ముగ్గురిదీ ఒకే టార్గెట్

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వంద రోజులకే వేడెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ త్వరగానే జనం బాట పట్టాయి. ఇందుకు ఎన్నికలు మూడేళ్లలోనే వచ్చే అవకాశం కావచ్చు. స్థానిక సంస్థల [more]

Update: 2019-09-07 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వంద రోజులకే వేడెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ త్వరగానే జనం బాట పట్టాయి. ఇందుకు ఎన్నికలు మూడేళ్లలోనే వచ్చే అవకాశం కావచ్చు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని కావచ్చు. మరోవైపు ఓటమి భారంతో కుంగిపోయిన క్యాడర్ ను ఉత్తేజ పర్చడం కోసం కావచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారాన్ని చేపట్టి వందరోజులే అయింది. అయితే వందరోజులు ఒక యుగంలా విపక్ష పార్టీలకు తోచినట్లుంది. అందుకే వారు జిల్లాల బాట పట్టారు.

క్యాడర్ లో ధైర్యం నింపేందుకు….

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇకపై వారానికి రెండు రోజుల పాటు జిల్లాల్లో పర్యటించాలని ఆయన షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతున్నారు. ఓటు బ్యాంకు ఆ నియోజకవర్గంలో చెదిరిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేతలకు వివరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నేతలను సమాయత్తం చేసేందుకు కూడా చంద్రబాబు తన పర్యటనలను వినియోగించుకుంటున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలే…..

ఇక మరో ప్రధాన పక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సయితం జిల్లాల పర్యటనలను ప్రారంభించారు. గతంలో ఒకసారి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన పవన్ కల్యాణ్ తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. మేధోమధనం జరుపుతున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లానని పవన్ కల్యాణ్ క్యాలెండర్ ను రూపొందించుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలన్నది పవన్ కల్యాణ్ వ్యూహంగా కన్పిస్తుంది.

సంక్షేమ పథకాలతో….

అధికారంలో ఉన్న వైఎస్ జగన్ సయితం జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో జగన్ జనం ముందుకు వెళుతున్నారు. జగన్ పర్యటనలతో అధికారుల్లో జవాబుదారీతనం తేవడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా సాగుతున్నాయి. జగన్ సయితం స్థానిక సంస్థల లక్ష్యంగానే పర్యటనను ప్రారంభించారు. మొత్తం మీద వందరోజులకే ఏపీలో రాజకీయం హీటెక్కిందనే చెప్పాలి.

Tags:    

Similar News