్పు అనేది అవ‌స‌రమ‌నే మేధావుల సూచ‌న‌లకు, ఆరోగ్య‌క‌ర రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు చెబుతున్న సూచ‌న‌ల‌ను ఏమేర‌కు మార్గాన్ని సుగ‌మం చేస్తాయో చూడాలి. ప్ర‌స్తుతం అధికారం కోసం పోరుకు దిగుతున్న జ‌న‌సేన‌, వైసీపీలు ఈ సూత్రాన్ని పాటిస్తాయా? లేక‌.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో గ‌ట్టు దాటాల‌ని నిర్ణ‌యించుకుంటాయా? అనేది చూడాలి.

Tags:    

Similar News