చంద్రబాబులో భయం కనిపిస్తుందా..?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇవాళటితో ప్రచారం ముగియనుంది. ఈ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో కొత్త భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత [more]

Update: 2019-04-09 05:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఇవాళటితో ప్రచారం ముగియనుంది. ఈ దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో కొత్త భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత వారం రోజులుగా ఆయన ప్రచార తీరు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ చేస్తున్న ప్రచారాన్ని గమనిస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది. చివరి దశలో ఎన్నికల ప్రచారశైలిలో రూట్ మార్చిన చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్ రూట్ లో వెళుతున్నారు. మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో తానే అభ్యర్థినని చెబుతున్నారు. తనను చూసే ఓట్లేయాలని కోరుతున్నారు. టీడీపీ శ్రేణుల ప్రచారం కూడా ఇదేరకంగా జరుగుతోంది. చంద్రబాబు ఈ రకమైన ప్రచారం చేయడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, అభ్యర్థులపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే కారణం అంటున్నారు. తరచూ సర్వేలు చేయించుకొని, సర్వేలపై ఎక్కువగా ఆధారపడే చంద్రబాబు ఈ విషయాన్ని గమనించారని, అందుకే తనను చూసి ఓట్లేయాలని కోరుతున్నారని తెలుస్తోంది.

అన్నింటా అభ్యర్థి ఆయనే

ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఇదేరకంగా ప్రచారం చేయించారు. అన్ని చోట్లా తానే అభ్యర్థినని, తనను చూసే ఓట్లేయాలని కోరారు. ఇందుకు ప్రధాన కారణం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇదే ప్రచారం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారవ్యూహం వర్కౌట్ అయ్యింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న వారు సైతం కేసీఆర్ ఫోటో మళ్లీ గెలుపొందారు. ఇప్పుడు ఏపీలో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఆరోపణలు, ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఇక, జన్మభూమి కమిటీలపై ప్రజల్లో మరింత కోపం ఉంది. ఈ ఐదేళ్లల్లో టీడీపీ నేతలపై చాలా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏ సర్వేలో తేలిందో ఏమో గానీ చంద్రబాబు రూట్ మార్చి తనను చూసి ఓట్లేయాలని కోరుతున్నారు.

అభ్యర్థులపై వ్యతిరేకత ఉండటంతో…

175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో చంద్రబాబే అభ్యర్థి అంటూ తెలుగుదేశం ప్రచారం చేస్తోంది. పార్టీ నేతల పట్ల వ్యతిరేకత, ఆరోపణలు ఉన్నా చంద్రబాబు పట్ల ప్రజల్లో కొంత సానుకూలత ఉంది. ఈ వయస్సులోనూ బాగా కష్టపడతారని, అనుభవం ఉందని, విజన్ ఉందని కొందరు నమ్ముతారు. ఇదే గత ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు కూడా ఇదే ప్రచారం టీడీపీ చేస్తోంది. అయితే, తెలంగాణలో కేసీఆర్ పై ప్రజల్లో ఉన్న సానుకూలత అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతను డామినేట్ చేసి విజయం కట్టబెట్టింది. మరి, ఆంధ్రప్రదేశ్ లో మరీ అంత సానుకూలత ఉందా అనేది చూడాలి. ముఖ్యంగా, అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతనే టీడీపీకి ప్రధాన ఇబ్బంది. మరి, ఈ వ్యతిరేకతను చేధించి చంద్రబాబు తన ఇమేజ్ తో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తారా చూడాలి.

Tags:    

Similar News